Instagram Instants: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో అద్భుతం! స్నాప్‌చాట్‌కు పోటీగా 'ఇన్‌స్టంట్స్' యాప్ లాంచ్! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే! Instagram Instants: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో అద్భుతం! స్నాప్‌చాట్‌కు పోటీగా 'ఇన్‌స్టంట్స్' యాప్ లాంచ్! BluJ Aero: విమానయానంలో కొత్త చరిత్ర! ఎయిర్‌పోర్టు అక్కర్లేదు.. రన్‌వే అవసరం లేదు... ఇంజనీర్ల అద్భుత విమానం! Oil Free Cooking: హెల్తీ లైఫ్ స్టైల్ కోసం బెస్ట్ ఎయిర్ ఫ్రైర్స్... టాప్ బ్రాండ్ల పూర్తి వివరాలు! Infinix India: ఇన్ఫినిక్స్ తొలి మెటల్ బాడీ ఫోన్... ఐఫోన్ కి గట్టి పోటీ! బ్యాక్ సైడ్ డిస్ప్లేతో క్రేజీ ఫీచర్లు! whatsapp Services: ఇకపై వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు! మీ ఫోన్‌లో ఈ నంబర్ ఉంటే చాలు.. India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..! Change Email ID: పాత ఐడిని వదలలేక.. కొత్తది వాడలేక సతమతమవుతున్నారా? గూగుల్ తెచ్చిన సూపర్ ఫీచర్ మీకోసమే! Google AI Overviews: గూగుల్ AI సెర్చ్‌లో భారీ తప్పులు.. గంటకు లక్షల సంఖ్యలో తప్పుడు సమాధానాలు! highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. AC India 2026: ఏసీ కొంటున్నారా? కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు ఇవే!

Windows 10 Support End: విండోస్ 10 యూజర్లకు భారీ అలర్ట్.. మీ భద్రతకు ముప్పు! విండోస్ 11 వైపు మళ్లండి - చివరి తేదీ ఎప్పుడంటే:

మీరు ఇంకా విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్‌తో (OS) పనిచేసే కంప్యూటర్‌ను వాడుతున్నారా? అయితే ఇది మీకోసం ఒక అత్యంత ముఖ్యమైన వార్త! సాఫ్ట్‌వేర్ దిగ్గజం మై

Published : 2025-10-02 21:28:00
చరిత్ర సృష్టించిన ఒప్పందం.. 5 ఏళ్ల తర్వాత భారత్, చైనా మధ్య మళ్లీ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు షురూ!

మీరు ఇంకా విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్‌తో (OS) పనిచేసే కంప్యూటర్‌ను వాడుతున్నారా? అయితే ఇది మీకోసం ఒక అత్యంత ముఖ్యమైన వార్త! సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఒక కీలక ప్రకటన చేసింది: రాబోయే అక్టోబర్ 14 నుంచి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు తమ సపోర్ట్‌ను పూర్తిగా నిలిపివేస్తోంది.

Maoist: బీజాపూర్‌లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు..!ఆయుధాలు వదిలి శాంతి మార్గం వైపు..!

దీని అర్థం ఏమిటంటే.. అక్టోబర్ 14 తర్వాత మీకు ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్, కొత్త ఫీచర్లను మెరుగుపరిచే అప్‌డేట్స్ గానీ, లేదా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు టెక్నికల్ సపోర్ట్ గానీ అందుబాటులో ఉండవు. ఈ వార్త విండోస్ 10 వాడుతున్న కోట్ల మంది సాధారణ యూజర్లతో పాటు, చిన్న, పెద్ద వ్యాపార సంస్థలను కూడా ప్రభావితం చేయనుంది.

ఉత్తరాంధ్రకు వాయు'గండం': సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష.. 3 జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు!

విండోస్ 10 సపోర్ట్ నిలిచిపోవడం అంటే, మీ కంప్యూటర్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కాదు. మైక్రోసాఫ్ట్ ప్రకటన ప్రకారం, అక్టోబర్ 14 తరువాత కూడా మీరు మీ పీసీలను యథాతథంగా వినియోగించుకోవచ్చు. కానీ, ఇక్కడే పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

BSNL Services: బీఎస్‌ఎన్‌ఎల్ దూకుడు.. విప్లవాత్మక మార్పు! ఇకపై ఫిజికల్ సిమ్ కార్డులు ఉండవు..

సైబర్ ముప్పు: అప్‌డేట్స్ లేకపోవడం వలన మీ కంప్యూటర్‌కు సైబర్ దాడుల ముప్పు విపరీతంగా పెరుగుతుంది. మాల్‌వేర్‌లు (Malware), వైరస్‌లు మరియు ఇతర సైబర్ దాడులు మీ డేటాను సులువుగా దొంగిలించే అవకాశం ఉంది. మీ కంప్యూటర్ ఒక సురక్షిత రక్షణ కవచం లేకుండా సైబర్ ప్రపంచంలోకి వెళ్లినట్టే!

Cold drink pregnancy: ప్రెగ్నెన్సీలో కూల్డ్రింక్ తాగితే.. ఏమవుతుంది.. నిపుణుల సలహాలు!

వ్యాపారాలపై ప్రభావం: వ్యాపారాలు రెగ్యులేటరీ కంప్లయెన్స్‌‌ (Regulatory Compliance) నిబంధనల్లో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కొన్ని రకాల సాఫ్ట్‌వేర్ పనితీరు తగ్గిపోవడం లేదా పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం కూడా ఉంది.

New conditions: ప్రభుత్వ నిధులు పొందాలంటే కొత్త కండీషన్లు తప్పనిసరి.. ట్రంప్!

మీ పీసీని వెంటనే విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేయడం సాధ్యం కాకపోయినా, లేదంటే మీరు ఇంకా విండోస్ 10నే వాడుకోవాలని అనుకుంటే, మైక్రోసాఫ్ట్ ఒక తాత్కాలిక పరిష్కారాన్ని చూపించింది.

RSS: క్రమశిక్షణ, సేవ, నేషన్ ఫస్ట్ నినాదంతో శతాబ్దం పూర్తి చేసిన RSS.. పవన్!

ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ కవరేజీ (ESU): మైక్రోసాఫ్ట్ ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ కవరేజీ (ESU - Extended Security Coverage) అనే అవకాశాన్ని కల్పిస్తోంది. దీన్ని ఎంపిక చేసుకుంటే, 2026 అక్టోబర్ 13 వరకూ అంటే మరో ఏడాది పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందొచ్చు.

Fishing Harbor: ఏపీలో దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్..! ఆ జిల్లాలో ఆధునికమైన సదుపాయాలుతో..!

ధరలు: వ్యాపార సంస్థలు ఒక్కో పీసీకి 61 డాలర్ల చొప్పున చెల్లించి ESUను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ మేరకు ధరలు కూడా పెరుగుతాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Google: గూగుల్‌లో భారీ ఉద్యోగ కోతలు..! 100+ ఆ ఉద్యోగులు అందరూ ఇంటికి..!

ఉచిత ESU: విండోస్ 365 క్లౌడ్ పీసీల ద్వారా విండోస్ 10 వాడుతున్న వారికి మాత్రం ఉచితంగా ESU అందుబాటులో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11కు మారాలని బలంగా కోరుతోంది. దానికి కారణాలు కూడా చెబుతోంది.

Gaza war : కడుపు నింపుకోవడానికి గౌరవం త్యాగం.. గాజాలో మహిళల దుస్థితి!

భద్రత: విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11లో సైబర్ దాడుల ముప్పు ఏకంగా 62 శాతం తక్కువ అని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
వేగం: విండోస్ 11 2.3 రెట్లు వేగంతో పనిచేస్తుందని, పనితీరు మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Mutual Funds: పెట్టుబడిదారుల కోసం టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్! 5 ఏళ్లలో అద్భుత రాబడులు!

మీ పీసీ అనుకూలత చెక్ చేసుకోండి: మీ పీసీ విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావడానికి అనుకూలమో కాదో తెలుసుకోవడానికి, సెట్టింట్స్‌లోని విండోస్ అప్‌డేట్‌ను ఎంచుకుని పీసీ హెల్త్ చెకప్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్నింటికి ఒకేసారి సపోర్ట్ నిలిచిపోవడం లేదు. కొన్ని కీలకమైన యాప్‌లకు మాత్రం మైక్రోసాఫ్ట్ మరింత సమయం ఇచ్చింది.

నిప్పులు చెరిగిన సిరాజ్: అహ్మదాబాద్ టెస్టులో విండీస్‌కు కోలుకోలేని దెబ్బ.. లంచ్ లోపే 5 వికెట్లు డౌన్!

మైక్రోసాఫ్ట్ 365 యాప్స్: విండోస్ 10 పీసీలలోని మైక్రోసాఫ్ట్ 365 (MS 365) యాప్స్‌కు మాత్రం అక్టోబర్ 2028 వరకూ సెక్యూరిటీ అప్‌డేట్స్ కొనసాగుతాయి. అయితే, ఫీచర్ అప్‌డేట్స్ మాత్రం 2026 ఆగస్టు వరకే అందుబాటులో ఉంటాయి.

TTD: ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..! హుండీ ఆదాయం రికార్డ్ బ్రేక్..!

డిఫెండర్ యాంటీవైరస్: విండోస్ 10 పీసీల భద్రతకు కీలకమైన మైక్రోసాఫ్ట్ డిఫెండర్ యాంటీవైరస్‌కు కూడా ఇంటెలిజెన్స్ అప్‌డేట్స్ అక్టోబర్ 2028 వరకూ అందుబాటులో ఉంటాయి.

GST 2.0: జీఎస్టీ రేట్లు తగ్గింపు.. పాత ధరలకే విక్రయాలు! ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు!

ఈ అప్‌డేట్స్ ఉండటం వలన మాల్‌వేర్ ప్రొటక్షన్ మరో రెండేళ్ల పాటు కొనసాగుతుంది. అయినప్పటికీ, విండోస్ 11 వైపు మళ్లడానికి యూజర్లు తగినంత సమయం దొరికిందని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. భద్రత, వేగం దృష్ట్యా వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవడం శ్రేయస్కరం.

Spotlight

Read More →