డీమార్ట్ షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే డీమార్ట్ అనగానే అందరికీ తెలిసిన పేరు. ఎప్పుడూ కస్టమర్లతో రద్దీగా ఉండే ఈ స్టోర్‌లో ధరలు అందుబాటులో ఉండటంతో ప్రజలు క్యూ కడుతూ వస్తువులు కొంటూ ఉంటారు. కానీ, డీమార్ట్‌కు వెళ్లి షాపింగ్ చేయడం కష్టమని అనుకునే వారికి ఓ అదిరిపోయే శుభవార్త ఉంది. ఇప్పుడు ఇంట్లో నుంచే డీమార్ట్‌లో షాపింగ్ చేసే అవకాశం అందుబాటులో ఉంది.
డీమార్ట్ ఆన్‌లైన్ సర్వీసులు కూడా ప్రారంభించింది. "డీమార్ట్ రెడీ" అనే యాప్ ద్వారా మీరు ఇంటి సౌకర్యంలోనే వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, తొలి మూడు ఆర్డర్లకు డెలివరీ ఛార్జీలు పూర్తిగా ఉచితం. అంటే మీరు ఆర్డర్ చేసిన వస్తువులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఇంటి ముందే అందిస్తారు. ఇది తప్పక వినియోగించుకోవాల్సిన అవకాశం.
ఈ యాప్ ద్వారా మీరు డీమార్ట్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఆఫర్లను, ప్రత్యేక తగ్గింపులను కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు — మెకైన్ స్మైల్స్ క్రిస్పీ హ్యాపీ పొటాటోస్ పై రూ.215 తగ్గింపు, అంటే సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే పిలిగ్రిమ్ స్క్వలేన్ గ్లో మాయిశ్చరైజర్, పిలిగ్రిమ్ 5 సెరమైడ్ బారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ వంటి ఉత్పత్తులు 50% తగ్గింపుతో లభిస్తున్నాయి.
అదే విధంగా జిమ్ జామ్ పాప్స్, లోరియల్ పారిస్ హయాలురాన్ మాయిశ్చర్, శుభ్‌కార్ట్ సురభి భింసేని, బ్రిటానియా చీజ్ స్లైస్ వంటి ఉత్పత్తులు కూడా హాఫ్ ప్రైస్‌లో దొరుకుతున్నాయి. అయితే ఈ ఆఫర్లు స్టాక్ ఉన్నంతవరకే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోవాలి.
డీల్స్ ఆఫ్ ది డేలో — లేయర్ వోట్‌గర్ల్ స్ప్రే రూ.225 బదులు రూ.112కే, వాఘ్ బక్రి ప్రీమియం టీ కేజీ రూ.620 బదులు రూ.527కే, తాజ్ మహల్ టీ 500 గ్రా రూ.380 బదులు రూ.320కే లభిస్తోంది. అలాగే డవ్ క్రీమ్ బ్యూటీ సోప్ 4 ప్యాక్ రూ.522 బదులు రూ.367కే (ఒక సోప్ ఫ్రీ), హార్పిక్ 1 లీటర్ రూ.205 బదులు రూ.175కే, సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ (ఫ్రంట్ లోడ్, 4 లీటర్) రూ.799 బదులు రూ.524కే లభిస్తోంది — అంటే రూ.275 తగ్గింపు.
ఇలా ఇంకా ఎన్నో డీల్స్ డీమార్ట్ రెడీ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. కావలసింది కేవలం మొబైల్ ఓపెన్ చేసి, ఆర్డర్ చేయడమే.