Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Tollplaza: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత... రంగంలోకి దిగిన పోలీసులు! Chandrababu: అధికారులకు డెడ్‌లైన్ విధించిన సీఎం.. అమరావతిని కాంట్రాక్ట్ వర్క్‌లా చూడొద్దు! Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు! Raghuramakrishna Case: ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రఘురామ కేసు విచారణ! Vijay - Rashmika: విజయ్-రష్మికల 'ముగ్గురి' ముచ్చట: వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్! AP government: మాట తప్పని కూటమి సర్కార్.. అక్కడ హైకోర్టు బెంచ్ స్థల సేకరణ ప్రారంభం! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. Chandrababu: ఏపీ జలాల్లో హైస్పీడ్ గస్తీ.. మత్స్యకారుల రక్షణకు 4 పెట్రోలింగ్ బోట్లు మంజూరు చేసిన సీఎం.. Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా! Karnataka Nara Lokesh: సింధనూరులో సెల్ఫీల సందడి: అభిమానులు, యువతతో కలిసి ముచ్చటించిన నారా లోకేష్.!

Ranabali Movie Update: సీమ గడ్డపై ‘రణబాలి’ గర్జన.. భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ పీరియడ్ డ్రామా!

Ranabali Movie Update: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్ డ్రామా ‘రణబాలి’. తాజాగా అనంతపురం షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 11న విడుదల కానుంది

Published : 2026-04-04 12:34:00

Ranabali Movie Update: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ టీమ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాదాపు రెండు వారాల పాటు జరిగిన ఈ షూటింగ్‌లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.

 అనంతపురం షెడ్యూల్ ముగిసిన సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా రాయలసీమ ప్రజలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు అనంతపురం వాసులు చూపించిన ఆదరణ మర్చిపోలేనని, ముఖ్యంగా 'రౌడీ' ఫ్యాన్స్ చేసిన హడావిడి తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. షూటింగ్ స్పాట్‌కు భారీగా తరలివచ్చిన అభిమానుల కోసం విజయ్ ప్రత్యేకంగా సమయం కేటాయించి వారితో ముచ్చటించడం విశేషం.

నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌కు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా, వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు చాలా కాలం విరామం తర్వాత మళ్ళీ వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటుండడంతో ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ‘ఏందయ్యా సామీ’ అనే పాట ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని ఒక పీరియడ్ డ్రామాగా మలుస్తున్నారు. 19వ శతాబ్దపు నేపథ్యంలో, అంటే 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఒక పవర్‌ఫుల్ యోధుడి పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక 'జయమ్మ' అనే వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్ కావడంతో గ్రాఫిక్స్‌కు కూడా ఈ సినిమాలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ సీక్వెన్సులు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో రణబాలి టీమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Spotlight

Read More →