ఇంటర్నెట్‌లో మన ప్రైవసీ కాపాడుకోవడం చాలా కష్టం అయిపోయింది. పెద్ద టెక్ కంపెనీలు మన డేటాను సేకరించి దాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. గూగుల్, మెటా వంటి సంస్థలు మన బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, ఐపీ అడ్రస్ వంటి వివరాలను ట్రాక్ చేస్తుంటాయి. కానీ మన వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవాలంటే సులభమైన మార్గం ప్రైవసీ ఫ్రెండ్లీ బ్రౌజర్ వాడటం. క్రోమ్, ఎడ్జ్ లాంటివి కాకుండా, మీ డేటాను రక్షించే కొన్ని ఉత్తమ బ్రౌజర్లు ఇప్పుడు చూద్దాం.
టోర్
టోర్ బ్రౌజర్ పేరును వినగానే చాలామందికి డార్క్ వెబ్ గుర్తుకు వస్తుంది. కానీ వాస్తవానికి టోర్ ఉద్దేశ్యం యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచడం. ఇది ట్రాఫిక్‌ను పలు లేయర్ల ద్వారా పంపుతుందనే కారణంతో హ్యాకర్లకు లేదా సంస్థలకు మీ వివరాలు చేరవు. అయితే ఈ లేయర్లు కారణంగా వేగం కొంచెం తగ్గుతుంది.
బ్రేవ్
టోర్ స్థాయి భద్రతతోపాటు వేగం కూడా కావాలనుకునే వారికి బ్రేవ్ సరైన ఎంపిక. ఇందులో ప్రకటనలను ఆటోమేటిక్‌గా ఆపే యాడ్ బ్లాకర్, ట్రాకర్లను నిరోధించే ఫీచర్లు ఉంటాయి. క్రిప్టో టోకెన్ల ద్వారా యూజర్లకు రివార్డ్స్ ఇవ్వడం దీని ప్రత్యేకత.
డక్‌డక్‌గో
సెర్చ్ ఇంజిన్‌గా పేరొందిన డక్‌డక్‌గో ఇప్పుడు బ్రౌజర్‌గా కూడా అందుబాటులో ఉంది. యూజర్ డేటాను సేకరించదు, యాడ్స్ లేకుండా యూట్యూబ్ వీడియోలు ప్లే చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది. ఆటోమేటిక్ కుకీ కంట్రోల్, సురక్షితమైన HTTPS కనెక్షన్‌లు దీని ప్రధాన ఆకర్షణలు.
ఫైర‍్‌ఫాక్స్
మొజిల్లా సంస్థ decades నుంచీ ప్రైవసీకి మద్దతుగా ఉంది. ఫైర‍్‌ఫాక్స్ Do Not Track’లాంటి ఫీచర్లతో ఇతర బ్రౌజర్లకంటే ముందుంది. యూజర్ హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించే ప్రైవేట్ మోడ్ కూడా ఉంది.
లిబ్రెవుల్
లిబ్రెవుల్ బ్రౌజర్ చాలా మినిమల్‌గా ఉంటుంది. అనవసర ఫీచర్లు లేవు కానీ ట్రాకింగ్ నిరోధన బలంగా ఉంటుంది. ఇది డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్‌ను డిఫాల్ట్‌గా ఉపయోగిస్తుంది.
సౌకర్యం కోసం మాత్రమే కాకుండా ప్రైవసీ కూడా ఇప్పుడు అవసరం. ఆన్‌లైన్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి, మీకు సరిపడే ఈ బ్రౌజర్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోండి