కడప జిల్లాలో ఉల్లి రైతులు ఈ ఏడాది మార్కెట్‌లో తగిన ధర పొందలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన ధర లేకపోవడం రైతులు తమ ఉల్లిని రహదారులపై పడేసిన సంఘటనలను సోషల్ మీడియా, స్థానిక వార్తా పత్రికలలో విస్తృతంగా వైరల్ ఆయన వార్తలను చూస్తూనే ఉన్నము.
కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టారుకు రూ.50,000 మద్దతు ప్రకటించిందని అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే ప్యాకేజీ కడప జిల్లాకు కూడా వర్తించనుంది. రాష్ట్ర ప్రభుత్వం హెక్టారుకు రూ.32,500, కేంద్ర ప్రభుత్వం వైపరీత్యాల నిధుల కింద రూ.17,500 మంజూరు చేయడం ద్వారా మొత్తం రూ.50,000 నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది సమాచారం.
రైతులు పంటను ఎంత ధరకు అమ్మినా, ఈ మద్దతు ద్వారా తమ పెట్టుబడిని కొంతమేరకు తిరిగి పొందగలుగుతారు. కర్నూలు జిల్లాలో పంట సాగించిన రైతుల వివరాల సర్వే ఇప్పటికే పూర్తి చేయబడుతుంది. ఈ సర్వే ఆధారంగా అర్హులైన రైతులకు సాయం అందేలా తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఏడాది ఉల్లి మార్కెట్ పరిస్థితి చాలా బలహీనంగా ఉండటంతో కిలో ధర చాలా తక్కువగా ఉంది. దీంతో రైతులు పెట్టుబడిని తిరిగి పొందలేకపోతున్నారు. కొంతమంది రైతులు గిట్టుబాటు ధర లేక తమ ఉల్లిని రహదారులు, కాలువల్లో పారేసి నష్టాన్ని తట్టుకోవాల్సి వచ్చిందని తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ప్యాకేజీ ద్వారా, రైతులకు ఉపశమనం లభిస్తుంది.
కూటమి ప్రభుత్వం కడప జిల్లా అధికారులు ఇప్పటికే ఉల్లి రైతుల వివరాలను సేకరించమని ఆదేశాలు జారీ చేసింది. ఈ డేటా ఆధారంగా అర్హులైన రైతుల ఖాతాలో నేరుగా సాయం జమ అవుతుంది అధికారులు తెలుపుతున్నారు.