Prakash Raj: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు! Kamal Haasan: విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే.. కమల్ హాసన్ నిప్పులు! Chandrababu: కేంద్ర నిధుల మళ్లింపు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లపై సీఎం సమీక్ష! Chandrababu: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్రాండ్ ఎంట్రీ.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడికి SIPB ఆమోదం! 5,000 మంది యువతకు.. Nara Lokesh: 2028 కల్లా దేశంలో 80% ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే- నారా లోకేష్! TVK party: రానున్న 48 గంటలు అత్యంత కీలకం.. తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యేల పహారా.. ఇతర పార్టీల మద్దతుపై విజయ్ క్లారిటీ! Vijay: తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం! మెజారిటీకి 5 సీట్ల దూరంలో.. AP Government: ఏపీ సర్కార్ సంచలనం: 51 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు! Nara Lokesh: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు.. ఎక్స్‌లో ఆసక్తికర వీడియోతో లోకేష్ ప్రకటన! Dwacra Womens: డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకం.. పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం! మే 23న ప్రారంభం! Prakash Raj: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు! Kamal Haasan: విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే.. కమల్ హాసన్ నిప్పులు! Chandrababu: కేంద్ర నిధుల మళ్లింపు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లపై సీఎం సమీక్ష! Chandrababu: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్రాండ్ ఎంట్రీ.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడికి SIPB ఆమోదం! 5,000 మంది యువతకు.. Nara Lokesh: 2028 కల్లా దేశంలో 80% ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే- నారా లోకేష్! TVK party: రానున్న 48 గంటలు అత్యంత కీలకం.. తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యేల పహారా.. ఇతర పార్టీల మద్దతుపై విజయ్ క్లారిటీ! Vijay: తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం! మెజారిటీకి 5 సీట్ల దూరంలో.. AP Government: ఏపీ సర్కార్ సంచలనం: 51 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు! Nara Lokesh: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు.. ఎక్స్‌లో ఆసక్తికర వీడియోతో లోకేష్ ప్రకటన! Dwacra Womens: డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకం.. పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం! మే 23న ప్రారంభం!

Nara Lokesh: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు.. ఎక్స్‌లో ఆసక్తికర వీడియోతో లోకేష్ ప్రకటన!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న వేళ మరో ప్రముఖ సంస్థ రాష్ట్రానికి రానుంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Published : 2026-05-07 10:52:09

రాయల్ ఎన్‍ఫీల్డ్ రూ.2,508 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది..

రాయల్ ఎన్‍ఫీల్డ్ పెట్టుబడుల ద్వారా మూడు వేల మందికి ఉద్యోగాలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న వేళ మరో ప్రముఖ సంస్థ రాష్ట్రానికి రానుంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రకటిస్తూ ఒక ఆసక్తికర వీడియోను కూడా పోస్టు చేశారు.

మంత్రి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ రాష్ట్రంలో రూ.2,508 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు మూడు వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ పెట్టుబడుల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్) సమావేశంలో నిన్న ఆమోదం లభించినట్లు లోకేష్ వెల్లడించారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ కారణంగానే ప్రముఖ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వరుసగా రావడం ప్రభుత్వ పారిశ్రామిక విధానానికి నిదర్శనంగా రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సంస్థ రాష్ట్రంలో అడుగుపెట్టడం ద్వారా ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పెట్టుబడులతో స్థానికంగా అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, యువతకు సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Spotlight

Read More →