US Visa: వీసాలపై అమెరికా మరో బాంబ్! ఇక నుండి అంత మొత్తం చెల్లించాల్సిందే...!

అమెరికా వలస విధానాల్లో మళ్లీ కఠినతరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బిజినెస్ మరియు టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం సెక్యూరిటీ బాండ్ విధ

Published : 2025-08-05 09:33:00
AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ ఉద్యోగులందరి నోటీసులు.. తొలగింపు!

అమెరికా వలస విధానాల్లో మళ్లీ కఠినతరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బిజినెస్ మరియు టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం సెక్యూరిటీ బాండ్ విధానం తీసుకొచ్చేందుకు అమెరికా విదేశాంగశాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో నోటీసులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రోగ్రామ్‌గా ఒక సంవత్సరం పాటు ఈ నిబంధన అమలులో ఉండనుంది. బీ-1 (బిజినెస్), బీ-2 (టూరిస్ట్) వీసాలపై దరఖాస్తు చేసుకునే వారు $5,000, $10,000 లేదా $15,000 వరకు బాండ్ చెల్లించవలసి ఉంటుంది.

Free Education: ఏపీలో విద్యార్థులకు ఉచిత విద్య.. మొత్తం ఖర్చు ప్రభుత్వానిదే! అర్హులు వీరే!

ఈ బాండ్ మొత్తాన్ని వీసా దరఖాస్తు సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్ళిన వారికి ఈ బాండ్‌ మొత్తాన్ని తిరిగి ఇస్తారు. కానీ, వీసా నిబంధనలు ఉల్లంఘించినా లేదా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండిపోయినా ఆ మొత్తాన్ని రీఫండ్ చేయరు. అయితే ఈ నిబంధన ప్రతి దేశానికి వర్తించదు. వీసా వేవర్ ప్రోగ్రాం కింద ఉన్న 42 దేశాలకు ఈ బాండ్ అవసరం ఉండదని వెల్లడించారు. ఈ జాబితాలో ప్రధానంగా ఐరోపా దేశాలు ఉంటాయి.

Job Notification: RRB ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా... మూడు రోజులే గడువు!

ఈ విధానం ట్రంప్ ప్రభుత్వం గతంలో 2020లోనూ ప్రకటించినా, కోవిడ్ వల్ల ప్రయాణాలు నిలిచిపోవడంతో ఆ సమయంలో పూర్తిగా అమలు కాలేదు. ఇప్పుడు మరోసారి అదే విధానాన్ని కొనసాగించాలని అమెరికా యంత్రాంగం భావిస్తోంది. వీసా గడువు ముగిసిన తర్వాత కొందరు అమెరికా వదలకపోవడం, దేశ భద్రతకు ముప్పు ఏర్పడటం వంటి కారణాలే ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి.ఇలాంటి ఆంక్షలు వలసదారులపై మరింత ఒత్తిడిని తేవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం! 160 మందికి పైగా ప్రయాణికులు 3 గంటలుగా...
Praja Vedika: నేడు (5/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Caravan buses: క్యారవాన్ బస్సులు రెడీ... త్వరలో అరకు కు!
Rains Alert: రేపు పిడుగులతో కూడిన వర్షాలు... APSDMA!
Dengue: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు..! ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!
Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు...! హడలిపోయిన ప్రజలు!
CBN: సెప్టెంబర్ నుంచి నూతన బార్ పాలసీ... సీఎం CBN!

Spotlight

Read More →