TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! AP Job Calendar: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 షెడ్యూల్ ఇదే..! గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లపై స్పష్టత! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! AP Job Calendar: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 షెడ్యూల్ ఇదే..! గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లపై స్పష్టత!

Lineman Recruitment: నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ఫోకస్.. లైన్‌మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.!!

Lineman Recruitment: విశాఖపట్నం లాంటి తీర ప్రాంత నగరాల్లో తుపానుల సమయంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికతో ముందుకెళ్తోందని మంత్రి వివరించారు.

Published : 2026-02-26 17:49:00

విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు..

లైన్‌మెన్ ఖాళీల భర్తీ త్వరలోనే..

విశాఖలో అండర్‌గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్ట్…

Lineman Recruitment: రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో లైన్‌మెన్‌ల నియామకం, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన  సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతను తీర్చడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే ఏఈల కొరతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసి, వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మూడు డిస్కమ్‌ల పరిధిలో ప్రస్తుతం సుమారు 18 వేల మంది వివిధ పద్ధతుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి తెలిపారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా తక్షణ అవసరాల కోసం కాంట్రాక్ట్  అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో సిబ్బందిని నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేసేందుకు 15,580 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ పూర్తికాగానే వారి సర్వీసులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, దీనివల్ల లైన్ల నిర్వహణ మరియు మరమ్మతుల పనుల్లో వేగం పెరుగుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం లాంటి తీర ప్రాంత నగరాల్లో తుపానుల సమయంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఒక వినూత్న ప్రణాళికతో ముందుకెళ్తోందని మంత్రి వివరించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విశాఖలో అత్యాధునిక 'అండర్ గ్రౌండ్ కేబుల్'  వ్యవస్థను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే భారీ గాలులు, వర్షాలు కురిసినా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగదని, ఇది నగరవాసులకు పెద్ద ఊరటనిస్తుందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్ అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 'ఆర్డీఎస్ఎస్'  పథకం కింద భారీగా పనులు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 8 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన సభకు వివరించారు. ఈ పథకం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడమే కాకుండా, మారుమూల వ్యవసాయ కనెక్షన్లకు కూడా నాణ్యమైన కరెంటు అందుతుందని తెలిపారు.

ఆర్డీఎస్ఎస్ పనుల గడువుపై స్పందిస్తూ, వచ్చే ఏప్రిల్ నాటికి వంద శాతం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకు సిబ్బంది అవసరం ఎంతో ఉందని, అందుకే ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం వెనకాడబోదని స్పష్టం చేశారు. కేవలం నియామకాలే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తామని, ప్రజలకు  రైతులకు మెరుగైన సేవలందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నొక్కి చెప్పారు.

Spotlight

Read More →