AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు!

 ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొత్త నోట

2026-01-05 17:28:00
DGCA కొత్త నిబంధనలు జారీ! విమానాల్లో వాటికి నో ఎంట్రీ!

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కడప జిల్లాలోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌)లో పనిచేస్తున్న క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ (సీసీసీ)లో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు డీఎంఈ స్పష్టం చేసింది.

SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

ఈ నియామక ప్రక్రియలో మొత్తం 34 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ పోస్టులు 30, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లి (ఎంఎన్‌ఓ) 1, ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లి (ఎఫ్‌ఎన్‌ఓ) 2, అలాగే స్టెచ్చర్‌ బాయ్‌ 1 పోస్టు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది అరుదైన అవకాశం. ముఖ్యంగా పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.

Bhairavs entry: భారత సైన్యంలోకి భైరవ్ ఎంట్రీ.. శత్రువులపై మెరుపు దాడులకే కొత్త ఫోర్స్!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లి పోస్టుకు దరఖాస్తు చేసే వారు తప్పనిసరిగా ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 12, 2026 లోపు సమర్పించాల్సి ఉంటుంది.

Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు..

ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష లేదు అన్నది విశేషం. అభ్యర్థుల విద్యార్హతలు, మెరిట్‌ ఆధారంగా మాత్రమే తుది ఎంపిక జరగనుంది. తాత్కాలిక మెరిట్‌ జాబితాను ఫిబ్రవరి 21, 2026న, తుది ఎంపిక జాబితాను మార్చి 17, 2026న విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ.15,000 వరకు జీతం చెల్లించనున్నారు. దరఖాస్తులను ప్రిన్సిపల్‌, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, పుట్లంపల్లి, కడప కార్యాలయంలో నేరుగా అందించాల్సి ఉంటుంది.

Eating almonds: రోజూ బాదం తింటే శరీరానికి వచ్చే 6 అద్భుత లాభాలు.. గుండె నుంచి మెదడు వరకు!
మళ్లీ తండ్రైన అంబ‌టి.. కొడుకు పుట్టాడంటూ పోస్ట్! సోషల్ మీడియాలో వైరల్..
Bunny incident: అభిమానమే శత్రువయ్యిందా.. బన్నీ ఘటనపై చర్చ!
రేషన్ కార్డు ఉన్నవారికి అకౌంట్లోనే డబ్బులు! దేశవ్యాప్తంగా మొదలైన ఆసక్తికర చర్చ! కేంద్రం బిగ్ ఆఫర్..
Aviation News: ఆ రాష్ట్రానికి శుభవార్త… కొత్త విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్!!
New Phone: రియల్‌మి సంచలనం.. కేవలం రూ. 10,499 కే 108MP కెమెరా, 7400mAh బ్యాటరీతో..

Spotlight

Read More →