AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం!

AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం!

AP New Highways: హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం ప్రభుత్వం మూడు ప్రధాన అలైన్‌మెంట్లను పరిశీలిస్తోంది. ఏ రూట్ ద్వారా దూరం తగ్గుతుంది? నిర్మాణ వ్యయం ఎంత కానుంది? భూసేకరణకు ఎంత ఖర్చవుతుంది? సంబంధించిన వివరాలు..

Published : 2026-04-10 13:26:00

AP New Highways: హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు అనుసంధానతను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టును ఏ మార్గం ద్వారా చేపడితే బాగుంటుందనే అంశంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి దగ్గరగా ఈ రహదారి వెళ్లాలా లేక ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్  మీదుగా మళ్లించాలా అనే దానిపై ప్రభుత్వం గంభీరంగా ఆలోచిస్తోంది. దీని కోసం నియమించిన నిపుణుల కమిటీ ఇప్పటికే మూడు ప్రధాన అలైన్‌మెంట్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది.

మొదటి ఆప్షన్ ప్రకారం చూస్తే, హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఈ రహదారి ప్రారంభమవుతుంది. తెలంగాణలోని హాలియా మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఇది సాగుతుంది. దాదాపు 303 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గం జలాల్‌పురం వద్ద ORRలో కలిసి, మళ్లీ తెనాలి సమీపంలో విడిపోయి మచిలీపట్నం వైపు వెళ్తుంది. ఈ పద్ధతిలో వెళ్తే భూసేకరణకు రూ. 5,500 కోట్లు, నిర్మాణానికి రూ. 8,570 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రెండో ఆప్షన్ ద్వారా ఎక్స్‌ప్రెస్‌వే దూరాన్ని మరింత తగ్గించే అవకాశం ఉంది. దీని ప్రకారం మొత్తం మార్గం 293 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది నేరుగా కాజ సమీపంలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి కలుస్తుంది. అక్కడ నుంచి విజయవాడ బైపాస్ మీదుగా ప్రయాణించి మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ అలైన్‌మెంట్‌లో భూసేకరణ భారం కొంచెం ఎక్కువగా అంటే రూ. 6,045 కోట్లు ఉండనుంది. నిర్మాణ వ్యయం కూడా రూ. 9,530 కోట్లకు చేరుతుందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ మార్గం వల్ల విజయవాడకు కనెక్టివిటీ సులభతరం అవుతుంది.

ఇక మూడో ఆప్షన్ పూర్తిగా కొత్తగా ఉండే 'గ్రీన్‌ఫీల్డ్' మార్గం. అంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు దాదాపు 288 కిలోమీటర్ల మేర ఎక్కడా పాత రోడ్లను వాడకుండా కొత్తగా నిర్మిస్తారు. ఇది అమరావతిలోని తాడికొండ, నంబూరు వంటి కీలక ప్రాంతాల మీదుగా సాగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది కానీ, భూసేకరణ  నిర్మాణ వ్యయం మాత్రం రూ. 16,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజధాని ప్రాంతం లోపల నుంచి వెళ్లే ఈ మార్గం వల్ల భవిష్యత్తులో అమరావతి అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూడు ప్రతిపాదనలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అలైన్‌మెంట్‌పై ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏ మార్గం ఖరారైనా, హైదరాబాద్ - అమరావతి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోనుంది. కేవలం రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, మచిలీపట్నం పోర్టుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఒక వెన్నెముకలా మారుతుంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుని భూసేకరణ పనులకు పచ్చజెండా ఊపాలని ప్రభుత్వం యోచిస్తోంది

Spotlight

Read More →