భారత దేశ శ్రీమంతుడు గౌతమ్ అదానీ మరో పోర్టును సొంతం చేసుకున్నారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కు చెందిన గోపాల్ పూర్ పోర్టును ఆయన కొనుగోలు చేశారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ కు గోపాల్ పూర్ పోర్టును విక్రయించినట్టు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఈరోజు ప్రకటించింది. తమ ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా ఈ పోర్టును రూ. 3,350 కోట్లకు అమ్మినట్టు తెలిపింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2017లో ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ పోర్టును పల్లోంజీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు. పెట్రోనెట్ ఎల్ఎన్జీతో ఇటీవలే ఈ పోర్టు గ్రీన్ ఫీల్డ్ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. కొంత కాలం క్రితమే పల్లోంజీ గ్రూప్ మహారాష్ట్రలోని ధరమ్ తర్ పోర్టును రూ. 710 కోట్లకు జేఎస్ డబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్ కు విక్రయించింది. 2015లో ఈ పోర్టును కొనుగోలు చేసిన షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ దాని సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచింది.
ఇవి కూడా చదవండి:
తూ.గో.జిల్లా గోపాలపురంలో మద్దిపాటి ఎన్నికల ప్రచార హోరు!!
తెలుగువారి ఐక్యతకు ప్రతిరూపం ‘యెల్లో కార్ట్’!
పెన్షన్లలోనూ రాజకీయం!! రచ్చబండ సభల్లో యువనేత లోకేష్ దృష్టికి సమస్యల వెల్లువ!!
పార్టీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ భేటీ!! ఎన్నికల శంఖారావం పూరించనున్న పవన్!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి