Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి

Everest: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Published : 2026-05-24 10:09:00

ఎవరెస్టు దిగివస్తూ ఇద్దరు భారతీయ పర్వతారోహకుల మృతి..

హిందూపురం యువకుడు సందీప్ ఆరే ఎవరెస్టు యాత్రలో మృతి..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ప్రాంతానికి చెందిన సందీప్ ఆరేగా గుర్తించగా, మరొకరు హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణ్ కుమార్ తివారీగా అధికారులు తెలిపారు.

సందీప్ ఆరే అమెరికాలో స్థిరపడి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. పర్వతారోహణపై అతనికి చిన్ననాటి నుంచే ఆసక్తి ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మే 20న ఆయన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. అయితే మరుసటి రోజు తిరిగి దిగివస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు సమాచారం. గతంలో కిలిమంజారో సహా పలు అంతర్జాతీయ శిఖరాలను కూడా సందీప్ అధిరోహించిన అనుభవం ఉన్నట్లు తెలిసింది.

ఇక అరుణ్ కుమార్ తివారీ హైదరాబాద్‌లో నివసిస్తూ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఉద్యోగంతో పాటు పర్వతారోహణను అభిరుచిగా మార్చుకుని ఎన్నో శిఖరాలను అధిరోహించారు. రష్యా, అమెరికా, అర్జెంటీనాలోని పర్వతాలను విజయవంతంగా ఎక్కిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఎవరెస్టు నుంచి దిగివస్తున్న సమయంలో తీవ్ర అలసట, అధిక ఎత్తు ప్రభావం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇద్దరినీ రక్షించేందుకు గైడ్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయినట్లు సమాచారం. ప్రస్తుతం మృతదేహాలను దిగువకు తీసుకురావడానికి ప్రత్యేక బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎవరెస్టు వంటి సాహస యాత్రలు ఎంత గొప్పవో, అంతే ప్రమాదకరమని మరోసారి ఈ ఘటన గుర్తు చేసింది.

Spotlight

Read More →