Liquor: మద్యం లైసెన్స్‌ల గడువు వివాదం..! టెండర్‌ గడువు పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అంటే వయసుతో తగ్గుతుందనేది చాలా మందికి ఉన్న భావన. కానీ ‘హిట్‌మ్యాన్’ మాత్రం ఈ లెక్కని తలకిందులు చేస్తున్నారు. రోహిత్ 30 ఏళ్ల మైలురాయిని దాటిన తర్వాత ఆయన ప్రదర్శన మరింత శక్తివంతంగా మారింది. 2017లో 30 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత ఆయన గణాంకాలను చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.

Tirumala: టీటీడీ తాజా సమాచారం! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 14 గంటల సమయం!

30 ఏళ్లు దాటకముందు రోహిత్ 153 ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించారు. అప్పట్లో ఆయనను "కన్సిస్టెన్సీ లేని ఆటగాడు" అని పలువురు విమర్శించారు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. 123 ఇన్నింగ్స్‌ల్లోనే 23 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు బాదేశారు. అంటే వయసు పెరిగేకొద్దీ ఆయన ఆట మరింత పదును పెంచుకుంది. ఈ గణాంకాలు చూపిస్తున్నాయంటే, రోహిత్ శర్మ ఇప్పుడు జీవితంలో అత్యుత్తమ దశలో ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..!

ప్రత్యేకించి పెద్ద టోర్నీల్లో రోహిత్ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. 2019 వరల్డ్ కప్‌లో 5 సెంచరీలు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో జాగ్రత్తగా ఆడుతూ, మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ పెంచడం ఆయన ప్రత్యేకత. 30 ఏళ్ల వయసు తర్వాత రోహిత్ ఫిట్‌నెస్, మైండ్‌సెట్, షాట్ సెలెక్షన్ అన్నీ మరో లెవల్‌కు వెళ్లాయి. పూర్వం కంటే క్రమశిక్షణగా ట్రైనింగ్ చేయడం, ఫుడ్ కంట్రోల్, యోగా, మెంటల్ స్ట్రెంగ్త్‌పై దృష్టి పెట్టడం వయసుతో వచ్చిన పరిపక్వతని చూపిస్తుంది.

Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెట్టుబడి ఆప్షన్స్‌..! లైఫ్‌ సైకిల్‌, బ్యాలెన్స్‌డ్‌ పథకాలకు ఆమోదం..!

ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చాలా మంది స్టార్ క్రికెటర్లు 35 ఏళ్ల లోపే రిటైర్ అవుతుంటారు. కానీ రోహిత్ మాత్రం 38 ఏళ్ల వయసులోనూ అదే జోష్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. పవర్‌ప్లే బౌలర్లను ఎదుర్కోవడంలో ఆయనకు ఇంకా అదే జోరు, టైమింగ్ ఉంది. ఫ్యాన్స్ కూడా "ఇది కొత్త రోహిత్ శర్మ యుగం" అని సోషల్ మీడియాలో అంటున్నారు.

అమరావతిలో ఆర్‌బీఐ కార్యాలయానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం – రూ.200 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!!

2027 వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్ వయసు 40 అవుతుంది. అయినప్పటికీ, ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ వరకు ఆడటం ఆయనకు పెద్ద సవాలు కాదని అనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్థిరమైన ఫిట్‌నెస్, బలమైన మైండ్‌సెట్, మరియు ఆటపై ప్రేమ ఉంటే ఇంకా రెండేళ్లు, మూడు ఏళ్లు సులభంగా కొనసాగగలడు.

Economic Zone: ఏపీలో 20 వేల ఎకరాల ఎకనామిక్ జోన్! 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం... మారబోతున్న ఆ 8 జిల్లాల రూపురేఖలు!

మొత్తానికి, రోహిత్ శర్మ కెరీర్ రెండు దశలుగా విడిపోయినట్లే ఉంది  30 ఏళ్లకు ముందు “టాలెంటెడ్ బటర్”, 30 తర్వాత “రికార్డ్స్ మాస్టర్”. వయసు ఒక సంఖ్య మాత్రమే, కానీ రోహిత్ దాన్ని ‘ప్రేరణ’గా మార్చుకున్నాడు. రోహిత్ శర్మకి వయసు పెరగడం కాదు, అది మరో స్థాయిలో పరుగుల వేటకు నాంది అయింది.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా! జొన్న రొట్టె vs రాగి రొట్టె.. ఇదే బెస్ట్!
National Highway: ఏపీలో కొత్తగా మూడు రహదారులకు ప్రతిపాదనలు! ఆ జిల్లాకు మహర్దశ!
మరో 200 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలని ప్లాన్! మీరు ఎక్కడైనా భూమి ఇవ్వండి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్య!
ఏపీకి రెడ్ అలెర్ట్ - 'మొంథా' తుఫా! 90-110 కి.మీ. వేగంతో.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్!
Chiranjeevi: కోర్టు కీలక ఆదేశాలు! చిరంజీవి ఫోటోలు, వాయిస్‌, పేరు వాడితే కఠిన చర్యలు!
ఏపీలో 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ప్లాన్! ప్రభుత్వం ముందడుగు
Win India: RO-KO కాంబినేషన్ అద్భుతం.. భారత్‌కి ఘన విజయం!