Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి అన్నగారే మార్గదర్శి: ఎన్టీఆర్ జయంతి వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు! Butchaiah Chowdary: మహానాడులో బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు.. పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం! Chandrababu: ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం NTR: ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు: 'ఎక్స్' వేదికగా జ్ఞాపకాలను పంచుకున్న చంద్రబాబు, లోకేశ్! NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు! Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై రేవంత్ కీలక ముందడుగు.. మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ సిద్ధం! Mahanadu: వర్చువల్ మహానాడుకు రికార్డు స్పందన.. 7.5 లక్షల మంది హాజరు.. సీఎం చంద్రబాబు హర్షం! Vemireddy: మహానాడులో హైలైట్‌గా నిలిచిన 48 మంది నేతల ప్రసంగాలు.. విరాళాలతో కేడర్‌లో పెరిగిన జోష్! టీడీపీకి రూ.5 కోట్ల.. Chandrababu: వచ్చే ఎన్నికల్లోనూ అదే హిస్టరీ రిపీట్ అవ్వాలి.. ఇగోలు పక్కనబెట్టి కూటమితో కలిసి సాగండి: మహానాడులో చంద్రబాబు పిలుపు" Kirrak RP: ఒకేఒక్కడు సినిమాకు స్ఫూర్తి చంద్రబాబు గారే.. మహానాడులో కిరాక్ ఆర్పీ ఆసక్తికర వ్యాఖ్యలు! Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి అన్నగారే మార్గదర్శి: ఎన్టీఆర్ జయంతి వేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు! Butchaiah Chowdary: మహానాడులో బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు.. పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం! Chandrababu: ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం NTR: ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు: 'ఎక్స్' వేదికగా జ్ఞాపకాలను పంచుకున్న చంద్రబాబు, లోకేశ్! NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు! Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై రేవంత్ కీలక ముందడుగు.. మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ సిద్ధం! Mahanadu: వర్చువల్ మహానాడుకు రికార్డు స్పందన.. 7.5 లక్షల మంది హాజరు.. సీఎం చంద్రబాబు హర్షం! Vemireddy: మహానాడులో హైలైట్‌గా నిలిచిన 48 మంది నేతల ప్రసంగాలు.. విరాళాలతో కేడర్‌లో పెరిగిన జోష్! టీడీపీకి రూ.5 కోట్ల.. Chandrababu: వచ్చే ఎన్నికల్లోనూ అదే హిస్టరీ రిపీట్ అవ్వాలి.. ఇగోలు పక్కనబెట్టి కూటమితో కలిసి సాగండి: మహానాడులో చంద్రబాబు పిలుపు" Kirrak RP: ఒకేఒక్కడు సినిమాకు స్ఫూర్తి చంద్రబాబు గారే.. మహానాడులో కిరాక్ ఆర్పీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై రేవంత్ కీలక ముందడుగు.. మహారాష్ట్రతో చర్చలకు తెలంగాణ సిద్ధం!

Revanth Reddy: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఎంతోకాలంగా చర్చనీయాంశంగా ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక అడుగు వేశారు.

Published : 2026-05-28 10:23:00

ఫడ్నవీస్‌కు రేవంత్ లేఖ.. తుమ్మిడిహెట్టి అంశం మళ్లీ హాట్‌టాపిక్..

148 మీటర్ల FRL సరిపోదు.. తెలంగాణ అభ్యంతరం..

తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఎంతోకాలంగా చర్చనీయాంశంగా ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక అడుగు వేశారు. బ్యారేజ్‌ ఎత్తు పెంపు, నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై మరోసారి చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య అధికారిక సమావేశం ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రతినిధులకు సమయం కేటాయించాలని ఆయన కోరారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌కు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న 148 మీటర్ల ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ (FRL) తెలంగాణ అవసరాలకు సరిపోదని రేవంత్‌రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల భవిష్యత్‌ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యారేజ్‌ ఎత్తును పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

బ్యారేజ్‌ ఎత్తు పెరిగితే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంటుందని, దీని వల్ల సాగు, తాగునీటి అవసరాలు మరింత సమర్థంగా తీర్చవచ్చని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు కలిసి సమగ్రంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. సమావేశ తేదీని త్వరలో ఖరారు చేసి పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని ఆయన లేఖలో కోరినట్లు సమాచారం.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు గోదావరి జలాల వినియోగంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగునీరు, తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి తాజా లేఖతో ఈ అంశం మళ్లీ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Spotlight

Read More →