నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం ఫోన్ ఫీచర్ల మీద దృష్టి పెట్టిన జనం, ఇప్పుడు వాటిని ఎంత వేగంగా, ఎంత సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చనే అంశంపై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి అధునాతన 'వైర్లెస్ ఛార్జింగ్' సాంకేతికత అందుబాటులోకి వచ్చాయి. కేబుల్స్ గందరగోళం లేకుండా, స్టైలిష్‌గా మరియు కాంపాక్ట్ డిజైన్‌తో వస్తున్న ఈ ఛార్జర్లు ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూసే ఓపిక ఎవరికీ లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని గూగుల్, యాపిల్ మరియు బోట్ (boAt) వంటి దిగ్గజ సంస్థలు సరికొత్త అడాప్టర్లను, వైర్లెస్ ప్యాడ్లను రూపొందించాయి. ముఖ్యంగా 'GaN' (Gallium Nitride) టెక్నాలజీతో వస్తున్న ఛార్జర్లు పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ, అత్యంత వేగంగా పవర్ డెలివరీ చేస్తున్నాయి.
వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న టాప్ ఛార్జర్లువైర్లెస్ మరియు వైర్డ్ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న కొన్ని పరికరాలు చూడవచ్చు
యాపిల్ 20W USB-C అడాప్టర్ ఐఫోన్: వినియోగదారులకు ఇది మొదటి ఎంపిక. స్థిరమైన వోల్టేజ్ మరియు బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది అగ్రగామిగా ఉంది.
CMF బై నథింగ్ 65W GaN: ఇది కేవలం ఛార్జర్ మాత్రమే కాదు, ఒక స్టైల్ స్టేట్మెంట్. మూడు పోర్ట్‌లతో వచ్చే ఈ అడాప్టర్ ఫోన్లు, ట్యాబ్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లను కూడా ఛార్జ్ చేయగలదు.
బోట్ ఫ్లెక్స్ ఛార్జ్ 360: ఒకే ప్యాడ్‌పై ఫోన్, స్మార్ట్‌వాచ్ మరియు ఇయర్‌బడ్స్‌ను ఛార్జ్ చేసుకునే సౌకర్యం దీని ప్రత్యేకత. ఇది డెస్క్ మీద కేబుల్స్ గందరగోళాన్ని పూర్తిగా తొలగిస్తుంది.
ఆంబ్రేన్ 100W GaN ఛార్జర్: హెవీ యూజర్ల కోసం రూపొందించిన ఈ ఛార్జర్, పవర్ డెలివరీలో తిరుగులేని వేగాన్ని ప్రదర్శిస్తోంది.
వైర్లెస్ ఛార్జింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
సాధారణ ఛార్జర్లతో పోలిస్తే వైర్లెస్ ప్యాడ్ల వాడకం వల్ల ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, మాగ్నెటిక్ అలైన్మెంట్ (MagSafe) ఫీచర్ ద్వారా ఫోన్ సరైన పొజిషన్లో ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. నేటి యువత ప్రయాణాల్లో కూడా సులభంగా తీసుకెళ్లగలిగే 'ఫోల్డబుల్' డిజైన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
మీరు కొత్త ఛార్జర్ లేదా వైర్లెస్ ప్యాడ్ కొనాలనుకుంటే, మీ ఫోన్ 'Qi' సర్టిఫికేషన్‌ను సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి. అలాగే, ఛార్జర్ అందించే వాటేజ్ (Wattage) మీ పరికరానికి సరిపోతుందా లేదా అన్నది కూడా ముఖ్యమే. అధిక పవర్ ఉన్న ఛార్జర్లు తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తాయి.
టెక్నాలజీ ప్రపంచం వైర్లెస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో డేటా ట్రాన్స్ఫర్ మాత్రమే కాకుండా, విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా గాలిలోనే జరిగే అద్భుతాలు మనం చూడవచ్చేమో బహుశా.