బిహార్‌ పొలిటికల్ షాక్! తేజస్వి, లాలూ మధ్య టికెట్‌ వార్‌!

ఉక్కు కంటే పది రెట్లు ఎక్కువ బలాన్ని, ఆరు రెట్లు తక్కువ బరువును కలిగి ఉండే “సూపర్‌వుడ్” అనే సరికొత్త ఆవిష్కరణను అమెరికా సంస్థ ఒకటి ప్రపంచానికి పరిచయం చేసింది. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన ‘ఇన్వెంట్‌వుడ్’ (InventWood) కంపెనీ దీన్ని రూపొందించింది. సాధారణ చెక్కను ఆధునిక రసాయన ప్రాసెసింగ్, అధిక ఉష్ణోగ్రత మరియు పీడనంతో ప్రాసెస్‌ చేయడం ద్వారా ఈ సూపర్‌వుడ్‌ను తయారు చేశారు. దీన్ని రూపొందించిన మెటీరియల్ సైన్స్ నిపుణుడు లియాంగ్‌బింగ్ హు దాదాపు పది సంవత్సరాలపాటు పరిశోధనలు నిర్వహించి ఈ విప్లవాత్మక ఫలితాన్ని సాధించారు. సాధారణ కలపలో ఉండే సెల్యులోజ్ నిర్మాణాన్ని మార్చే ప్రత్యేక పద్ధతి ద్వారా ఇది అత్యంత దృఢమైన, సాంద్రమైన పదార్థంగా మారుతుంది.

Praja Vedika: నేడు (15/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇన్వెంట్‌వుడ్ కంపెనీ ప్రకారం, ఈ సూపర్‌వుడ్ సాధారణ కలపతో పోలిస్తే 20 రెట్లు బలంగా, 10 రెట్లు ఎక్కువ మన్నికగా ఉంటుంది. గీతలు పడటం లేదా పగుళ్లు రావడం చాలా కష్టం. పైగా చెదలు, పురుగులు పట్టడం దాదాపుగా అసాధ్యం. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఇది అగ్నికి కూడా గట్టి నిరోధకత చూపుతుంది. సాధారణ కలప మంటల్లో సులభంగా కాలిపోతుంటే, సూపర్‌వుడ్ ఆ మంటలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఇన్వెంట్‌వుడ్ సీఈఓ అలెక్స్ లా మాట్లాడుతూ, “ఇది నిజానికి చెక్కే అయినా, దానిని శాస్త్రీయంగా రీడిజైన్‌ చేశాం. కనిపించటానికి చెక్కలాగే ఉంటుంది కానీ, బలం, దీర్ఘాయువు పరంగా పూర్తిగా భిన్నంగా ఉంటుంది,” అని తెలిపారు.

JSW Industrial Park: విజయనగరంలో 45,000 ఉద్యోగ అవకాశాలు! భారీ పెట్టుబడులు.. బడా ప్రాజెక్టులు!

అలెక్స్ లా చెప్పిన వివరాల ప్రకారం, సూపర్‌వుడ్‌తో నిర్మించిన భవనాలు సాధారణ నిర్మాణాల కంటే నాలుగు రెట్లు తేలికగా ఉంటాయి. దీనివల్ల భూకంపాలు, గాలివానలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు కూడా ఇవి మరింత ప్రతిఘటన చూపుతాయని ఆయన తెలిపారు. ఈ కొత్త పదార్థాన్ని ప్రస్తుతం భవనాల బాహ్య భాగాలు, ఫ్లోరింగ్, ఫర్నిచర్ తయారీ వంటి రంగాల్లో వినియోగించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. అంతేకాక, ఫర్నిచర్ తయారీలో ప్రస్తుతం ఉపయోగించే లోహపు స్క్రూలు, మేకులు వంటి భాగాల స్థానంలో సూపర్‌వుడ్‌నే వాడవచ్చని కంపెనీ భావిస్తోంది. ఇది మొత్తం నిర్మాణాన్ని పూర్తిగా చెక్కతోనే చేయగల కొత్త దారిని తెరిచే అవకాశం ఉంది.

Rajbhavan: అమరావతిలో మరో మెగా ప్రాజెక్ట్ ప్రారంభం! రూ.212 కోట్ల రాజ్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

ప్రస్తుతం సూపర్‌వుడ్ ధర సాధారణ కలప కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉత్పత్తి పెరిగిన కొద్దీ ధర తగ్గిస్తామని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉక్కుతో పోలిస్తే ఈ పదార్థం తయారీలో కర్బన ఉద్గారాలు 90% తక్కువగా ఉంటాయని ఇన్వెంట్‌వుడ్ వెల్లడించింది. అంటే ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. భవిష్యత్తులో సూపర్‌వుడ్ వాడకం పెరిగితే, ఉక్కు మరియు కాంక్రీటు మీద ఆధారాన్ని తగ్గించే అవకాశం ఉంది. దీంతో నిర్మాణ రంగం మరింత సుస్థిరంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా బలమైన నిర్మాణాలను సృష్టించే దిశగా ఈ ఆవిష్కరణ ఒక కొత్త విప్లవంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

New Ambulance: పాత అంబులెన్స్‌లకు గుడ్‌బై! ఆధునిక సదుపాయాలతో కొత్త వాహనాలు సిద్ధం!
Liquor Case: ఏపీలో కల్తీ మద్యం కేసు సంచలనం! మరో మాజీ మంత్రి... బయటపడ్డ వాట్సప్ చాట్!
ఏపీ విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఆ జిల్లాలో మాత్రమే - రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..!
వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం!
Chiranjeevi Nayanthara: చిరంజీవి నయనతార జోడీ మేజిక్.. మీసాల పిల్ల పాట వైరల్!
గూగుల్ భారీ ప్రాజెక్ట్ పై బీబీసీ ప్రత్యేక కథనం.. రూ. 1.25 లక్షల కోట్లతో - అమెరికా వెలుపల ఇదే.!