April Tax Deadlines: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్. ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే!
ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే!
April Tax Deadlines: ఈ ఏప్రిల్‌లో కీలక పనులు కొన్ని కచ్చితంగా పూర్తి చేయాలి. ఆ పన్ను బాధ్యతలు ఏవో తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారతదేశం ఫైనాన్షియల్ ఇయర్ సిస్టమ్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు నడుస్తుంది. ఈ సిస్టమ్‌ను గవర్నమెంట్ అకౌంటింగ్, పన్నులు, దేశవ్యాప్తంగా వ్యాపారాలకు ఉపయోగిస్తారు. ఇది జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే క్యాలెండర్ ఇయర్ సిస్టమ్‌కి భిన్నంగా ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో, మారనున్న ఆర్థిక అంశాలు, పన్ను సంబంధిత గడువులు గుర్తుంచుకోవడం ముఖ్యం.
ఇండివిడ్యువల్స్, బిజినెస్‌లు, పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా వివిధ పన్ను చట్టాలు, రూల్స్ ఫాలో అవ్వాలి. గడువులోగా సక్రమంగా పన్ను బాధ్యతలు పూర్తి చేయకపోతే పెనాల్టీలు పడే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చట్టమైన సమస్యలు కూడా ఎదురుకావచ్చు. ఈ ఏప్రిల్‌లో కూడా ఇలాంటి కీలక పనులు కొన్ని కచ్చితంగా పూర్తి చేయాలి. ఆ పన్ను బాధ్యతలు ఏవో తెలుసుకుందాం.
పొరపాటున వీటిలో ఇన్వెస్ట్ చేసారా?? ఇంక మీ పిల్లల కలలు తీరినట్టే!!
2024, ఏప్రిల్ 7:
2024 మార్చి నెలలో ప్రభుత్వ కార్యాలయం డిడక్ట్ చేసిన లేదా కలెక్ట్ చేసిన పన్నులను డిపాజిట్ చేయడానికి గడువు. అయితే, ప్రభుత్వ కార్యాలయం పన్నులు డిడక్ట్ చేస్తే, వాటిని నేరుగా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఆదాయ పన్ను చలాన్ అవసరం లేకుండా పన్ను చెల్లించిన రోజే కేంద్రానికి డిపాజిట్ చేయాలి.
ఏప్రిల్ 14:
2024 ఫిబ్రవరిలో సెక్షన్ 194M కింద డిడక్ట్ చేసిన ట్యాక్స్‌కి TDS సర్టిఫికెట్‌లను జారీ చేయడానికి గడువు.
2024 ఫిబ్రవరిలో స్పెసిఫైడ్ పర్సన్‌ల ద్వారా సెక్షన్ 194S కింద డిడక్ట్ చేసిన ట్యాక్స్‌కి TDS సర్టిఫికెట్‌లను జారీ చేయాలి.
2024 ఫిబ్రవరిలో సెక్షన్ 194-IA కింద డిడక్ట్ చేసిన ట్యాక్స్‌కి TDS సర్టిఫికెట్‌లను జారీ చేయడానికి గడువు.
2024 ఫిబ్రవరిలో సెక్షన్ 194-IB కింద డిడక్ట్ చేసిన ట్యాక్స్‌కి TDS సర్టిఫికెట్‌లను జారీ చేయాలి.
వెనక్కితర్వాత
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఏప్రిల్ 15:
ఆథరైజ్డ్ డీలర్లు 2024 మార్చితో ముగిసే త్రైమాసికానికి ఫామ్ నెం.15CCలో ఫారిన్ రెమిటెన్స్‌లకు సంబంధించి క్వార్టర్లీ స్టేట్‌మెంట్ అందజేయాలి.
2024 మార్చిలో సిస్టమ్‌లో నమోదు చేసుకున్న తర్వాత క్లయింట్ కోడ్‌లు మారిన ట్రాన్సాక్షన్‌లకు సంబంధించి స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఫారం నెం.3BBలో స్టేట్‌మెంట్‌ను అందించడానికి గడువు.
ఏప్రిల్ 30:
2023 అక్టోబరు 1 నుంచి 2024 మార్చి 31 వరకు స్వీకరించిన ఫామ్ నెం.60 వివరాలతో కూడిన ఫామ్ నంబర్ 61లోని డిక్లరేషన్‌లను తప్పనిసరిగా ఇ-ఫైల్ చేయాలి.
2024 మార్చితో ముగిసే త్రైమాసికానికి ఫారమ్ 15G/15Hలో రిసీపియంట్స్ డిక్లరేషన్‌లను అప్‌లోడ్ చేయండి.
అసెస్సింగ్ ఆఫీసర్ సెక్షన్ 192, 194A, 194D లేదా 194H కింద క్వార్టర్లీ అనుమతిస్తే 2024 జనవరి నుంచి 2024 మార్చి వరకు TDS డిపాజిట్ చేయండి.
దుబాయ్ లో బంగారం ధర చాలా తక్కువ! కారణం తెలుసా! మరీ అంత తేడానా?
2024 మార్చిలో సెక్షన్ 194M కింద డిడక్ట్ చేసిన ట్యాక్స్‌కి చలాన్-కమ్-స్టేట్‌మెంట్ తప్పనిసరిగా సమర్పించాలి.
ప్రభుత్వ కార్యాలయాలు చలాన్ లేకుండా 2024 మార్చికి TDS/TCS చెల్లిస్తే ఫామ్ 24G సమర్పించాలి.
2024 మార్చిలో సెక్షన్ 194-IA కింద డిడక్ట్ చేసిన ట్యాక్స్‌కి చలాన్-కమ్-స్టేట్‌మెంట్ అందజేయడానికి గడువు.
2024 మార్చిలో సెక్షన్ 194-IB కింద డిడక్ట్ చేసిన ట్యాక్స్‌కి చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను అందించడానికి గడువు.
2024 మార్చిలో స్పెసిఫైడ్ పర్సన్స్ ద్వారా సెక్షన్ 194S కింద డిడక్ట్ చేసిన ట్యాక్స్‌కి చలాన్-కమ్-స్టేట్‌మెంట్ సమర్పించాలి.
అసెస్సీలు, ప్రభుత్వ కార్యాలయాలు మినహా, 2024 మార్చికి డిడక్ట్ చేసిన ట్యాక్స్ డిపాజిట్ చేయాలి.
ఇవి కూడా చదవండి:
భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ!! ఆవేదన పంచుకున్న కూలీలు!!
రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!
అమల్లోకి వచ్చిన ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్!! ఇక ఆ వాడకం కు చెక్!!
కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!
ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి