Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!! Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!! మందుబాబులకు గుడ్న్యూస్.. ఆ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..! నక్కపల్లిలో హోంమంత్రి భోగి సంబరాలు.. కేరళ డప్పులతో సందడి.. గోపూజతో ఆధ్యాత్మిక వేడుక! Annadatha: పండుగ వేళ అన్నదాతలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.9,789 కోట్లు జమ! Foreign Policy: గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ గట్టి వార్నింగ్ గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు... లేటెస్ట్ అప్డేట్! ప్రభుత్వం కీలక నిర్ణయం! AP Farmers: ఏపీ రైతులకు సంక్రాంతి కానుక.. ఇవి ఉచితంగా పొందండి.. ఇలా చెయ్యండి! Chandrababu: సంక్రాంతి స్పెషల్.. ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.126 కోట్ల ప్రాజెక్ట్... ఇక ఆ సమస్యలకు చెక్! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!! Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!! మందుబాబులకు గుడ్న్యూస్.. ఆ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..! నక్కపల్లిలో హోంమంత్రి భోగి సంబరాలు.. కేరళ డప్పులతో సందడి.. గోపూజతో ఆధ్యాత్మిక వేడుక! Annadatha: పండుగ వేళ అన్నదాతలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.9,789 కోట్లు జమ! Foreign Policy: గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ గట్టి వార్నింగ్ గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు... లేటెస్ట్ అప్డేట్! ప్రభుత్వం కీలక నిర్ణయం! AP Farmers: ఏపీ రైతులకు సంక్రాంతి కానుక.. ఇవి ఉచితంగా పొందండి.. ఇలా చెయ్యండి! Chandrababu: సంక్రాంతి స్పెషల్.. ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.126 కోట్ల ప్రాజెక్ట్... ఇక ఆ సమస్యలకు చెక్!

Foreign Policy: గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ గట్టి వార్నింగ్

2026-01-14 13:35:00
Indian Railways: ప్రయాణికులకు శుభవార్త… మరో 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం!

గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా, డెన్మార్క్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా మరింత పెరిగాయి. గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ చేసిన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆగ్రహానికి కారణమయ్యాయి. అమెరికాతో కాకుండా డెన్మార్క్‌తోనే కొనసాగుతామని గ్రీన్‌లాండ్ స్పష్టంగా ప్రకటించడంతో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరి కొనసాగితే గ్రీన్‌లాండ్ ప్రధానికి పెద్ద సమస్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, గ్రీన్‌లాండ్ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని సంకేతాలు ఇచ్చారు.

గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు... లేటెస్ట్ అప్డేట్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇటీవల డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్‌లో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్, డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్‌తో కలిసి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్ భవిష్యత్తు విషయంలో తమ నిర్ణయం స్పష్టమని, డెన్మార్క్, నాటో, యూరోపియన్ యూనియన్‌తోనే కొనసాగుతామని ఆయన తేల్చి చెప్పారు. గ్రీన్‌లాండ్ ప్రజల అభిప్రాయమే తుది నిర్ణయమని, ఇతర దేశాలు తమ భవితవ్యాన్ని నిర్ణయించలేవని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలే ట్రంప్ ఆగ్రహానికి కారణమయ్యాయి.

Annadatha: పండుగ వేళ అన్నదాతలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లో రూ.9,789 కోట్లు జమ!

ట్రంప్ స్పందిస్తూ, గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రితో తనకు వ్యక్తిగత పరిచయం లేదని అన్నారు. అయినా గ్రీన్‌లాండ్ తీసుకుంటున్న వైఖరి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్ వ్యూహాత్మకంగా చాలా కీలక ప్రాంతమని, భద్రతా అంశాల్లో అమెరికా ఆసక్తి సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికా, గ్రీన్‌లాండ్, డెన్మార్క్ మధ్య దౌత్యపరమైన చర్చలు మరింత కీలకంగా మారాయి.

Australia Student Visa: ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసా కఠినం.. భారతీయులకు పెరిగిన అడ్డంకులు!

ఈ పరిణామాల మధ్య బుధవారం వైట్ హౌస్‌లో కీలక భేటీ జరగనుంది. డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రస్ముసెన్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్ ఫెల్ట్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో గ్రీన్‌లాండ్ భద్రత, ఆర్కిటిక్ ప్రాంతంలో సైనిక పరిస్థితులు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Brahmamgari path: నాలుగేళ్ల వివాదానికి తెర.. బ్రహ్మంగారి మఠం పీఠంపై వెంకటాద్రి స్వామి

అమెరికా వాదన ప్రకారం, గ్రీన్‌లాండ్ నాటో కూటమికి చెందిన ప్రాంతం కావడంతో అక్కడి భద్రతా బాధ్యతలు కీలకమవుతాయి. అందుకే ఆ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని పెంచాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుతం గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతంగా కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో అమెరికా వైఖరి గ్రీన్‌లాండ్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని అక్కడి మంత్రులు చెబుతున్నారు.

Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం..! రైలుపై కూలిన క్రేన్.. 22 మంది మృతి!

ఈ వివాదంపై NATO కూడా జాగ్రత్తగా స్పందిస్తోంది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, కూటమి దేశాల మధ్య జరిగే అంతర్గత చర్చలపై వ్యాఖ్యానించడం తన బాధ్యత కాదని చెప్పారు. అయితే ఆర్కిటిక్ ప్రాంత భద్రత విషయంలో మాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు. మొత్తంగా గ్రీన్‌లాండ్ అంశం అమెరికా–డెన్మార్క్ సంబంధాల్లో కొత్త మలుపు తిప్పుతుందని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Boarder: సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం..! కాల్పులతో తరిమికొట్టిన భారత సైన్యం!
Post Office Savings: రిస్క్ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? పోస్ట్ ఆఫీస్ ఈ పథకం మీకోసమే!
HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ!
AP Scholarship: ఒక్కొక్కరికి రూ.20,000... ఏపీ ప్రభుత్వ స్కాలర్ షిప్! పూర్తి వివరాలు!

Spotlight

Read More →