Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Bhogapuram Airport: ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... Chandrababu: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర వెలకట్టలేనిది.. 47 ఏళ్ల ప్రస్థానంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు.! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది! Trump Comments: ట్రంప్ వ్యాఖ్యలతో పెరగనున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! ఇరాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! pawan kalyan: "తమిళనాడులో జనసేనాని గర్జన": నేడు నాగర్‌కోయిల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్. Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Sharwanand: రాజశేఖర్ గారిపై నాకు జెలసీ.. జీవిత గారు ఆయన్ని చూసుకునే విధానంపై శర్వానంద్ కామెంట్స్! Iran War: "ప్రపంచ రికార్డు సృష్టించిన డిజిటల్ చీకటి": ఇరాన్‌లో 37 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్! Chicken Liver: మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. చాలా మందికి తెలియని నిజం! Bhogapuram Airport: ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... Chandrababu: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర వెలకట్టలేనిది.. 47 ఏళ్ల ప్రస్థానంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు.! Indo Pak Border: పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.... అసలేం జరుగుతోంది! Trump Comments: ట్రంప్ వ్యాఖ్యలతో పెరగనున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! ఇరాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! pawan kalyan: "తమిళనాడులో జనసేనాని గర్జన": నేడు నాగర్‌కోయిల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్. Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Sharwanand: రాజశేఖర్ గారిపై నాకు జెలసీ.. జీవిత గారు ఆయన్ని చూసుకునే విధానంపై శర్వానంద్ కామెంట్స్! Iran War: "ప్రపంచ రికార్డు సృష్టించిన డిజిటల్ చీకటి": ఇరాన్‌లో 37 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్!

Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Bhanu Prakash Reddy: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 2026-04-04 15:05:00
  • "రాక్షసానందం పొందిన వ్యక్తి జగన్": అమరావతి రైతుల ఇబ్బందులపై భానుప్రకాష్ ఆగ్రహం..
     
  • Politics: అమరావతి బిల్లు ఆమోదాన్ని జగన్ ఓర్వలేకపోతున్నారు: పార్లమెంట్ నిర్ణయంపై వ్యాఖ్యలు..

Tirupati Bhanu Prakash Reddy: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్‌కు, వైసీపీకి ఎప్పుడో విడాకులిచ్చేశారని, ఆ పార్టీ పతనం ఇప్పటికే ఖాయమైందని ఆయన వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి, వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్య కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతులు మరియు మహిళల శాపమే జగన్‌కు తగిలిందని, రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వైసీపీ ఫ్యాన్ రెక్కలను విరిచేశారని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ మోహన్ రెడ్డి నైజాన్ని విమర్శిస్తూ, గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా వ్యవహరించే ద్వంద్వ వైఖరి ఆయనదని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో తమను ఓడించినందుకు ఏపీ ప్రజలపై జగన్ కక్ష పెంచుకున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఒక 'భస్మాసుర హస్తం'లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అమరావతి రైతులను, మహిళలను ఐదేళ్ల పాటు నానా ఇబ్బందులకు గురిచేసి జగన్ రాక్షసానందం పొందారని, ఇప్పుడు పార్లమెంటులో అమరావతి బిల్లుకు లభించిన ఆమోదాన్ని ఆయన ఏమాత్రం ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి రావడం అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మతపరమైన అంశాలపై స్పందిస్తూ, తిరుమల పవిత్రతను దెబ్బతీసిన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను అనుసరించిన వ్యక్తులు ఇప్పుడు దేవస్థానంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమల ప్రతిష్టను కాపాడటంతో పాటు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. జగన్ మరియు వైసీపీ నేతల వైఖరి మారకపోతే భవిష్యత్తులో వారికి రాజకీయంగా సమాధి తప్పదని ఆయన హెచ్చరించారు.

Spotlight

Read More →