Blue Print: ముఖ్యమంత్రి కీలక ప్రకటన! సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో 'బ్లూ ప్రింట్'.. Gas EKyc: ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ముఖ్య గమనిక..! వెంటనే ఈ పని చేయండి! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!! Vehicle RC: ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరిగే పనిలేదు..! ఇంట్లోనే ఆర్‌సీ అడ్రస్ మార్చుకోండి...! Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Blue Print: ముఖ్యమంత్రి కీలక ప్రకటన! సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో 'బ్లూ ప్రింట్'.. Gas EKyc: ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ముఖ్య గమనిక..! వెంటనే ఈ పని చేయండి! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!! Vehicle RC: ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరిగే పనిలేదు..! ఇంట్లోనే ఆర్‌సీ అడ్రస్ మార్చుకోండి...! Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే...

Chandrababu: ఈ నెల 28న రావివలసలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. ఇంటింటికీ వెళ్లి పింఛన్ల అందజేత!

Chandrababu Visit Vijayanagaram: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటనను ఖరారు చేశారు.

Published : 2026-02-26 14:10:00
  • ముఖ్యమంత్రి రాకతో జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..
     
  • జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రావివలస గ్రామానికి..

Chandrababu Visit Vijayanagaram: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటనను ఖరారు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రావివలస గ్రామానికి చేరుకుని, అక్కడ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులను అందజేయనున్నారు. ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

ఈ పర్యటనలో పింఛన్ల పంపిణీ పూర్తి చేసిన తర్వాత, అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి ఆయన ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టుల పైన, నిరుద్యోగ భృతి ఇతర హామీల అమలు పైన ముఖ్యమంత్రి ఈ వేదిక నుంచి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సీఎం పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రావివలస గ్రామంలోనూ, సభా ప్రాంగణం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సభా స్థలిని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రాకతో జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

Spotlight

Read More →