సిడ్నీ రోడ్‌షోలో నారా లోకేష్ ఆహ్వానం – విశాఖలో పెట్టుబడుల సమ్మిట్‌కు ప్రపంచ పరిశ్రమల నేతలకు పిలుపు!!

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఉపాధ్యాయులుగా కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగడం చట్టబద్ధం కాదని స్పష్టంగా పేర్కొంది. కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన టీచర్లు అయినా, TET పాస్ చేయకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీ..అక్టోబర్ 30 చివరి గడువు! పూర్తి వివరాలు ఇవే!!

తాజాగా ఉపాధ్యాయ అర్హతపై పలు రాష్ట్రాల నుండి వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇందులో, కొంతమంది ఉపాధ్యాయులు 2012కు ముందే ఉద్యోగంలో చేరారని, ఆ సమయంలో TET నిబంధన లేకపోవడంతో తామిని మినహాయించాలని వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను తిరస్కరించింది. “TET పరీక్షను అర్హత ప్రమాణంగా ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలంటే, ఉపాధ్యాయులకూ కనీస విద్యార్హత, నైపుణ్యం ఉండాలి. కాబట్టి ఎవరికీ మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదు” అని తీర్పులో పేర్కొంది.

కోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర విద్యా శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. “ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న, కానీ TET పాస్ కాని ఉపాధ్యాయులు రెండేళ్లలోపు పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ గడువు తర్వాత కూడా పాస్ కాకపోతే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వారి నియామకాలను రద్దు చేయాలి” అని తెలిపింది.

36 గంటలు కీలకం - పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్! ఏపీలో పలు ప్రాంతాల్లో..

ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షలాది ఉపాధ్యాయులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లోనే తొలిసారి TET నిర్వహించబడింది. ఆ సమయానికి ముందే నియమితులైన 30 వేలమంది టీచర్లు ఈ తీర్పుతో ప్రభావితమవుతారు. వీరంతా ఇప్పుడు TET పాస్ చేయకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు.

బాబోయ్.. లక్కీ డ్రాలో భూమి! రూ.10 వేలు కట్టి 4 ఎకరాల వ్యవసాయ భూమి గెలుచుకోండి! కానీ అసలు షరతు అదే!

TET పరీక్షను కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాన్ని అంచనా వేసే ఉద్దేశ్యంతో ఈ పరీక్షను తప్పనిసరి చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయ నియామకాలకు ప్రాథమిక అర్హతగా పరిగణిస్తారు. విద్యార్థుల బోధన ప్రమాణాలు మెరుగుపడాలంటే, ఉపాధ్యాయులకూ నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో మంత్రి నారా లోకేష్ పర్యటన – ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలపై చర్చ!!

సుప్రీంకోర్టు తీర్పుతో విద్యాశాఖల్లో చర్చలు మొదలయ్యాయి. “ఇప్పటికే సేవలో ఉన్నవారికి TET రాయడం కష్టమవుతుంది” అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాణ్యమైన విద్యను అందించడంలో ఈ నిర్ణయం అవసరమని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు. ఈ తీర్పుతో ఉపాధ్యాయ వృత్తిలో అర్హత, బాధ్యత, నైపుణ్యం అన్నవి ప్రధానమైన గా పరిగణిస్తున్నారు.

ప్రయాణాలకు ఇక నో టెన్షన్.. నలుగురు హాయిగా వెళ్లొచ్చు! ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త సంచలనం! 200 కి.మీ. రేంజ్..
ఏపీ రైతులకు బంపర్ ఆఫర్.. ₹2 లక్షలు మీ అకౌంట్‌లో.! దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే!
200MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ఫ్లాగ్‌షిప్ అనుభూతినిచ్చే ఫీచర్లు అదుర్స్! గెలాక్సీ M35 5G డిస్‌ప్లే అదిరింది!
బ్రేక్ లేని వర్షం - భక్తులకు చలి వణుకు.. ఘాట్ రోడ్లపై ప్రమాద హెచ్చరిక!
ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక.. కూటమి ప్రభుత్వం నాలుగు కేడర్ల పదోన్నతులకు ఆర్హత!!
Trump secretary: ట్రంప్ దురుసుగా మాట్లాడుతారు.. ఆయన సెక్రటరీ కూడా అదే బాటలో.. నెటిజన్ల ఫైర్ కామెంట్లు!
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఆ భూములన్నీ తిరిగి రైతులకే.. నో టెన్షన్!
National Police Memorial: నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద.. PM రక్షణమంత్రుల నివాళులు!