India US Relations: అమెరికా ప్రతినిధులతో మంత్రి జైశంకర్ కీలక భేటీ.. వాటిపై ప్రధాన అజెండాగా చర్చలు! BreakingNews: కిడ్నాప్ డ్రామాతో బయటపడ్డ ₹400 కోట్ల దోపిడీ గుట్టు రట్టు..! దేశవ్యాప్తంగా సంచలనం! Trump Emergency: 10 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్, 14 వేలకుపైగా విమానాలు రద్దు..!! Mann Ki Baat: మన్‌కీ బాత్‌లో అనంతపురం కథ చెప్పిన ప్రధాని..! నీటి రక్షణ నుంచి స్టార్టప్‌ల వరకూ…! Lands: ఏపీలో భూముల ధరలకు షాక్! ఆదాయం పెంచే లక్ష్యంతో భూముల ధరల సవరణ! Iran: భారత్ వైఖరిపై ప్రశంసలు.. న్యాయం, సార్వభౌమత్వానికి నిదర్శనం.. ఇరాన్! ఏపీలో 13 కొత్త డయాలసిస్ కేంద్రాలు! ఎక్కడెక్కడంటే? Trade War: ఆ దేశానికి ట్రంప్ వార్నింగ్! చైనాతో డీల్ కుదిరితే 100 శాతం పన్నులు! AP Government: ఏపీలో వారికి ప్రభుత్వం అండ... ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! India US Relations: అమెరికా ప్రతినిధులతో మంత్రి జైశంకర్ కీలక భేటీ.. వాటిపై ప్రధాన అజెండాగా చర్చలు! BreakingNews: కిడ్నాప్ డ్రామాతో బయటపడ్డ ₹400 కోట్ల దోపిడీ గుట్టు రట్టు..! దేశవ్యాప్తంగా సంచలనం! Trump Emergency: 10 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్, 14 వేలకుపైగా విమానాలు రద్దు..!! Mann Ki Baat: మన్‌కీ బాత్‌లో అనంతపురం కథ చెప్పిన ప్రధాని..! నీటి రక్షణ నుంచి స్టార్టప్‌ల వరకూ…! Lands: ఏపీలో భూముల ధరలకు షాక్! ఆదాయం పెంచే లక్ష్యంతో భూముల ధరల సవరణ! Iran: భారత్ వైఖరిపై ప్రశంసలు.. న్యాయం, సార్వభౌమత్వానికి నిదర్శనం.. ఇరాన్! ఏపీలో 13 కొత్త డయాలసిస్ కేంద్రాలు! ఎక్కడెక్కడంటే? Trade War: ఆ దేశానికి ట్రంప్ వార్నింగ్! చైనాతో డీల్ కుదిరితే 100 శాతం పన్నులు! AP Government: ఏపీలో వారికి ప్రభుత్వం అండ... ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!!

India US Relations: అమెరికా ప్రతినిధులతో మంత్రి జైశంకర్ కీలక భేటీ.. వాటిపై ప్రధాన అజెండాగా చర్చలు!

భారత్-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. రక్షణ, టారిఫ్‌ల తగ్గింపు మరియు ఇండో-పసిఫిక్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు..

2026-01-25 17:44:00

భారత్-అమెరికా సంబంధాల్లో  దౌత్యపరమైన అడుగులు పడ్డాయి అనే  చెప్పుకోవాలి ఆదివారం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో కీలక భేటీ నిర్వహించారు. రక్షణ, వాణిజ్యం మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

సవాళ్ల మధ్య దౌత్య చర్చలు

గత కొంతకాలంగా భారత్, అమెరికా సంబంధాల్లో తీవ్రమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై 50 శాతం టారిఫ్‌లు విధించడం, అదనంగా 25 శాతం  పన్నులు వేయడం ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జిమ్మీ పాట్రోనిస్, మైక్ రోజర్స్ మరియు ఆడమ్ స్మిత్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల అమెరికా బృందం భారత్‌లో పర్యటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

అజెండాలో కీలక అంశాలు

ఈ భేటీని మంత్రి జైశంకర్ తన సోషల్ మీడియా వేదికగా ఫలప్రదమైన చర్చ గా అభివర్ణించారు. సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు

 భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం: ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహ బంధాన్ని కొత్త పుంతలు తొక్కించడం.

 ఇండో-పసిఫిక్ రీజియన్: ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వం కోసం పరస్పర సహకారం.

 ఉక్రెయిన్ వివాదం: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు మరియు వాటి ప్రభావంపై అభిప్రాయాల మార్పిడి.

 వాణిజ్య ఒప్పందం: పెండింగ్‌లో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై పురోగతి సాధించడం.

వాణిజ్య ఒప్పందంలో అడ్డంకులు

అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రక్షణ మరియు ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, భారత వ్యవసాయ మరియు పాల ఉత్పత్తుల మార్కెట్‌ను తమ కోసం తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తుండటంతో వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావడం లేదు. దీనికి తోడు అమెరికా కొత్త వలస విధానం (Immigration Policy) కూడా భారతీయులను ఆందోళనకు గురిచేస్తుంది..

ఆర్థిక నిపుణుల విశ్లేషణ

ఒకవేళ భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం 2026-27 తొలి త్రైమాసికం నాటికి కుదరకపోతే, భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందం ఆలస్యమైతే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, జైశంకర్ మరియు అమెరికా ప్రతినిధుల మధ్య జరిగిన ఈ తాజా చర్చలు రెండు దేశాల మధ్య మంచును కరిగించి, ఆర్థిక సహకారాన్ని పునరుద్ధరిస్తాయని విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →