Chandrababu: మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్.. నిందితుడికి నరకం చూపించాలి... Amaravati Capital: రాజధానిపై 9 సార్లు మాట మార్చారు.. మీకా విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు? Kollu Ravindra: విజయవాడలో ఏఐ సమ్మిట్ ప్రారంభం! 25 ఏళ్ల క్రితమే ఏఐ విజన్‌ను చూసిన చంద్రబాబు- కొల్లు రవీంద్ర! AP Govt: 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రూపం.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నూతన మ్యాప్! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Chandrababu: మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్.. నిందితుడికి నరకం చూపించాలి... Amaravati Capital: రాజధానిపై 9 సార్లు మాట మార్చారు.. మీకా విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు? Kollu Ravindra: విజయవాడలో ఏఐ సమ్మిట్ ప్రారంభం! 25 ఏళ్ల క్రితమే ఏఐ విజన్‌ను చూసిన చంద్రబాబు- కొల్లు రవీంద్ర! AP Govt: 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రూపం.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నూతన మ్యాప్! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం..

AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

AP government: రాయలసీమ సమగ్ర అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.

Published : 2026-04-04 13:04:00
  • "కర్నూలుకు హైకోర్టు బెంచ్": ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం..
     
  • Politics: పాత భవనాల స్థానంలో అత్యాధునిక హంగులు: రాయలసీమ వాసులకు చేరువగా న్యాయ సేవలు..

Rayalaseema AP government: రాయలసీమ సమగ్ర అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందడాన్ని రాయలసీమ ప్రజలు హర్షిస్తున్న తరుణంలో, వారికి మరింత చేరువగా న్యాయ సేవలను అందించేందుకు అనువైన ప్రదేశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రాంతంలోనే ఈ బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్నూలు నగరంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి భరత్ స్పష్టం చేయడంతో, స్థానిక యంత్రాంగం ప్రభుత్వ మరియు కొన్ని ప్రైవేట్ భవనాలను ప్రాథమికంగా తనిఖీ చేసింది.

ఈ అన్వేషణలో భాగంగా సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత ఏబీసీ (ABC) క్వార్టర్లను అధికారులు ప్రధానంగా పరిశీలించారు. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరుకోవడంతో, వీటిని కూల్చివేసి అదే స్థలంలో అత్యాధునిక హంగులతో హైకోర్టు బెంచ్ భవనాన్ని నిర్మించే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఐదేళ్ల అధికారంలో ఉండి కర్నూలును 'న్యాయ రాజధాని' చేస్తామంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని కూటమి నేతలు మండిపడ్డారు. మాటలు చెప్పడమే తప్ప, గత ప్రభుత్వం కర్నూలులో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాయలసీమ సెంటిమెంట్‌తో ఆడుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమకు న్యాయం చేస్తూ, త్వరితగతిన హైకోర్టు బెంచ్ పనులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

Spotlight

Read More →