టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సినీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారాడు. చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన సిద్ధు ఇప్పుడు తనదైన స్టైల్లో ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. డీజే టిల్లు సిరీస్‌తో మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్న అతడు, ఇటీవల వచ్చిన జాక్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయిన అభిమానుల్లో తన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
తాజాగా సిద్ధు నటించిన కొత్త సినిమా తెలుసు కదా అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రానికి నీరజ కోనా దర్శకత్వం వహించగా శ్రీనిధి శెట్టి మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమలో ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేశాయి.
అయితే, ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఈవెంట్‌లో ఒక లేడీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నతో అక్కడున్నవాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె నేరుగా సిద్ధుని మీరు రియల్ లైఫ్‌లో ఉమెనైజరా? అని అడగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ వివాదంపై తాజాగా ప్రెస్ మీట్‌లో సిద్ధు జొన్నలగడ్డ స్పందిస్తూ
చేతిలో మైక్ ఉందని ఏదిపడితే అది మాట్లాడొద్దు. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అలాంటి మాటలు మాట్లాడటం చాలా తప్పు, గౌరవం లేనట్టే అని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. అలాగే మీడియా వ్యక్తులు కూడా తమ మాటల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
ఇదే జర్నలిస్ట్ కొన్ని రోజుల క్రితం మరో ఈవెంట్‌లో కూడా వివాదాస్పద ప్రశ్న అడిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో ఆమె ఓ హీరోను ఉద్దేశించి మీ లుక్ హీరోలా లేదు కానీ రెండు సినిమాలతో హిట్ అయ్యారు. అదృష్టమా లేక మీ వర్క్ హార్డ్? అని ప్రశ్నించడంతో వేదికపై ఉన్నవాళ్లు అవాక్కయ్యారు. ఆ సందర్భంలో సీనియర్ నటుడు శరత్‌కుమార్ మైక్ తీసుకుని ఆ హీరోకి బదులిచ్చారు.
ఇక అదే రిపోర్టర్ మరో ఈవెంట్‌లో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోపై కూడా అవమానకరమైన వ్యాఖ్య చేసినట్లు చెబుతున్నారు. దాంతో అక్కడ ఉన్న నటుడు కిరణ్ ఆమెను తేలికగా కాకుండా హెచ్చరిస్తూ – “మనమంతా ఒకటే ఇండస్ట్రీ. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారిని కించపరచడం సరికాదు,అని చెప్పిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినది.
జర్నలిస్టులు కూడా మాటల్లో గౌరవం ఉండేలా మాట్లాడాలి. లేకపోతే జర్నలిజం విలువే తగ్గిపోతుంది మరికొందరు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.