Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి..

AP Free Sanitary Napkins Scheme: విద్యార్థినులకు గుడ్ న్యూస్.. 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు!

Free Sanitary Napkins Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.18.96 కోట్లను చెల్లించామని, నాణ్యమైన ప్యాడ్లతో పాటు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Published : 2026-03-06 12:45:00

Andhra Pradesh Education:  రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను పంపిణీ చేస్తున్నట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనమండలి వేదికగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి  నారా లోకేష్ వెల్లడించారు.

పాత బకాయిల చెల్లింపు.. నాణ్యతకు ప్రాధాన్యం

గత ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి దాదాపు రూ.18.96 కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని, బాధ్యత గల ప్రజా ప్రభుత్వంగా తాము ఆ బకాయిలన్నింటినీ క్లియర్ చేశామని లోకేష్ స్పష్టం చేశారు. కేవలం పంపిణీ చేయడమే కాకుండా, విద్యార్థినుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆర్టీజీఎస్  ద్వారా ఫోన్ కాల్స్ చేసి అడగగా.. 96 శాతం మంది బాలికలు తమకు సక్రమంగా అందుతున్నాయని చెప్పారని, నాణ్యత విషయంలో కూడా 85 శాతం మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విద్యార్థినుల కోరిక మేరకు గతంలో ఇచ్చే సైజుల సంఖ్యను మార్చి, ఇప్పుడు 5 రెగ్యులర్, 5 లార్జ్ సైజ్ ప్యాడ్లను అందజేస్తున్నట్లు వివరించారు.

ఆధునిక పద్ధతులు - ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్లు

బాలికల సౌకర్యం కోసం కేజీబీవీ పాఠశాలల్లో ఇప్పటికే 'స్మార్ట్ కార్డ్' ఆధారిత వెండింగ్ మిషన్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టామని, త్వరలోనే వీటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసే 'ఎకో ఫ్రెండ్లీ' శానిటరీ ప్యాడ్ల పంపిణీపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనిపై ఎన్జీవోలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హెచ్‌పీవీ  వ్యాక్సిన్‌పై ప్రత్యేక అవగాహన

మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని లోకేష్ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Spotlight

Read More →