ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్, ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్‌కు ఇప్పుడు పెద్ద అవకాశం వచ్చింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్తగా భారీ స్థాయిలో నియామక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఏ విభాగాల్లో ఖాళీలు?
ఈ నియామకాల్లో రెండు విభాగాలు ఉన్నాయి –
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం)– 95 పోస్టులు
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్)– 25 పోస్టులు
టెలికాం రంగంలో కెరీర్ మొదలుపెట్టాలనుకునేవారికి ఇది సరైన సమయం అంటున్నారు నిపుణులు.
అర్హత వివరాలు
టెలికాం విభాగం కోసం దరఖాస్తు చేయాలంటే, అభ్యర్థులు టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఐటీ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 60% మార్కులు అవసరం.
ఫైనాన్స్ విభాగం కి దరఖాస్తు చేయాలంటే CA, CMA లేదా ICWA అర్హత తప్పనిసరి.
కొన్ని విభాగాల్లో ఇంటర్ అర్హత ఉన్న అభ్యర్థులు కూడా ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లకు ఎంపికయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
వయస్సు పరిమితి
దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు
SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు
దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం
ఎంపిక రెండు దశల్లో ఉంటుంది
1. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT)– 200 మార్కులు, 3 గంటల వ్యవధి. ప్రశ్నలు జనరల్ అప్టిట్యూడ్, రీజనింగ్, మరియు సంబంధిత సబ్జెక్టుపై ఉంటాయి.
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్– పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలిస్తారు.
తుది ఎంపిక మెరిట్ లిస్టు ఆధారంగా జరుగుతుంది.
జీతం & సదుపాయాలు
ట్రైనింగ్ సమయంలోనే BSNL ఆకర్షణీయమైన వేతనం అందిస్తుంది. ప్రారంభ జీతం ₹24,900 – ₹50,500మధ్య ఉంటుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ సదుపాయాలు గ్రాచ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ట్రైనింగ్ పూర్తయ్యాక శాశ్వత నియామకం ఇవ్వబడుతుంది.
దరఖాస్తు ఎలా చేయాలి?
దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
Oc/ Bc వర్గానికి రూ.1000
SC/ST/PWD అభ్యర్థులకు ₹500
దరఖాస్తు తేదీలు త్వరలో ప్రకటించబడతాయి. తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://bsnl.co.in
https://bsnl.co.in ను తరచుగా పరిశీలించాలి.
టెలికాం రంగం డిజిటల్ ఇండియా భవిష్యత్తుకి బలమైన స్థంభం. BSNL వంటి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మళ్లీ రిక్రూట్‌మెంట్స్ ప్రారంభించడం అంటే ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్మకం పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.