Pawan Kalyan: వేట్లపాలెం ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.. క్షేత్రస్థాయిలో మంత్రి కందుల దుర్గేష్‌ పర్యటన..!! AP Judicial Academy: ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.165 కోట్లతో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ! మార్చి 1 న శంకుస్థాపన! AP Development: ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన! గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు..! Chandrababu: సచివాలయంలో NRI సభ్యులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ భేటీ! గల్ఫ్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పందన.. Atchannaidu: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.!! AP Politics: లడ్డూ కల్తీ పాపం నుంచి జగన్ తప్పించుకోలేరు..! మంత్రి బాల వీరాంజనేయస్వామి ఘాటు వ్యాఖ్యలు! Nimmala Ramanaidu: అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ నేతలు..‌అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడితే సహించం నిమ్మల హెచ్చరిక..! Nara Lokesh: విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్.. సమస్యల పరిష్కారానికి అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు.! AP Housing: ఏపీలో ఉగాది సంబరం... 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలకు సర్కార్ సిద్ధం! APPSC: ఏపీ గ్రూప్-1 కేసులో బిగ్ ట్విస్ట్...! సిట్ విచారణను పర్యవేక్షించనున్న హైకోర్టు! Pawan Kalyan: వేట్లపాలెం ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.. క్షేత్రస్థాయిలో మంత్రి కందుల దుర్గేష్‌ పర్యటన..!! AP Judicial Academy: ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.165 కోట్లతో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ! మార్చి 1 న శంకుస్థాపన! AP Development: ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటన! గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు..! Chandrababu: సచివాలయంలో NRI సభ్యులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ భేటీ! గల్ఫ్ కార్మికుల సమస్యలపై సానుకూల స్పందన.. Atchannaidu: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.!! AP Politics: లడ్డూ కల్తీ పాపం నుంచి జగన్ తప్పించుకోలేరు..! మంత్రి బాల వీరాంజనేయస్వామి ఘాటు వ్యాఖ్యలు! Nimmala Ramanaidu: అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ నేతలు..‌అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడితే సహించం నిమ్మల హెచ్చరిక..! Nara Lokesh: విశాఖలో లోకేష్ ప్రజాదర్బార్.. సమస్యల పరిష్కారానికి అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు.! AP Housing: ఏపీలో ఉగాది సంబరం... 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలకు సర్కార్ సిద్ధం! APPSC: ఏపీ గ్రూప్-1 కేసులో బిగ్ ట్విస్ట్...! సిట్ విచారణను పర్యవేక్షించనున్న హైకోర్టు!

IPS Sunil Nayak: ఐపీఎస్ సునీల్ నాయక్‌కు బీహార్ 'రక్షణ కవచం'.. అరెస్టు వ్యవహారంలో కొత్త మలుపు..!!

IPS Sunil Naik twist arrest case : ప్రస్తుతం సునీల్ నాయక్‌పై గుంటూరు కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 2026-02-28 10:48:00

ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టుపై కొత్త గెజిట్ అస్త్రం…

రెండు రాష్ట్రాల మధ్య 'అధికార' పోరు…

పాట్నా హైకోర్టు స్టే vs గుంటూరు కోర్టు వారెంట్…

IPS Sunil Naik twist arrest case : సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చట్టపరమైన సమస్యగా మారుతోంది. సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకోవాలని చూస్తున్న ఏపీ పోలీసులకు బీహార్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. తమ రాష్ట్ర అధికారులను ఇతర రాష్ట్రాల పోలీసులు అరెస్టు చేయాలంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి ఉండాలనే నిబంధనను బీహార్ సర్కార్ తెరపైకి తెచ్చింది. ఈ మేరకు చట్టంలో కీలక సవరణలు చేస్తూ బీహార్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడంతో సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం అత్యంత క్లిష్టంగా మారింది.

ప్రస్తుతం సునీల్ నాయక్‌పై గుంటూరు కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. బీహార్ సర్కార్ తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులపై వేరే రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలంటే ఇకపై అనుమతుల కోసం వేచి చూడాల్సిందే. ఈ రక్షణ కవచం కారణంగా సునీల్ నాయక్‌ను ఏపీకి తీసుకురావడం పోలీసులకు సవాలుగా మారేలా కనిపిస్తోంది.

మరోవైపు, సునీల్ నాయక్ ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు. మార్చి 2వ తేదీ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ పాట్నా హైకోర్టు ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని, గుంటూరు కోర్టు జారీ చేయబోయే నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రద్దు  చేయాలని సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గుంటూరు కోర్టు విచారణకు స్వీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు నాన్ బెయిలబుల్ వారెంట్‌పై అధికారిక ఉత్తర్వులే ఇంకా వెలువడలేదని,అలాంటప్పుడు ఆ వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ 'రీకాల్' పిటిషన్ వేయడం చెల్లదని ఆయన వాదిస్తున్నారు. అంతేకాకుండా, పాట్నా కోర్టు సునీల్ నాయక్‌కు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులకు ఇక్కడ చట్టబద్ధత లేదని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వ్యవహారంలో ఇవాళ గుంటూరు కోర్టులో జరగనున్న విచారణ అత్యంత కీలకం కానుంది. ఒకవైపు బీహార్ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం, మరోవైపు పాట్నా కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు.. ఈ రెండింటి మధ్య ఏపీ పోలీసులు ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులను బట్టి సునీల్ నాయక్ అరెస్టు ఉంటుందా లేదా అనేది తేలిపోనుంది.

Spotlight

Read More →