Smartphone: భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు... ఆరు నెలల్లోనే 30 శాతం వరకు... ఇకపై మరింతగా..!! Visakhapatnam: పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధికి జాతీయ నమూనాగా విశాఖ! Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి స్కీమ్... చిన్న పొదుపుతోనే కుమార్తె చదువు, పెళ్లికి రూ.70 లక్షలు పొందండి! Fuel Export Duty: పెట్రోల్, డీజిల్ డ్యూటీపై కేంద్రం తాజా ఉత్తర్వులు! జూన్ 1 నుంచి అమలు... PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్... ఒకేరోజు రూ. 1,500 పైగా పెరిగిన బంగారం ధర! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు! Smartphone: భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు... ఆరు నెలల్లోనే 30 శాతం వరకు... ఇకపై మరింతగా..!! Visakhapatnam: పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధికి జాతీయ నమూనాగా విశాఖ! Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి స్కీమ్... చిన్న పొదుపుతోనే కుమార్తె చదువు, పెళ్లికి రూ.70 లక్షలు పొందండి! Fuel Export Duty: పెట్రోల్, డీజిల్ డ్యూటీపై కేంద్రం తాజా ఉత్తర్వులు! జూన్ 1 నుంచి అమలు... PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్... ఒకేరోజు రూ. 1,500 పైగా పెరిగిన బంగారం ధర! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు!

Visakhapatnam: పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధికి జాతీయ నమూనాగా విశాఖ!

Visakhapatnam: విశాఖపట్నం పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో మరో కీలక ముందడుగు వేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Published : 2026-06-01 11:43:05

పీఎం-సేటూ ప్రణాళిక ఆమోదం పొందిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్..

చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ నాయకత్వంతో విశాఖకు కొత్త గుర్తింపు..

విశాఖపట్నం పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో మరో కీలక ముందడుగు వేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానమంత్రి పారిశ్రామిక శిక్షణా సంస్థల ఆధునికీకరణ పథకం ‘పీఎం-సేటూ’ కింద వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు ఆమోదం పొందిన దేశంలోని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గర్వకారణమన్నారు.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్టీరింగ్ కమిటీ, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ భాగస్వామ్యంతో విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్‌కు ఈ ప్రణాళిక ఆమోదం లభించింది. పరిశ్రమలను ప్రత్యక్ష భాగస్వాములుగా చేసుకుని అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని పల్లా పేర్కొన్నారు.

విశాఖ జిల్లాలోని నాలుగు ప్రభుత్వ ఐటీఐల ద్వారా రానున్న ఐదేళ్లలో 25 వేల మందికి పైగా యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రూ.200.21 కోట్ల వ్యయంతో అమలయ్యే ఈ ప్రాజెక్టు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించనుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టిని పల్లా ప్రశంసించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలను ఒకే అభివృద్ధి సూత్రంగా మలిచిన నాయకత్వం వల్లే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తోందన్నారు.

పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, వాటి ద్వారా సృష్టించే ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర యువత అందిపుచ్చుకునేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. స్థిరమైన ఆర్థికాభివృద్ధికి నైపుణ్యం కలిగిన యువశక్తి ఎంతో అవసరమని సీఎం ఎప్పటి నుంచో విశ్వసిస్తున్నారని తెలిపారు.

అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కృషిని కూడా పల్లా ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాల మధ్య సమన్వయం కల్పిస్తూ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి వాతావరణాన్ని ఆయన నిర్మిస్తున్నారని అన్నారు.

విశాఖపట్నాన్ని పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగం, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. విద్యాసంస్థల బలోపేతం, నైపుణ్య శిక్షణ విస్తరణ, పరిశ్రమలతో అనుసంధానం వంటి చర్యలు ఉత్తరాంధ్ర ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని వివరించారు.

ఉక్కు, తయారీ, లాజిస్టిక్స్, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక రంగాల్లో విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం మరింత పెరుగుతోందన్నారు. ఆ అవసరాన్ని తీర్చడంలో విశాఖ ఐటీఐ క్లస్టర్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 20 లక్షల ఉద్యోగాల సాధనలో ఈ కార్యక్రమం ముఖ్య మైలురాయిగా నిలుస్తుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలను యువతకు అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా రాష్ట్ర పారిశ్రామిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

ఈ ప్రాజెక్టు విజయానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థతో పాటు అన్ని భాగస్వామ్య సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దూరదృష్టి గల నాయకత్వం, ప్రగతిశీల విధానాలు, పరిశ్రమల భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధిని పెట్టుబడులు, ఉపాధి, సమగ్ర ఆర్థికాభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవచ్చో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Spotlight

Read More →