TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్..

Andhrapradesh: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశం! కీలక అంశాలు...

Roundtable meeting of Andhra Pradesh:

Published : 2026-02-28 08:15:00

జగన్ రెడ్డికి హిందూ ధర్మంపై నమ్మకం లేదు…

లడ్డూలు రాళ్లలా ఉన్నా పట్టించుకోలేదు…

సనాతన ధర్మాన్ని తొక్కేయాలనుకోవడం అజ్ఞానమే…

Roundtable meeting of Andhra Pradesh: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు స్వామీజీలు, పీఠాధిపతులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారం యావత్ హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి హిందూ ధర్మంపై రవ్వంత కూడా విశ్వాసం లేదని, ఆయన హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ముఖ్యంగా పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని (Adulterated Ghee) వాడటం అనేది క్షమించరాని నేరమని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్రతను పూర్తిగా మంటగలిపారని సాధువులు ఆరోపించారు. లడ్డూలు రాళ్లలా ఉన్నాయని భక్తులు మొరపెట్టుకున్నా నాటి పాలకులు పట్టించుకోలేదని, కేవలం వ్యాపార దృక్పథంతోనే వ్యవహరించారని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వారు బోర్డు ఛైర్మన్లుగా ఉన్న సమయంలోనే ఇన్ని అక్రమాలు జరగడం దారుణమని వారు పేర్కొన్నారు. వైసీపీలోని హిందూ నాయకులు కూడా తమ మతంపై జరుగుతున్న దాడులను చూస్తూ మౌనంగా ఉండటం సిగ్గుచేటని, వారు కేవలం పదవుల కోసమే ప్రాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనను గజనీ, ఘోరీల దండయాత్రలతో స్వామీజీలు పోల్చారు. అంతరంగంలో ఒకలా, బయట మరోలా ప్రవర్తించే జగన్ రెడ్డికి యజ్ఞ యాగాదుల్లో కూర్చునే అర్హత లేదని స్పష్టం చేశారు. విగ్రహాల ధ్వంసం, రథాల దహనం వంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులకు పిచ్చివాళ్లనే ముద్ర వేసి కేసులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. క్రైస్తవ మతానికి సంబంధించిన చిన్న అంశంపై క్షమాపణలు చెప్పే జగన్, కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామికి జరిగిన అపచారంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

సనాతన ధర్మం (Sanatan Dharma) అనేది వ్యక్తుల వల్ల అంతమయ్యేది కాదని, దైవానికి హాని చేయాలని చూసిన వారు కాలగర్భంలో కలిసిపోతారని పీఠాధిపతులు హెచ్చరించారు. భక్తుల సొమ్మును అడ్డదారిలో మళ్లించి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సిట్ దర్యాప్తులో నిజాలు బయటపడుతున్నా, తప్పు చేసిన వారు పశ్చాత్తాపం చెందకుండా ఇంకా అబద్ధాలతో సమర్థించుకోవడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో జరిగిన తప్పును వెంటనే ఒప్పుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హిందూ సమాజం ఇకనైనా మేల్కోవాలని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలని సాధు పరిషత్ పిలుపునిచ్చింది. ఓట్ల కోసం హిందువులను వాడుకుంటూ, ప్రసాదాలను కల్తీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని వారు స్పష్టం చేశారు. దైవద్రోహం చేసిన వారికి ఆ దేవుడే శిక్ష విధిస్తాడని, చట్టపరంగా కూడా దోషులను అరెస్ట్ చేసే వరకు తమ పోరాటం ఆపబోమని పీఠాధిపతులు తేల్చి చెప్పారు. పవిత్ర క్షేత్రాల ప్రతిష్టను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తూ ఈ సమావేశాన్ని ముగించారు.

Spotlight

Read More →