- స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పిస్తాం..
- వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు..
Minister Veeranjaneya Swamy: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేరు మార్పు బిల్లు ఆమోదం సందర్భంగా శాసన మండలిలో మంత్రి డిఎస్ బీవీ స్వామి మాట్లాడుతూ...స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నాం.
స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తాం. స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్ధ తీసుకొచ్చాం. గత ప్రభుత్వ హయాంలో లోప భూయిష్టంగా ఉన్న వ్యవస్ధను కూటమి ప్రభత్వంలో పటిష్టంగా తీర్చిదిద్దుతున్నాం. కూటమిపాలనలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఇచ్చామని వైసిపి హయాంలో పంచాయతీ నిధులను దారిమల్లించారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.