US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం! భారత విద్యార్థులకు భారీ షాక్! కెనడా కఠిన నిర్ణయం.. వీసా పొందాలంటే ఇక నుండి అవి తప్పనిసరి! గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు! MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం! ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు! ఘోర రోడ్డు ప్రమాదం .. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్! 17 మంది మృతి IRCTC Updates: నవంబర్ 1 నుంచి IRCTC కొత్త రూల్స్.. వారికి లోయర్ బెర్త్ బుకింగ్‌లో ఇకపై ప్రాధాన్యత! Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టైమింగ్స్.. ఇకపై ప్రతిరోజూ..! త్వరపడండి.. అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్.. ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! ప్రయాణికులకు శుభవార్త! ఇక ప్రయాణం మరింత సురక్షితంగా.. ఇ-పాస్‌పోర్ట్‌ విధానం! భారత విద్యార్థులకు భారీ షాక్! కెనడా కఠిన నిర్ణయం.. వీసా పొందాలంటే ఇక నుండి అవి తప్పనిసరి! గుడ్ న్యూస్.. మరో నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు! దేశవ్యాప్తంగా 164కి చేరిన సర్వీసులు! MoRTH: రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు మరో కీలక అడుగు.. MoRTH చర్యలు వేగం! ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు! ఘోర రోడ్డు ప్రమాదం .. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్! 17 మంది మృతి IRCTC Updates: నవంబర్ 1 నుంచి IRCTC కొత్త రూల్స్.. వారికి లోయర్ బెర్త్ బుకింగ్‌లో ఇకపై ప్రాధాన్యత! Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టైమింగ్స్.. ఇకపై ప్రతిరోజూ..! త్వరపడండి.. అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్.. ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి!

Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం!

2025-11-03 16:51:00
ప్రపంచానికి అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తున్న దేశాలు! అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాలు ఇవే!


శీతాకాలం తాకిడి మొదలైన వెంటనే పులికాట్ సరస్సు మరోసారి పక్షుల గానాలతో నీటి తళుకులతో సజీవంగా మారింది. ఆకాశాన్నంటిన దూరాలనుంచి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి చేరిన ఫ్లెమింగోలు, సైబీరియన్ పక్షులు ఇప్పుడు పులికాట్ తీరంలో తమ ఆహ్లాదభరిత నృత్యం మొదలుపెట్టాయి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పక్షి ప్రేమికులకు ఇది కన్నుల విందుగా మారుతోంది.

అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ విదేశీ అతిథుల రాక ప్రారంభమైంది. చల్లని గాలులు వీచే ఈ కాలంలో పులికాట్ సరస్సు వీటికి ఆహారానికి, విశ్రాంతికి అనుకూలమైన ఆశ్రయం. వచ్చే ఆరు నెలలపాటు ఈ ప్రాంతం వాటి నివాసంగా మారుతుంది. ప్రతి ఏడాది ఫ్లెమింగోల రాకను పురస్కరించుకుని నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇప్పుడు పర్యాటక క్యాలెండర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది సందర్శకులు వస్తారు. రంగురంగుల ఫ్లెమింగోలతో సరస్సు నిండిపోవడం, ఆ దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు తరలి రావడం ఇవన్నీ పులికాట్‌కి వాతావరణ ఉత్సాహం నింపుతున్నాయి.

మనమందరం రాజహంసలుగా పిలుచుకునే ఈ ఫ్లెమింగోలు నిజానికి జీవ వైవిధ్యానికి ప్రతీకలు. అవి పర్యావరణ సమతుల్యానికి కీలకం. నదీ తీరాలు, సరస్సులు, మడుగులలో పెరుగుతున్న చిన్న జంతువులు, శైవలాలను తింటూ ప్రకృతిలో సమతుల్యతను కాపాడుతాయి. గత కొన్నేళ్లుగా పులికాట్‌లో వాతావరణం, ఆహార పరిస్థితులు మెరుగుపడటంతో ఫ్లెమింగోలు సంవత్సరం పొడవునా కనిపించడం మొదలైంది.

అటవీ శాఖ అధికారుల ప్రకారం, పక్షులకు భద్రత కల్పించేందుకు గత కొన్ని నెలలుగా పలు చర్యలు చేపట్టారు. సరస్సు పరిసరాల్లో అనధికార మత్స్యకారాన్ని నియంత్రించడం చెరువుల నీటి మట్టం నిల్వ చేయడం, ఆహార శ్రేణి కాపాడే ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. తుపానులు, వర్షాలు వచ్చినా పక్షుల స్థావరాలకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేసే ప్రణాళికను అమలు చేస్తోంది. బర్డ్ వాచ్ టవర్లు, వీక్షణా కేంద్రాలు, ఫోటోగ్రఫీ పాయింట్లు, పర్యావరణ క్లబ్‌లు వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నాలు పర్యాటకులను ఆకర్షించడమే కాదు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి.

పులికాట్‌ సరస్సు పర్యావరణపరంగా అపారమైన విలువ కలిగిన ప్రదేశం. ఇక్కడ పక్షుల రక్షణతో పాటు, ఎకో టూరిజం ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించడం మా లక్ష్యం అని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు స్థానిక ప్రజల సహకారం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పక్షుల స్థావరాల వద్ద చెత్త వేయకూడదని, పెద్ద శబ్దాలు చేయకూడదని, వాహనాల రాకపోకలను నియంత్రించాలని అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పులికాట్ సరస్సును దేశంలోనే ప్రధాన ఎకో టూరిజం సర్క్యూట్‌లో చేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. 

పులికాట్ సరస్సు ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులకూ పర్యాటకులకూ ఒక కొత్త గమ్యస్థానంగా మారుతోంది. ఫ్లెమింగోల రాకతో పులికాట్ అందం మరింత పెరిగింది. ప్రభుత్వ చర్యలతో త్వరలోనే ఇది భారతదేశపు అగ్ర ఎకో టూరిజం కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది

Jobs Alert: ఏపీలో ఆయూష్‌ శాఖలో భారీ నియామకాలు..! వెంటనే దరఖాస్తు చేయండి..!
Netflixs new series: కర్గిల్ యుద్ధం నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కొత్త సిరీస్.. ఆపరేషన్ సఫేద్ సాగర్!
Maruti Suzuki: మారుతి సుజుకి కొత్త మోడల్స్ హైలైట్..! తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాహనాలు..!
PR Department: పంచాయతీరాజ్ ఉద్యోగులకు శుభవార్త..! ప్రమోషన్ నిబంధనల్లో కీలక మార్పు..!
Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్!
Farmers: రబీ సీజన్‌కు ఏపీ సిద్ధం..! రైతుసేవా కేంద్రాల్లో రాయితీ విత్తనాలతో...!
Anil Ambanis: ఈడీ పెద్ద షాక్.. అనిల్ అంబానీ రూ.3,084 కోట్ల ఆస్తులు అటాచ్!
Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే!
Railway Projects: ఏపీలో రైల్వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! 26 కొత్త ప్రాజెక్టులు.. ఆ ప్రాంతంలో మూడు రైల్వే లైన్లు..!
Kuwait Updates: టూరిస్ట్, ఫ్యామిలీ వీసాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే! కువైట్ కొత్త సదుపాయం! ఒకే చోట అన్ని సేవలు...
Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!
Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!
RDI Fund: ప్రైవేట్ పెట్టుబడులకి కొత్త అవకాశం… మోడీ ప్రారంభించిన RDI ఫండ్ !!
₹2000 నోటు చెల్లుబాటు అవుతుందా? RBI క్లారిటీ.. ఇకపై ఎక్కడ మార్చుకోవాలంటే?
CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..!

Spotlight

Read More →