Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! USA: గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అమెరికా ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు! Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం? USA: శాంతి చర్చల మధ్య మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు! America crime: అమెరికాలో ఘోరం: వర్జీనియా సూపర్‌మార్కెట్‌లో భారతీయ మహిళ దారుణ హత్య! షాకింగ్ సీసీటీవీ విజువల్స్! Hormuz: హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు! Dr Praveen Koya: నార్త్ కరోలినాలో డాక్టర్ ప్రవీణ్ కోయకు ఘన సన్మానం! Mahanadu: వర్జినియాలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు.. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ కొత్త నాయకత్వంపై ప్రశంసలు! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! USA-Iran: అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన.. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! USA: గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు అమెరికా ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు! Trump: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక సమావేశం.. తుది నిర్ణయం? USA: శాంతి చర్చల మధ్య మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు! America crime: అమెరికాలో ఘోరం: వర్జీనియా సూపర్‌మార్కెట్‌లో భారతీయ మహిళ దారుణ హత్య! షాకింగ్ సీసీటీవీ విజువల్స్! Hormuz: హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు! Dr Praveen Koya: నార్త్ కరోలినాలో డాక్టర్ ప్రవీణ్ కోయకు ఘన సన్మానం! Mahanadu: వర్జినియాలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు.. చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ కొత్త నాయకత్వంపై ప్రశంసలు! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! USA-Iran: అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన.. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు!

TAJA: అమెరికాలో వెలుగొందిన తెలుగు సంస్కృతి! జాక్సన్‌విల్లేలో ఘనంగా ‘తాజా’ ఉగాది వేడుకలు!   

TAJA: అమెరికాలోని జాక్సన్‌విల్లే నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్‌విల్లే ఏరియా (TAJA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది 2026’ వేడుకలు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.

Published : 2026-05-23 14:09:00

సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన తాజా ఉగాది సంబరాలు..

అమెరికాలో తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టిన TAJA కార్యక్రమం..

అమెరికాలోని జాక్సన్‌విల్లే నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్‌విల్లే ఏరియా (TAJA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది 2026’ వేడుకలు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రవాసాంధ్రులు, తెలుగు కుటుంబాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఉగాది వేడుకల సందర్భంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ తెలుగుదనం ఉట్టిపడుతూ సభను సందడిగా మార్చింది.

ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విందు భోజనం. ‘మసాలా రెస్టారెంట్’ వారు అందించిన రుచికరమైన మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందరి ప్రశంసలు పొందాయి. అలాగే ‘దేశీ హ్యాంగౌట్’ ఏర్పాటు చేసిన లైవ్ స్నాక్స్ కౌంటర్ సందర్శకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వేడివేడిగా తయారు చేసిన కరకరలాడే జిలేబీలను ప్రత్యక్షంగా వడ్డించడం వేడుకకు వచ్చిన వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించింది.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్‌కమల్ ఫోటోగ్రఫీ మరియు మీడియా బృందం అందించిన సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయడంతో పాటు, సరికొత్త రియల్-టైమ్ ఫోటో వీక్షణ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తీసిన ఫోటోలను క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కల్పించడం అందరినీ ఆకట్టుకుంది.

అలాగే నిర్వహించిన ‘రాఫిల్ గివ్‌అవేస్’ (లక్కీ డ్రా) కార్యక్రమం వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. విజేతలకు బహుమతులు అందజేయడంతో సభలో ఆనందం వెల్లివిరిసింది.

ఈ వేడుకను విజయవంతం చేసిన కమిటీ సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, కళాకారులు, పాల్గొన్న ప్రతి తెలుగు కుటుంబానికి TAJA బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను రాజ్‌కమల్ ఫోటోగ్రఫీ అధికారిక లింక్ ద్వారా వీక్షించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

Spotlight

Read More →