బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు! 135 ఏళ్ల తర్వాత జనవరిలో.. Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో.. తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా? బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు! 135 ఏళ్ల తర్వాత జనవరిలో.. Weather: తాజా రిపోర్ట్ - ముంచుకొస్తున్న వాయుగుండం.! 36 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో - గంటకు 15 కిలోమీటర్ల వేగంతో.. తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా?

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు! 135 ఏళ్ల తర్వాత జనవరిలో..

2026-01-10 12:43:00
Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ!

సాధారణంగా జనవరి నెల అంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి, తెల్లవారుజామున మంచు కురిసే చలి వాతావరణం ఉంటుంది. కానీ, ఈ ఏడాది (2026) వాతావరణం అనూహ్యంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Deep Depression) కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం ముఖ్యంగా తమిళనాడు, కేరళపై ఎక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ జిల్లాలపై కూడా దీని నీడ పడింది.

Osteoarthritis: వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులకు చెక్..! స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల సంచలన పరిశోధన!

వాయుగుండం ప్రస్తుత పరిస్థితి ఏమిటి.?
జనవరి 5న నైరుతి బంగాళాఖాతంలో ప్రారంభమైన ఆవర్తనం, క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, ఈ తీవ్ర వాయుగుండం నేడు (శనివారం) మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఉత్తర శ్రీలంక తీరాన్ని ట్రింకోమలి - జాఫ్నా మధ్య దాటే అవకాశం ఉంది. జనవరి మాసంలో బంగాళాఖాతంలో ఇంతటి తీవ్రమైన వాయుగుండం ఏర్పడటం 135 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది అత్యంత అరుదైన 'జనవరి సైక్లోనిక్ డిస్టర్బెన్స్'గా రికార్డులకు ఎక్కింది.

US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!!

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవి.?
తీవ్ర వాయుగుండం శ్రీలంక వైపు వెళ్తున్నప్పటికీ, దాని బాహ్య వలయాల ప్రభావంతో ఏపీలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, అన్నమయ్య, మదనపల్లి, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కృష్ణపట్నం, నిజాంపట్నం వంటి రేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

AP Government: సంక్రాంతి పేరుతో బస్సు టికెట్ల దోపిడీ.. ఏపీ సర్కార్ సీరియస్!

ఏ రాష్ట్రాల్లో రెడ్/ఆరెంజ్ అలర్ట్..?
ఫలితంగా తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. జనవరిలో తీవ్ర వాయుగుండం, తుఫాన్ ను తమిళనాడు ఎదుర్కొంటోండటం 135 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. డెల్టా ప్రాంతం, కోస్తా, ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వచ్చే 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నాడు రామనాథపురం, పుదుక్కోటై, తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం జిల్లాలతో పాటు కారైకల్ ప్రాంతంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. 

Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే?

నాగపట్టణం, తిరువారూర్, కారైకల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రామనాథపురం, తంజావూరు, మైలాడుతురై, పుదుక్కోట, కడలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వీటితో పాటు శని, ఆాదివారాల్లో అరియలూర్, విల్లుపురం, కాల్లకురిచి, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, తంజావూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం వరకూ వర్షాలు కొనసాగుతాయి. ఈ తడి వాతావరణం ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దీని ప్రభావంతో కేరళ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాసర్ గాడ్, కన్నూర్, ఇడుక్కి జిల్లాలపై దీని ప్రభావం ఉంది. ఇడుక్కి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అలాగే- తమిళనాడును ఆనుకుని ఉన్న ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమ జిల్లాలపైనా వర్షాల పడనున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.

Rajasaab: బాక్సాఫీస్ హీట్.. టికెట్ రేట్ల వివాదం.. రాజాసాబ్ చుట్టూ చర్చ!
Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!!
Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం!
SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు!
Railway Updates: ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ డివిజన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెంపు.. ఈ మార్గాలు కీలకం..!
Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి!
Morning Habits: ఉదయం మీరు చేసే ఒక్క అలవాటు… 80% గుండెపోటులకు కారణమట!
AP TET 2025: ఏపీ టెట్‌–2025 తుది ఫలితాలు విడుదల… ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్‌ చూసుకోండి..!!

Spotlight

Read More →