రామ్ గోపాల్ వర్మ తన కొత్త హారర్ కామెడీ చిత్రం పోలీస్ స్టేషన్ మైన్ భూత్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సిద్ధంగా అవుతున్నారు. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ మరియు జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చిత్రానికి హైప్‌ను పెంచేందుకు దర్శకుడు రమ్యా కృష్ణన్ యొక్క ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. బాహుబలి చిత్రంలో కనిపించిన తర్వాత రమ్యా కృష్ణన్ ఇలాంటి అవతార్‌లో చూడడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే పెరిగాయి.
రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేదికైన ఎక్స్ ద్వారా షేర్ చేసిన ఫోటోలో రమ్యా కృష్ణ కాజల్ వేసుకుని, గాఢమైన లిప్ కలర్ అల్లకల్లోలమైన జుట్టు, ముక్కు మాళ కొన్ని ఫన్నీ జువెలరీ ధరించి ముఖం మరియు శరీరంపై టాటూలతో కనిపిస్తున్నారు. .
రామ్ గోపాల్ వర్మ తన అధికారిక X ఖాతాలో రమ్యా కృష్ణన్ యొక్క లుక్ ను షేర్ చేస్తూ "ఇది రమ్యా కృష్ణన్ పోలీస్ స్టేషన్ మైన్ భూత్ లో" అని పేర్కొన్నారు.
ఈ కథ ఒక రకమైన థ్రిల్లర్ ఒక భయంకరమైన ఆలోచనతో మనం భయపడితే పోలీస్‌కి పరుగెత్తుతాము, కానీ పోలీసులు భయపడితే ఎవరి వద్ద పరుగెత్తతారు? అనే అంశం పై జరుగుతుందని చిత్ర పరిశ్రమంలో టాక్ వినిపిస్తుంది
పోలీస్ స్టేషన్ మైన్ భూత్ సినిమాకు ప్రేక్షకులు ప్రత్యేకమైన హారర్ కామెడీ అనుభూతిని ఎదుర్కోవడానికి ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ అది స్త్రీ తత్వాన్ని కించపరిచేటట్లుగా సినిమాలు చేస్తున్నారని ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న రామ్ గోపాల్ వర్మ నుండి ఈ చిత్రం రావడంతో మరల పాత రామ్ గోపాల్ వర్మ అని చూపిస్తాడేమోనని ప్రేక్షకులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.