పత్రికా ప్రకటన తిరుమల, 17 ఏప్రిల్ 2024
ఏప్రిల్ 18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ఏప్రిల్ 22న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఏప్రిల్ 23న అంగప్రదక్షిణం టోకెన్లు....
జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా....
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా...
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఏప్రిల్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల
తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ఏప్రిల్ 27న శ్రీవారి సేవ కోటా విడుదల
ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
------------------------------------------------------------
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: