BSNL: సంక్రాంతికి బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. 365 రోజుల రీఛార్జ్‌తో అన్ లిమిటెడ్ లాభాలు! కొత్త ఏడాది కానుక: జియో, ఎయిర్‌టెల్‌కు ధీటుగా రంగంలోకి బీఎస్‌ఎన్‌ఎల్! ఉచితంగా ఆ సేవలు.. BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం! BSNL: డేటా లవర్స్‌కు జాక్‌పాట్! రూ.251కే 100GB డేటా… కాలింగ్ ఫ్రీ..! BSNL: BSNL న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. ₹251కే 100GB డేటా! BSNL: సంక్రాంతికి బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. 365 రోజుల రీఛార్జ్‌తో అన్ లిమిటెడ్ లాభాలు! కొత్త ఏడాది కానుక: జియో, ఎయిర్‌టెల్‌కు ధీటుగా రంగంలోకి బీఎస్‌ఎన్‌ఎల్! ఉచితంగా ఆ సేవలు.. BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం! BSNL: డేటా లవర్స్‌కు జాక్‌పాట్! రూ.251కే 100GB డేటా… కాలింగ్ ఫ్రీ..! BSNL: BSNL న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. ₹251కే 100GB డేటా!

BSNL: డేటా లవర్స్‌కు జాక్‌పాట్! రూ.251కే 100GB డేటా… కాలింగ్ ఫ్రీ..!

2025-12-29 14:14:00
Eyebomma Ravi : ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. ప్రహ్లాద్ పేరు మీద పాన్, లైసెన్స్!

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులకు మరోసారి శుభవార్త చెప్పింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను వరుసగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్న తరుణంలో, బీఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ ధరలో భారీ ప్రయోజనాలు కలిగిన ఒక అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.251కే ఏకంగా 100 జీబీ డేటాతో పాటు కాలింగ్, ఎస్ఎంఎస్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ వంటి పలు బెనిఫిట్స్ ఇవ్వడం విశేషంగా మారింది. ముఖ్యంగా డేటా వినియోగం ఎక్కువగా ఉండే విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు, వీడియో స్ట్రీమింగ్ ఎక్కువగా చూసే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడనుంది.

హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే..

బీఎస్ఎన్ఎల్ రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 100 జీబీ హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఇతర టెలికాం కంపెనీలు రోజుకు 1.5 జీబీ లేదా 2 జీబీ పరిమితితో డేటాను ఇస్తుంటే, బీఎస్ఎన్ఎల్ మాత్రం మొత్తం డేటాను అవసరానుసారం వాడుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ సదుపాయం ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభించడం కూడా మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

ఫుల్ జోష్‌లో యాపిల్.. ఐఫోన్ 16 అమ్మకాలు సరికొత్త రికార్డు.. భారత్‌లో అత్యధికంగా..

ఈ ప్లాన్‌లో మరో ముఖ్యమైన హైలైట్ ఏమిటంటే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న BiTV ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్. ఈ సబ్‌స్క్రిప్షన్ 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు సినిమాలు, టీవీ షోలు, ఇతర వినోదాత్మక కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. న్యూ ఇయర్ కానుకగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ 2026 జనవరి చివరి వరకే అందుబాటులో ఉంటుందని సమాచారం. తక్కువ ఖర్చుతో డేటా, కాలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఒకే ప్లాన్‌లో లభించడం వల్ల వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.

అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి.. అధికారికంగా ప్రకటించిన టాలీవుడ్ నటుడు! ఎప్పుడు అంటే.?

ఇదిలా ఉండగా, బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా 4జీ సైట్లను ఏర్పాటు చేసేందుకు భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడేలా తమ టవర్లను ఆధునీకరిస్తూ సేవలను మెరుగుపరుస్తోంది. వినియోగదారులను తిరిగి ఆకర్షించాలనే లక్ష్యంతో చౌక ధరలకే ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే ప్లాన్లను ప్రకటిస్తోంది. రోజువారీ ఖర్చు లెక్కన చూస్తే ఈ ప్లాన్ వినియోగదారులకు కేవలం రూ.9లోపే పడుతోంది. మార్కెట్లో ఉన్న ఇతర ప్లాన్లతో పోలిస్తే ఇది నిజంగా భారీ పొదుపుగా చెప్పుకోవచ్చు.

Kuwait Visa: కువైట్‌ ఉద్యోగులకు శుభవార్త.. వీసా రెసిడెన్సీ ప్రక్రియలు మరింత సులభం..!!
AP Cabinet: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. 20కి పైగా కీలక ప్రతిపాదనల!
సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు గేట్‌వే…! CUET-UG 2026 డేట్స్ ఫిక్స్..!
IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..!
Elon Musk: 8 గంటల వెయిటింగ్‌.. ప్రాణం పోయింది.. కెనడా హెల్త్‌కేర్‌పై ఎలాన్ మస్క్ ఫైర్!
BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! పరీక్షలేకుండానే ఎంపిక..!

Spotlight

Read More →