Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం!

Flight Ticket: దేశీయ విమాన సంస్థలు మాత్రం మునుపటి రేటు ప్రకారమే కిలో లీటరు ఇంధనానికి 1,04,927.18 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. గత నెలల్లో అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు దేశీయ విమాన ప్రయాణికులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ నష్టాన్ని తామే భరించాయి.

Published : 2026-06-02 12:13:00

Business- ఏటీఎఫ్ ధరలు 27% భారీగా తగ్గింపు!

ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌కు ఓకే.. డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు నో చేంజ్…

సాధారణ ప్రయాణికులకు నిరాశే.. దేశీయ విమాన ఇంధన ధరల్లో మార్పు లేదు!

Flight Ticket: అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు మరియు విదేశీ విమానయాన సంస్థలకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం విమాన ఇంధన (ATF) ధరలను భారీగా తగ్గించింది. నెలవారీ ధరల సమీక్షలో భాగంగా అంతర్జాతీయ సర్వీసులకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలపై ఏకంగా 27 శాతం మేర కోత విధించింది. ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లలో ముడిచమురు ధరలు కొంతమేర అదుపులోకి రావడంతో కేంద్ర చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

అయితే, ఈ ధరల తగ్గింపు ప్రయోజనం కేవలం అంతర్జాతీయ విమానాలకు మాత్రమే పరిమితం కానుంది. దేశీయ విమానయాన సంస్థలు (Domestic Airlines) కొనుగోలు చేసే ఇంధన ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశీయ విమాన ఇంధన ధరలను వరుసగా రెండో నెల కూడా యథాతథంగా ఉంచారు. దీనివల్ల దేశీయంగా విమాన ప్రయాణం చేసే సాధారణ ప్రజలకు టికెట్ ధరల పరంగా ఎలాంటి అదనపు ఊరట లభించకపోవచ్చు.

ఈ తాజా తగ్గింపుతో అంతర్జాతీయ విమాన సంస్థలకు కిలో లీటరుకు దాదాపు 400 డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక వెసులుబాటు కలగనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు సుమారు 1,100 డాలర్ల వద్దకు చేరింది. పశ్చిమ ఆసియా (West Asia) సంక్షోభం కారణంగా గత ఏప్రిల్, మే నెలల్లో విపరీతంగా పెరిగిన ఇంధన ధరల నుండి విదేశీ విమాన సంస్థలకు ఈ నిర్ణయం ద్వారా పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

దేశీయ విమాన సంస్థలు మాత్రం మునుపటి రేటు ప్రకారమే కిలో లీటరు ఇంధనానికి 1,04,927.18 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. గత నెలల్లో అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు దేశీయ విమాన ప్రయాణికులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ నష్టాన్ని తామే భరించాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు ఈ రేట్లను చమురు సంస్థలు మార్చకుండా అలాగే ఉంచాయి.

ఇదే సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరను మరో 42 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో 3,113.50 రూపాయలకు చేరింది. అయితే, సాధారణ ప్రజలు ఇళ్లల్లో ఉపయోగించే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలలో మరియు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.

Spotlight

Read More →