AP Ration Card Updates: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక మీసేవ కేంద్రాల్లోనే మార్పులు, చేర్పులు! Chandrababu: అమరావతి పనుల్లో నాణ్యతే ప్రాధాన్యం – గడువులోగా పూర్తి చేయాల్సిందే- సీఎం చంద్రబాబు! Chandrababu: మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్.. నిందితుడికి నరకం చూపించాలి... Amaravati Capital: రాజధానిపై 9 సార్లు మాట మార్చారు.. మీకా విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు? Kollu Ravindra: విజయవాడలో ఏఐ సమ్మిట్ ప్రారంభం! 25 ఏళ్ల క్రితమే ఏఐ విజన్‌ను చూసిన చంద్రబాబు- కొల్లు రవీంద్ర! AP Govt: 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రూపం.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నూతన మ్యాప్! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! AP Ration Card Updates: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక మీసేవ కేంద్రాల్లోనే మార్పులు, చేర్పులు! Chandrababu: అమరావతి పనుల్లో నాణ్యతే ప్రాధాన్యం – గడువులోగా పూర్తి చేయాల్సిందే- సీఎం చంద్రబాబు! Chandrababu: మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్.. నిందితుడికి నరకం చూపించాలి... Amaravati Capital: రాజధానిపై 9 సార్లు మాట మార్చారు.. మీకా విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు? Kollu Ravindra: విజయవాడలో ఏఐ సమ్మిట్ ప్రారంభం! 25 ఏళ్ల క్రితమే ఏఐ విజన్‌ను చూసిన చంద్రబాబు- కొల్లు రవీంద్ర! AP Govt: 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రూపం.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నూతన మ్యాప్! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ!

AP Kapu Welfare: కాపుల సంక్షేమానికి కూటమి సర్కార్ పెద్దపీట... బడ్జెట్‌లో భారీ కేటాయింపులు: మంత్రి సవిత!

AP Budget 2025-26: ఏపీలో కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపుల గురించి మంత్రి సవిత అసెంబ్లీలో వివరించారు. విదేశీ విద్య, కాపు భవనాల నిర్మాణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాల గురించి వివరాలు..

Published : 2026-03-06 13:08:00

AP Kapu Welfare: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన పథకాలను తిరిగి పునరుద్ధరించి, కాపు యువతకు అండగా నిలుస్తున్నామని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్‌లో సైతం కాపుల సంక్షేమానికి గతంలో కంటే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా సభకు వివరించారు.

విదేశీ విద్య విషయంలో గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014-19 మధ్యకాలంలో దాదాపు 1585 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.153 కోట్లకు పైగా ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అయితే, గత ఐదేళ్లలో వైసీపీ కేవలం 81 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న 331 మంది విద్యార్థుల బకాయిలను విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) గాను కాపు సంక్షేమం కోసం రూ.5,571.48 కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు.

కాపు భవనాల నిర్మాణంపై స్పందిస్తూ.. గత ప్రభుత్వం వీటిని గాలికొదిలేసిందని మంత్రి సవిత ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ఈ భవనాల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం మళ్లీ వేగవంతం చేసిందని చెప్పారు. కేవలం నిధులు కేటాయించడమే కాకుండా, అవి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూస్తున్నామన్నారు. గతేడాది రూ.4,440 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది ఆ మొత్తాన్ని మరింత పెంచి కాపుల ఆర్థిక ఎదుగుదలకు బాటలు వేస్తున్నామని ఆమె వివరించారు.

యువతకు ఉపాధి కల్పనలో భాగంగా చేపట్టిన పథకాలను మంత్రి వివరించారు. ఆటో డ్రైవర్ల సేవా పథకం ద్వారా 25 వేల మందికి పైగా కాపు లబ్ధిదారులకు మేలు జరిగిందని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కాపు కుటుంబాలకు భృతి అందించామని చెప్పారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల 54 మంది కాపు అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.217 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.

మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత అన్నారు. చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద 10,300 మందిని, ఎంఎస్ఎంఈ గ్రూపుల ద్వారా మరికొంతమందిని గుర్తించి వారికి ఆర్థిక చేయూతనిస్తున్నామని చెప్పారు. అలాగే 11 వేల మందికి పైగా కాపు మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి, వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ఆమె పునరుద్ఘాటించారు

Spotlight

Read More →