Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం.. Weavers: అంపశయ్యపై ఉన్న చేనేతకు కూటమి ప్రభుత్వం ఊపిరి! నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు! TDP: గత ప్రభుత్వం వ్యాపారులను వేధించింది.. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం! West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు! Nara Lokesh: మహిళా కూలీల మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండ! Chandrababu: స్వచ్ఛత నుంచి అభివృద్ధి వరకు.. ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు ఫోకస్! Khushbu Sundar: తమిళనాట మళ్లీ సనాతన మంటలు: సీఎం విజయ్‌, ఉదయనిధికి ఖుష్బూ సుందర్ సూటి ప్రశ్నలు! Nara Lokesh: భాష ఏదైనా గుండె చప్పుడు ఒక్కటే.. అస్సాం బాలిక తెలుగు పాటపై లోకేష్ ఫిదా.! Chandrababu: ఏపీలో తొలిసారి 'సాగునీటి క్యాలెండర్' ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం.. Weavers: అంపశయ్యపై ఉన్న చేనేతకు కూటమి ప్రభుత్వం ఊపిరి! నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు! TDP: గత ప్రభుత్వం వ్యాపారులను వేధించింది.. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం! West Bengal: పశ్చిమాబెంగాల్ లో ఇంకా తగ్గని ఎన్నికల వేడి.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు! Nara Lokesh: మహిళా కూలీల మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండ! Chandrababu: స్వచ్ఛత నుంచి అభివృద్ధి వరకు.. ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు ఫోకస్! Khushbu Sundar: తమిళనాట మళ్లీ సనాతన మంటలు: సీఎం విజయ్‌, ఉదయనిధికి ఖుష్బూ సుందర్ సూటి ప్రశ్నలు! Nara Lokesh: భాష ఏదైనా గుండె చప్పుడు ఒక్కటే.. అస్సాం బాలిక తెలుగు పాటపై లోకేష్ ఫిదా.! Chandrababu: ఏపీలో తొలిసారి 'సాగునీటి క్యాలెండర్' ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!

Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం..

Prajadarbar: మార్కాపురంకు చెందిన పేరూరి శ్రీనివాసులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..

Published : 2026-05-16 22:24:00
  • Politics: అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు…
     
  • విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్..

Prajadarbar: మార్కాపురంకు చెందిన పేరూరి శ్రీనివాసులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ..  గోగులదిన్నె రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 54/1 (1.00 ఎకరం), 55/2 (1.76 ఎకరాలు), 55/1 (0.62 సెంట్లు) లలో గల మొత్తం 3.42 ఎకరాల భూమిని 2005 సంవత్సరం నుండి తానే స్వయంగా ఎంతో కష్టపడి సాగు చేసుకుంటూ, ఆ పంట ఆధారంగానే తన కుటుంబం జీవిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక వైసీపీ పార్టీ నాయకులు రాజకీయ కక్షలను మనసులో పెట్టుకుని, అధికారులపై ఒత్తిడి తెచ్చారు. జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కనీసం తన వాదనను గానీ, వివరణను గానీ వినకుండా... కేవలం అప్పటి వైసీపీ వారు చెప్పిన తప్పుడు మాటలను నమ్మి, అధికారులు ఆ భూమిని అన్యాయంగా ఆన్‌లైన్ (వెబ్ ల్యాండ్) రికార్డుల నుండి రద్దు చేశారు. కావున వారిపై చర్యలు తీసుకోని ఈ భూమి వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అక్రమంగా తొలగించిన ఆన్‌లైన్ రికార్డులను పునరుద్ధరించి తన భూమి పత్రాలను తనకు దక్కేలా చూడాలని నేతలు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్దించాడు.

వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటకు చెందిన అనూరాధ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తాము కష్టపడి పని చేసుకునే వాళ్ళము. తమ అబ్బాయి విషయంలో జరిగిన ఒక చిన్న పొరపాటును ఆసరాగా చేసుకుని స్థానిక వైసీపీ నాయకులు, పోలీసులు కలిసి మమ్మల్ని వేధిస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఒక మహిళ, తన ఇష్టపూర్వకంగానే తమ అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ తర్వాత తమ అబ్బాయి బెంగళూరులో ఉన్నానని తమకు ఫోన్ చేసి చెప్పాడు. తెలిసో తెలియకో తప్పు చేశామని, ప్రస్తుతం తాను తిరుపతి వైపు వెళ్తున్నానని కూడా తెలిపాడు. అయితే విషయాన్ని రాజంపేట సీఐ నాగార్జున గారు తీవ్రంగా మార్చేస్తున్నారు. తమ అబ్బాయి పైన దాడి చేసిన రాజశేఖర్, శాంతి, విజయ్, వినోద్, వినయ్ రెడ్డిలను వదిలేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జాబీర్ అనే వ్యక్తిని ఛాంబర్‌లోకి పిలిపించుకుని, అతని ముందే మమ్మల్ని నీచంగా తిట్టారు. సీఐ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ కక్షతో తమ అబ్బాయి పైన, తమ కుటుంబం పైన లేనిపోని కిడ్నాప్ కేసులు, మర్డర్ కేసులు పెట్టి అందరినీ జైలుకు పంపిస్తానని బెదిరిస్తున్నారు. తమ అబ్బాయిని అన్యాయంగా ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. తాము తెలుగుదేశం పార్టీ వాళ్లమనే ఒకే ఒక్క కారణంతో వైసీపీ నాయకులతో చేతులు కలిపి పోలీసులు మమ్మల్ని సాధిస్తున్నారు. కావున వారిపై  చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. 

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన రాజేశ్వరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన భర్త చనిపోవడంతో కుటుంబ ఖర్చుల నిమిత్తం పాయకాపురానికి చెందిన ఇ. రాధ గారి వద్ద విడతల వారీగా మొత్తం రూ. 3,00,000 అప్పుగా తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ అప్పు మొత్తాన్ని వడ్డీతో సహా పూర్తిగా తీర్చివేశాను. అయితే అప్పు మొత్తం తీరిపోయినప్పటికీ.. ఇ. రాధ, ఆమె మనుషులు తనపై, తన కుటుంబంపై కక్ష గట్టారు. అక్రమంగా ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. అర్ధరాత్రులు కూడా 30 నుండి 40 మంది రౌడీ మూకలను పోగు చేసుకుని తమ ఇంటిపైకి వస్తున్నారు. తనను, తన కుమారులను అసభ్య పదజాలంతో తిడుతూ శారీరకంగా దాడులకు తెగబడుతున్నారు. రోడ్డుపై తన కుమారులు కనిపిస్తే కొట్టడానికి వెంటాడుతున్నారు. దీంతో తమ కుటుంబం తీవ్ర ప్రాణభయంతో బతుకుతోంది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన స్వర్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తన పెళ్లి సమయంలో తమ పుట్టింటి వారు తనకు 300 గ్రాముల బంగారాన్ని పెట్టారు. అయితే తమ అన్నయ్య అయిన బి. కుమార్ స్వామి రెడ్డి తన స్వగ్రామంలో ఒక పెళ్లి కార్యక్రామానికి నగలు కావాలని, పని పూర్తి కాగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తన దగ్గర నుండి 300 గ్రాముల బంగారాన్ని తీసుకువెళ్లాడు. ఆ తర్వాత బంగారం ఇవ్వకుండా దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి తిప్పుతున్నాడు. గత మార్చి నెలలో తమ అమ్మను చూడటానికి ఊరికి వెళ్లినప్పుడు.. 'మార్చి 30, 2026న వచ్చి నీ బంగారం తీసుకెళ్లు' అని తమ అన్నయ్య చెప్పాడు. ఆ నమ్మకంతో మార్చి 30న వారి ఇంటికి వెళ్లి తన బంగారం అడగగా.. తమ అన్న, అతని భార్య రేణుక ఇద్దరూ కలిసి 'నీ దిక్కు ఉన్న చోట చెప్పుకోపో' అంటూ నాపై దారుణంగా దాడి చేసి కొట్టారు. ఈ అన్యాయంపై నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. కానీ అక్కడి పోలీసులు మరుసటి రోజు రమ్మంటూ దాదాపు రెండు వారాల పాటు తనను స్టేషన్ చుట్టూ తిప్పించారు. చివరకు అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. 'మేము నీ బంగారం ఇప్పించలేము' అని పోలీసులు చేతులెత్తేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో తనకు ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

తూర్పు గోదావరి జిల్లా కాజులూరుకు చెందిన సత్యనారాయణమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన ఫోన్ హ్యాక్ చేశారు. తను ఉండే గదిలో, చుట్టుపక్కల నిఘా కెమెరాలు పెట్టి కొందరు వ్యక్తులు నిరంతరం గమనిస్తున్నారు. ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్లినా, లేదా మరే ఇతర పనులకు వెళ్లినా తన శత్రువులు తనపై నిఘా ఉంచి, ఆటంకాలు కలిగిస్తున్నారు. పని చేసే చోట కూడా కొందరు వ్యక్తుల ద్వారా నన్ను మానసికంగా హింసిస్తూ, అసభ్యకరమైన మాటలతో న్యూసెన్స్ కలిగిస్తున్నారు. ఈ నిరంతర వేధింపుల వల్ల తీవ్రమైన భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నాను. కావున దయచేసి తన ఫోన్, నివాస ప్రాంతాన్ని పరిశీలించి తనకు భద్రత కల్పించి ఈ వేధింపులకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామానికి చెందిన మరిడిరాజు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి దివంగత కాకరపల్లి అప్పలస్వామి గారు సంపాదించిన స్థిరాస్తి  సర్వే నంబర్ 503 లో గల 3 ఎకరాల 50 సెంట్ల భూమి (మెరక, పల్లం) ఏలేరు ప్రాజెక్ట్ భూసేకరణ కిందకు వెళ్ళింది. ఈ సర్వే నంబరులో ఉన్న మొత్తం 7 ఎకరాల 11 సెంట్ల భూమిని ఏలేరు ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం సేకరించి, దానికి సంబంధించిన అవార్డును కూడా అధికారులు గతంలోనే పాస్ చేశారు. భూసేకరణ పరిధిలోకి వెళ్లడం వల్ల ఈ భూమికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి వీలుపడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఒకపక్క భూమికి పాస్ పుస్తకాలు రాక, మరోపక్క రావలసిన నష్టపరిహారం డబ్బులు అందక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కావున తమయందు దయవుంచి సర్వే నంబర్ 503 లోని తమ 3.50 ఎకరాల భూమికి రావలసిన పరిహారం సొమ్మును త్వరితగతిన విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.

పల్నాడు జిల్లా దుర్గికి చెందిన రామావత్ శ్రీను నాయక్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మడిగుంట గ్రామంలోని సర్వే నంబర్ 45/2 లో గల 1.95 ఎకరాల భూమిని ఉల్లి బంగారమ్మ అనే ఆమె వద్ద  విక్రయ అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశాను. అయితే, రిజిస్ట్రేషన్ జరిగే సమయానికి బంగారమ్మ అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆమె వారసులపై  పాడేరు ఆర్డీఓ కోర్టులో దావా (MC 1/2020) వేశాను. 23-01-2021న ఉభయుల అంగీకారంతో కోర్టులో రాజీ కుదిరింది. షరతుల ప్రకారం వారసులు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ దాఖలు చేశాను. దీనిపై స్పందించిన కలెక్టర్ గారు విచారణకు ఆదేశించగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, చింతపల్లి మండల రెవెన్యూ అధికారిలు విచారణ జరిపి భూమికి సంబంధించిన అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయని ధృవీకరించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతి ఇవ్వాల్సిందిగా చింతపల్లి తహశీల్దార్ గారు పాడేరు ఆర్డీఓ గారికి లేఖ రాశారు. గత పది నెలలుగా అన్ని పత్రాలు, నివేదికలు సిద్ధంగా ఉన్నప్పటికీ... పాడేరు ఆర్డీఓ కార్యాలయంలో ఈ ఫైల్ ముందుకు కదలడం లేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన సుబ్బరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ కుమారుడు ప్రదీప్, కోడలు శిరీషల పేర్ల మీద జంగారెడ్డిగూడెం మండలం, నిమ్మలగూడెం గ్రామంలోని రిజిస్టర్డ్ సర్వే నెంబర్ 73లో విడివిడిగా (కుమారునికి 4 ఎకరాలు, కోడలికి 3 ఎకరాలు) మొత్తం 7-00 ఎకరాల భూమిని గత 05-07-2014న ఆళ్ళ వెంకట శ్రీదేవి వగైరాల వద్ద క్రయదస్తావేజుల (రిజిస్ట్రేషన్) ద్వారా కొనుగోలు చేశాము. నాటి నుండి ఆ భూమి తమ ఆధీనంలోనే ఉంది. అయితే ఇటీవల గ్రామ రెవెన్యూ సర్వేయర్ గారు తమ భూమిని రీసర్వే చేయగా.. రికార్డుల్లో తమకున్న 7 ఎకరాల భూమికి గాను కేవలం 6.20 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపించారు. దీనిపై అభ్యంతరం ఉంటే చెప్పమన్నందున.. తమకు అభ్యంతరం ఉందని సర్వేయర్ గారికి లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇచ్చాము. కానీ ఆ సర్వేయర్ గారు తమ దరఖాస్తుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రీసర్వే పూర్తయిపోయిందంటూ ఫైలును పై అధికారులకు పంపించేశారు. స్థానిక జంగారెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో ఈ విషయంపై అర్జీ ఇవ్వగా మళ్లీ రీసర్వే కోసం దరఖాస్తు చేసుకోమన్నారు. దీంతో నేను 17-10-2022న ప్రభుత్వం నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత 19-10-2022న అధికారులు వచ్చి సర్వే చేశారు. సమస్య ఇంకా పరిష్కారం కాకుండానే.. తమ వద్ద 'పరిష్కారం అయినట్లు' ఎండార్స్‌మెంట్ (సంతకం) తీసుకుని, మోసపూరితంగా స్పందన ఫిర్యాదును ముగించి వేశారు. ఇలా రెండు పర్యాయాలు స్పందన ద్వారా అర్జీలు పెట్టినా అధికారుల చుట్టూ తిరగడమే సరిపోయింది కానీ, ఈ రోజు వరకు తమకు ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.

వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.

Spotlight

Read More →