Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Chandrababu: సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో చంద్రబాబు.. 5 పిల్లర్లతో పటిష్టంగా - ఏడాదిలో 56.40 లక్షల మందికి.! Amaravati: అమరావతికి పార్లమెంటు పట్టాభిషేకం... చట్టబద్ధమైన రాజధానిగా కేంద్రం ముద్ర! Raghurama Krishnam Raju: ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి రఘురామ పిలుపు.. భక్తులు విరాళాలు అందించాలని విజ్ఞప్తి.! AP Police: నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పాపిల్లాన్.. కొత్త టెక్నాలజీతో ఏపీ పోలీస్ హైటెక్ గస్తీ.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Chandrababu: సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో చంద్రబాబు.. 5 పిల్లర్లతో పటిష్టంగా - ఏడాదిలో 56.40 లక్షల మందికి.! Amaravati: అమరావతికి పార్లమెంటు పట్టాభిషేకం... చట్టబద్ధమైన రాజధానిగా కేంద్రం ముద్ర! Raghurama Krishnam Raju: ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి రఘురామ పిలుపు.. భక్తులు విరాళాలు అందించాలని విజ్ఞప్తి.! AP Police: నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పాపిల్లాన్.. కొత్త టెక్నాలజీతో ఏపీ పోలీస్ హైటెక్ గస్తీ..

Amaravati Construction Updates: రాజధాని చుట్టూ పోలీస్ పహారా...‌ 6 చెక్ పోస్టుల ఏర్పాటుతో గుంటూరు ఎస్పీ కీలక నిర్ణయం.

Amaravati Construction Updates: అమరావతి రాజధానిలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనుల మధ్య వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. రాయపూడిలో పైపులు తగలబెట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రత దృష్ట్యా గుంటూరు ఎస్పీ రాజధాని చుట్టూ 6 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పెంచారు.

Published : 2026-03-31 14:12:00

Amaravati Construction Updates:  ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ ఊపు అందుకోవడంతో రాజధాని ప్రాంతం అంతా సందడిగా మారింది. అయితే, ఇదే సమయంలో అక్కడ జరుగుతున్న కొన్ని అనుమానాస్పద ఘటనలు ప్రభుత్వం  పోలీసు యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ సంస్థలకు చెందిన పైపులు వరుసగా దగ్ధమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మూడు చోట్ల, మూడు సార్లు పైపులు తగలబడటాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఎవరైనా కావాలనే ఇలా చేస్తున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 23న రాయపూడిలో ఉన్న 'మెగా' సంస్థకు చెందిన డంపింగ్ యార్డులో భారీ ఎత్తున పైపులు కాలిపోయాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనే ఆ పైపులను తగలబెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ప్రస్తుతం కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు.

ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో ఇకపై ఇలాంటి దొంగతనాలు గానీ, అగ్నిప్రమాదాలు గానీ జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతం చుట్టూ ఆరు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిఘా పెంచడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు భావిస్తున్నారు.

ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ మూడు మండలాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు చెక్ పోస్టులను సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోకి వచ్చే వాహనాలను, కొత్త వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. నిర్మాణ సామగ్రి చోరీకి గురికాకుండా ఉండటానికి పెట్రోలింగ్‌ను కూడా ముమ్మరం చేశారు.

ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తరుణంలో ఇలాంటి ఆటంకాలు ఎదురవ్వడం కలకలం రేపుతోంది. కుట్ర కోణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని తేల్చడానికి నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగాయి. మరోవైపు నిర్మాణ సంస్థలు కూడా తమ యార్డుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయాలని పోలీసులు సూచించారు.

Spotlight

Read More →