Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి పెన్షన్ పెంపు! ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు... Parliament's Budget Meeting: ఢిల్లీలో పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం! Praja Vedika: నేడు (09/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ration cards: ఏపీలో రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు... పూర్తి వివరాలివే! Chandrababu: త్వరలోనే వారికి 33% రిజర్వేషన్లు! ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కండి- చంద్రబాబు! Iconic Bridge: అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ మార్పు! కొత్త రూట్ ఇదే... Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి పెన్షన్ పెంపు! ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు... Parliament's Budget Meeting: ఢిల్లీలో పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం! Praja Vedika: నేడు (09/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ration cards: ఏపీలో రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు... పూర్తి వివరాలివే! Chandrababu: త్వరలోనే వారికి 33% రిజర్వేషన్లు! ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కండి- చంద్రబాబు! Iconic Bridge: అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ మార్పు! కొత్త రూట్ ఇదే...

Atchannaidu: హిందూవుల మనోభావాలు జగన్ కు పట్టవా? శాసన మండలిలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్!

Atchannaidu Comments On Jagan: శాసన మండలిలో అధికార పక్షం సభ్యులు సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్షాన్ని తిప్పికొట్టడంతో వైసీపీ సభ్యులు ఆత్మరక్షణలో పడ్డారు. కల్తీ నెయ్యి అంశంపై ఇన్ని రోజులు వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని సభలో ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు, మరో వైపు మంత్రి పయ్యావుల కేశవ్ ధీటైన సమాధానం ఇచ్చారు.

Published : 2026-03-04 22:00:00
  • మండలిలో కల్తీ నెయ్యిపై చర్చను అడ్డుకున్న వైసీపీ సభ్యులు..
     
  • క్రైస్తవుల పట్ల ఒకలా, హిందూవులపై మరోలా జగన్ తీరు..

Atchannaidu Comments On Jagan: శాసన మండలిలో అధికార పక్షం సభ్యులు సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్షాన్ని తిప్పికొట్టడంతో వైసీపీ సభ్యులు ఆత్మరక్షణలో పడ్డారు. కల్తీ నెయ్యి అంశంపై ఇన్ని రోజులు వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని సభలో ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు, మరో వైపు మంత్రి పయ్యావుల కేశవ్ ధీటైన సమాధానం ఇచ్చారు. కల్తీ నెయ్యిపై ఇన్ని రోజులు వైసీపీ నేతలు చేసిన తప్పుడు ప్రచారం మండలిలో జరిగిన చర్చ ద్వారా మరోసారి బయటపడింది. వైసీపీ డొల్లతనం బట్టబయలైంది. ఏం మాట్లాడాలో తెలియక వైసీపీ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే... ఒక దశలో శాసనమండలి ఛైర్మన్ కూడా వైసీపీ తీరును తప్పుబట్టి ఆగ్రహం వ్యక్తం చేయక తప్పనిసరైంది. 

జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టే దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. గత ఐదేళ్లల్లో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించకపోవడం ఒక్కసారి కూడా కుటుంబంతో దర్శనానికి వెళ్లకపోవడం, డిక్లరేషన్ పై సంతకం చేయకపోవడం వంటి అంశాలు జగన్ మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయని అచ్చెన్నాయుడు సభలో జగన తీరును ఎండగట్టారు. అదే విధంగా గతంలో సాక్షిలో ప్రచురితమైన వార్తను మంత్రి అచ్చెన్నాయుడు సభ దృష్టికి తీసుకొచ్చారు. 

జీసెస్ ఫోటో సాక్షిలో తప్పుగా ప్రచురించినందుకు క్రైస్తవ సోదరులకు శతకోటి క్షమాపణలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, తాను చేసిన పాపాలకు హిందువులకు క్షమాపణ చెప్పకపోగా... హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని ప్రతి రోజూ మండలిలో పట్టుబట్టిన వైసీపీ సభ్యులు... నేడు అదే అంశంపై నిర్వహించిన చర్చలో కల్తీ నెయ్యి విషయం తప్ప మిగతా అంశాలను ప్రస్తావిస్తూ నవ్వులపాలయ్యారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. మండలిలో వైసీపీని డిఫెన్సులోకి నెట్టేయడంలో టీడీపీ సీనియర్లు అచ్చెన్నాయుడు, పయ్యావుల సక్సెస్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Spotlight

Read More →