Intersting facts: ఈ దేశాలకు ఒక రాజధాని కాదు.. అవి ఏంటంటే!

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్‌నాథ్ ఆలయం ఈ ఏడాది భాయ్ దూజ్ పండుగ సందర్భంగా శాస్త్రోక్తంగా  మూసివేయబడుతుంది. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య మందాకినీ నది ఒడ్డున వెలసిన ఈ ఆలయం దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం చలి ప్రారంభమయ్యే సమయానికి ఆలయ ద్వారాలను భక్తుల సమక్షంలో మూసివేయడం అక్కడి సంప్రదాయం. ఈసారి కూడా అదే విధంగా వేడుకల మధ్య ద్వారబంధన పూజలు  నిర్వహించబడుతుంది.

20 మంది సజీవ దహనం! కల్లూరు వద్ద ఘోరం.. కుటుంబ సభ్యుల ఆందోళన! హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్

కేదార్‌నాథ్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 11,755 అడుగుల ఎత్తులో ఉంది. రోడ్డు మార్గంలో చివరి పాయింట్ గౌరీకుండ్ వరకు మాత్రమే వాహనాలు వెళ్తాయి. అక్కడి నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరం పర్వత మార్గంలో నడవాలి. కొంతమంది భక్తులు గుర్రాలు, మ్యూల్స్ లేదా హెలికాప్టర్ సేవలను ఉపయోగిస్తారు. ప్రయాణం ఎంత కష్టమైనదైనా, హిమాలయాల నడుమ ఉన్న ఆ పవిత్ర వాతావరణం ప్రతి భక్తుడిలో భక్తి భావాన్ని నింపుతుంది.

ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కోసం LEAP పథకం – మెల్‌బోర్న్‌లో వివరించిన లోకేష్!!

కేదార్‌నాథ్ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉదయం మహాభిషేకం, మధ్యాహ్నం రుద్రాభిషేకం, సాయంత్రం మంగళారతి, రాత్రి శయనారతి వంటి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని శివలింగం స్వయంభూగా పరిగణించబడుతుంది. పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారనే పురాణం ఉంది. ఇక్కడ జరిపే ప్రతి పూజా కార్యక్రమం భక్తుల మనసుల్లో ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది.

Bank Update: డిపాజిటర్ల భద్రతకు కేంద్రం కొత్త పథకం..! నవంబర్‌ 1 నుంచి మార్పులు..!

భాయ్ దూజ్ సందర్భంగా ఆలయంలో వేలాది మంది భక్తులు చేరి స్వామి దర్శనం పొందుతున్నారు. ఆలయ ప్రాంగణం భజనలతో, వేదపారాయణాలతో పండితులు శాస్త్రోక్తంగా ద్వారబంధన పూజ చేసి ప్రధాన గర్భగృహ ద్వారం మూసి వేయడం జరుగుతుంది. ఆలయం మూసిన తర్వాత కేదారేశ్వరుని పల్లకిని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు. అక్కడ ఆరు నెలలపాటు నిత్య పూజలు జరుగుతాయి.

Bastian: ఒక్క రాత్రికే రూ. 2-3 కోట్లు టర్నోవర్! ఎక్కడో తెలుసా..

ఈ ఏడాది కేదార్‌నాథ్ యాత్రలో రికార్డు స్థాయిలో 17.39 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఒక్కరోజే 5,000 మందికి పైగా స్వామి దర్శనం పొందారు. చార్ ధామ్ యాత్రలో గంగోత్రి ఆలయం అక్టోబర్ 22న, యమునోత్రి అక్టోబర్ 23న మూసివేయబడి, బద్రీనాథ్ ఆలయం నవంబర్ 25న మూసివేయబడనుంది. కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మూసివేయడంతో ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ముగింపు దశకు చేరింది.

Mountains: చలికాలం రాకముందే వెళ్లవలసిన అద్భుత పర్వత ప్రదేశాలు!

ఆలయ ద్వారాలు మూసినా భక్తి మాత్రం ఎప్పటికీ ఆగదు. అధికారులు చెబుతున్నట్లుగా, ఉఖీమఠ్‌లో పల్లకి పూజలు యథాతథంగా కొనసాగుతాయి. ఆరు నెలల తర్వాత మళ్లీ వేసవిలో కేదార్‌నాథ్ ఆలయం తెరచినప్పుడు   ఆ భక్తి తరంగాలు విరజిమ్ముతాయి అని చెప్పుకోవాలి.

వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!!
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్పు.. పరీక్షలు త్వరగా పూర్తి.. ఫలితాలు త్వరగా! ప్రైవేటు కళాశాలల్లో...
Agniveer Jaisalmer: జైసల్మేర్‌లో అగ్నివీర్ భవిష్యత్తుపై చర్చలు.. ఆర్మీ కమాండర్ల మీటింగ్ హాట్‌టాపిక్!
India: మోడీ మాస్టర్ ప్లాన్! విదేశీ పరిశోధకులను ఆకర్షించేందుకు కొత్త పథకం!