ఖతార్లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. శాశ్వత, తాత్కాలిక ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఒక నోటీసును జారీ చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండడం ప్రాథమిక అర్హత. కంప్యూటర్ గురించి అవగాహన, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా ఏమేం ఉండాలంటే..
ఖతార్ లోని ఇండియన్ ఎంబసీలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా గుర్తింపు ఉన్న సంస్థ లేదా కార్యాలయంలో క్లరికల్ పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
అరబిక్ లో ప్రావీణ్యం ఉంటే మీకు ఉద్యోగం లభించడం ఇంకా సులువు అవుతుంది. అభ్యర్థులు తమ అదనపు అర్హతలు, పని అనుభవం లేదా సర్టిఫికెట్లను అప్లికేషన్ లో చూపవచ్చు. అన్ని అలవెన్సులతో కలిపి నెలవారీ జీతం 5,500 ఖతార్ రియాల్స్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.25 లక్షలు ఉంటుంది. చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 7, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పంపడానికి ప్రచురించిన నోటీసుతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో లింక్ అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ నేతల కక్ష సాధింపు!! బాధిత కుటుంబం ఆవేదన
అర్హులైన ప్రతిఒక్కరికి సూపర్-6 పథకాలు: కొలికపూడి
నెల్లూరు ఎస్పీపై సీఈవోకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత!!
గుంటూరు: అధికారంలోకి రాగానే పండ్ల మార్కెట్ కోసం కాంప్లెక్స్!! హామీ ఇచ్చిన పెమ్మసాని, నసీర్
దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం!! నా కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ధన్యవాదాలు! పిఠాపురం బహిరంగ సభలో పవన్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి