Ebola: హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు చికిత్స! Health Tips: బీర్ తాగితే ఆ ప్రాబ్లెమ్ తగ్గుతుందనుకుంటున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Health Tips: గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నారా... ఈ ఒక్క డ్రింక్‌తో జీర్ణ సమస్యలన్నీ మాయం! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Health Tips: పదే పదే టీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Ebola: హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు చికిత్స! Health Tips: బీర్ తాగితే ఆ ప్రాబ్లెమ్ తగ్గుతుందనుకుంటున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Health Tips: గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నారా... ఈ ఒక్క డ్రింక్‌తో జీర్ణ సమస్యలన్నీ మాయం! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Health Tips: పదే పదే టీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం!

Ebola: హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు చికిత్స!

Ebola: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు ఎబోలా అనుమానితులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

Published : 2026-06-05 12:53:00

ఎబోలా లక్షణాలతో ఇద్దరు సూడాన్ పౌరులకు చికిత్స..

గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో అనుమానితుల పర్యవేక్షణ..

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు ఎబోలా అనుమానితులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

వైద్యుల వివరాల ప్రకారం, సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ యగౌచ్ అనే వ్యక్తి ఎబోలా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇదే సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో అహ్మద్ అనే మరో సూడాన్ పౌరుడికి కూడా ఎబోలా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ ఇద్దరూ ఇటీవల సూడాన్ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో వైద్య శాఖ మరింత అప్రమత్తమై, వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచింది.

అనుమానితుల నుంచి రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని పరీక్షల కోసం ముందుగా హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. అక్కడి నుంచి తుది నిర్ధారణ కోసం పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (National Institute of Virology) ప్రయోగశాలకు తరలించారు. పరీక్షల నివేదికలు వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అలాగే ఎబోలా లక్షణాలతో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తిని కూడా గుర్తించి, గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గాంధీ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. వైద్య నిపుణుల బృందం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

అయితే ప్రస్తుతం ఎబోలా వైరస్ నిర్ధారణ కాలేదని, కేవలం అనుమానిత కేసులుగా మాత్రమే వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచిస్తున్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎబోలా వైరస్‌కు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

Spotlight

Read More →