Healthy Diet: పెరుగు, గ్రీక్ యోగర్ట్, స్కైర్‌లో ఏదిలో ఎక్కువ ప్రోటీన్‌? మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్‌ అంటే...!!

2026-01-16 14:45:00
పండగ వేళ బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే ఆఫర్‌.. 5000GB డేటా, OTT ప్రయోజనాలు - 20% డిస్కౌంట్!

ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ప్రజల ఆహార అలవాట్లలో పెద్ద మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రోటీన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఏ ఆహారంలో ఎంత పోషక విలువ ఉందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాలతో తయారయ్యే ఆహారాల్లో పెరుగు, గ్రీక్ యోగర్ట్, స్కైర్ అనే పేర్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకేలా కనిపించినా, వాటి తయారీ విధానం, రుచి, పోషక విలువల్లో మాత్రం స్పష్టమైన తేడాలు ఉన్నాయి.

Fastag Rules: కొత్త రూల్స్.. వాహనదారులకు అలర్ట్.. ఇకపై అలా కుదరదు..!

మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ఉండే ఆహారం పెరుగు. భోజనం చివర్లో పెరుగు ఉంటే కడుపు చల్లబడుతుందని, జీర్ణక్రియ బాగా జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పాలలో కొద్దిగా మజ్జిగ లేదా పాత పెరుగు కలిపి సహజంగా పులియబెట్టడం ద్వారా పెరుగు తయారవుతుంది. దీనిలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటంతో కడుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్రోటీన్ పరంగా చూస్తే పెరుగులో మోతాదు తక్కువే. సాధారణంగా 100 క్యాలరీల పెరుగులో సుమారు 5 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అయినా రోజూ తినేందుకు, తేలికగా జీర్ణమయ్యే ఆహారంగా పెరుగు ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.

అందరికీ అన్నీ తినే అదృష్టం ఉండదు.. చిరు వంటలు.. వెంకీ చమత్కారాలు!

ఇక గ్రీక్ యోగర్ట్ విషయానికి వస్తే, ఇది సాధారణ పెరుగుతో పోలిస్తే కాస్త గట్టిగా, క్రీమీయుగా ఉంటుంది. పాలను పులియబెట్టిన తర్వాత దానిలోని నీటి భాగాన్ని వడకట్టి తీసేయడం వల్ల ఇది తయారవుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రోటీన్ శాతం పెరుగుతుంది. 100 క్యాలరీల గ్రీక్ యోగర్ట్‌లో దాదాపు 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే వ్యాయామం చేసే వారు, త్వరగా ఆకలి వేయకుండా ఉండాలనుకునే వారు గ్రీక్ యోగర్ట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పండ్లతో కలిపి తినినా, ఉప్పు వేసి డిప్‌లా ఉపయోగించినా ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మరో దాడి.. ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు! మైనారిటీల గుండెల్లో మంట!

ఇప్పుడు ఆరోగ్య ప్రపంచంలో కొత్తగా వినిపిస్తున్న పేరు స్కైర్. ఇది మొదట ఐస్లాండ్ దేశానికి చెందిన ఆహారం. స్కిమ్ మిల్క్‌తో తయారయ్యే ఈ స్కైర్‌ను గ్రీక్ యోగర్ట్ కంటే కూడా ఎక్కువగా వడకడతారు. అందువల్ల ఇందులోని నీటి భాగం చాలా వరకు తొలగిపోతుంది. ఫలితంగా ఇది చాలా గట్టిగా, మృదువుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ పరంగా ఇది మిగతా రెండింటికంటే ముందుంది. 100 క్యాలరీల స్కైర్‌లో సుమారు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉండటం, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారుతోంది.

బీజేపీ కొత్త బాస్ ఎవరు? జనవరి 20న ప్రకటన.. బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన.. రేసులో ముందున్న!

రుచి పరంగా చూస్తే పెరుగు చాలా మైల్డ్‌గా ఉంటుంది. మన సంప్రదాయ వంటకాలతో ఇది సులభంగా కలిసిపోతుంది. గ్రీక్ యోగర్ట్‌లో కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. స్కైర్ మాత్రం రుచి చాలా సాఫ్ట్‌గా ఉండి, పైగా వేసే పండ్లు లేదా తేనె రుచిని బాగా తీసుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరి అవసరాన్ని బట్టి ఎంపిక మారుతుంది.

Greenland: గ్రీన్లాండ్ వద్ద ఉద్రిక్తత... భారీగా యూరోపియన్ సైనిక బలగాల మోహరింపు!

మొత్తానికి ఎక్కువ ప్రోటీన్ కావాలంటే స్కైర్ ఉత్తమం. ప్రోటీన్‌తో పాటు రుచి, మల్టీ యూజ్ కావాలంటే గ్రీక్ యోగర్ట్ సరైన ఎంపిక. రోజువారీ భోజనంలో జీర్ణక్రియకు మేలు కావాలంటే పెరుగు ఇప్పటికీ బెస్ట్. శరీరానికి ఏది అవసరమో అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకుంటేనే నిజమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది.

Balagam Venu: సెంటిమెంట్‌నే నమ్ముకున్న బలగం వేణు… ఎల్లమ్మ తో మరో ప్రయత్నం!
Cockfight News: ఒక్కరోజులోనే రూ.1.53 కోట్ల రికార్డు గెలుపు..!!
Jana Nayagan : జన నాయగన్ పై SC హ్యాండ్‌ఆఫ్.. హైకోర్టుకే తుది నిర్ణయం!
Bloodshed in Iran: ఇరాన్‌లో రక్తపాతం.. నిరసనల్లో 12 వేల మందికిపైగా మృతి!

Spotlight

Read More →