Medaram Jatara: మేడారం జాతరకు నేటి నుంచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!! Luxury Resorts: సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్! నీలి సముద్రం.. తెల్లటి ఇసుక.. ఈ 10 రిసార్టులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Visa-Free: భారతీయులకు విదేశీ ప్రయాణంలో కొత్త అడ్డంకులు! ఆ రెండు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి బ్రేక్! Indigo: దేశీయ విమానయానంలో కలకలం! 717 విమాన స్లాట్లు వదిలేసిన ఇండిగో..! Medaram Jathara: మేడారం మహాజాతరకు మహా ఏర్పాట్లు…! 28 ప్రత్యేక రైళ్లు, నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సులు! Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు! ఇక ఆన్‌లైన్‌లోనే సులువు! Tourism: టూరిజం ఇన్వెస్ట్‌మెంట్లకు గ్రీన్ సిగ్నల్! దావోస్‌లో చంద్రబాబు కీలక భేటీలు! AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..! అమెరికాలో మంచు తుపాను... మిచిగాన్‌లో భారీ రోడ్డు ప్రమాదం! Travel Tips: ఎయిర్‌పోర్ట్‌లో మీ బ్యాగ్ ముందుగా రావాలా..? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు! Medaram Jatara: మేడారం జాతరకు నేటి నుంచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!! Luxury Resorts: సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్! నీలి సముద్రం.. తెల్లటి ఇసుక.. ఈ 10 రిసార్టులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! Visa-Free: భారతీయులకు విదేశీ ప్రయాణంలో కొత్త అడ్డంకులు! ఆ రెండు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి బ్రేక్! Indigo: దేశీయ విమానయానంలో కలకలం! 717 విమాన స్లాట్లు వదిలేసిన ఇండిగో..! Medaram Jathara: మేడారం మహాజాతరకు మహా ఏర్పాట్లు…! 28 ప్రత్యేక రైళ్లు, నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సులు! Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు! ఇక ఆన్‌లైన్‌లోనే సులువు! Tourism: టూరిజం ఇన్వెస్ట్‌మెంట్లకు గ్రీన్ సిగ్నల్! దావోస్‌లో చంద్రబాబు కీలక భేటీలు! AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..! అమెరికాలో మంచు తుపాను... మిచిగాన్‌లో భారీ రోడ్డు ప్రమాదం! Travel Tips: ఎయిర్‌పోర్ట్‌లో మీ బ్యాగ్ ముందుగా రావాలా..? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!

Medaram Jatara: మేడారం జాతరకు నేటి నుంచే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..!!

Medaram Jatara: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ నేటి నుంచి 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల నుంచి బస్సులు అందుబాటులో ఉండగా, తాత్కాలిక బస్‌స్టాండ్, భద్రత, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.

2026-01-25 08:44:00

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. నేటి నుంచే మేడారం జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు నాలుగు వేల ప్రత్యేక బస్సులు భక్తులను మేడారం వరకు చేరవేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

జాతర సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశముండటంతో మేడారం పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక బస్‌స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ బస్‌స్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బస్‌స్టాండ్‌లో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను నిర్వహించేందుకు 50 క్యూలైన్లను ఏర్పాటు చేయగా, బస్సుల పార్కింగ్ కోసం 25 ఎకరాలకుపైగా స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ దాదాపు వెయ్యి బస్సులు పార్కింగ్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తాత్కాలిక బస్‌స్టాండ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. జాతర విధుల్లో 10 వేల మందికి పైగా ఆర్టీసీ సిబ్బంది పనిచేయనున్నారు. ప్రయాణికులకు తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్సతో కూడిన వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, భక్తులు సురక్షితంగా గద్దెల వద్దకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులే ఉత్తమ మార్గమని తెలిపారు. స్వంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్ చేయాల్సి ఉండటంతో పాటు ఎక్కువ నడక తప్పదన్నారు. ఆర్టీసీ బస్సులు నేరుగా జాతర ప్రాంతానికి సమీపంలోనే దించుతాయని, అందువల్ల వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం ఉండదని చెప్పారు. అవసరమైతే మరిన్ని బస్సులను కూడా వెంటనే రంగంలోకి దించేలా శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కొనసాగుతుందని తెలిపారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం జాతర వంటి మహత్తర కార్యక్రమానికి శాశ్వత రవాణా మౌలిక వసతులు అవసరమని పేర్కొన్నారు. గతంలో ప్రతి జాతర సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు పడిన సందర్భాలను గుర్తు చేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారంగా శాశ్వత ఆర్టీసీ బస్‌స్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఏటూరునాగారంలో రూ.7 కోట్ల వ్యయంతో ఆర్టీసీ బస్ డిపోకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ డిపో ద్వారా అటవీ ప్రాంతాలు, భద్రాచలం, మంగపేట, వాజేడు, వెంకటాపురం వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించవచ్చని చెప్పారు.

ప్రభుత్వం లక్ష్యం భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరలో పాల్గొని సురక్షితంగా స్వస్థలాలకు చేరుకోవడమేనని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భక్తులంతా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Spotlight

Read More →