Chickentahari: బిర్యానీకి మించిన రుచి.. హైదరాబాదీ చికెన్ తహారీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం! Weight Loss: ఉదయాన్నే రాగి ఊతప్పం.. ఆరోగ్యం మరియు రుచికి కేరాఫ్ అడ్రస్! Cucumber Pachdi: నోరూరించే దోసకాయ రోటి పచ్చడి.. ఒక్కసారి ఈ స్టైల్ లో చేయండి అదిరిపోయే రుచి మీ సొంతం! Majjiga Atlu: అమ్మమ్మల నాటి కమ్మని 'మజ్జిగట్లు'.. స్పాంజ్ లాంటి అట్లు ఈజీ ప్రాసెస్! TomatoOmelet: నోరూరించే స్పైసీ టొమాటో ఆమ్లెట్..! కేవలం 10 నిమిషాల్లో రెడీ! Thandai: శివరాత్రి స్పెషల్ ఎనర్జీ డ్రింక్... ఇంట్లోనే టేస్టీ 'థండాయ్' తయారు చేసుకోండిలా! American Lamb Benefits: అమెరికన్లు ఈ మాంసాన్ని ఎందుకు ఇంత పిచ్చిగా ఇష్టపడతారో తెలుసా? Coconut Chutney: ఒకసారి ఇలా కొబ్బరి పచ్చడి చేసి చూడండి…! భోజనం రుచి రెట్టింపుగా..! Chickentahari: బిర్యానీకి మించిన రుచి.. హైదరాబాదీ చికెన్ తహారీ.. ఇంట్లోనే ఇలా చేసేయండి! Boneless Biryani: హోటల్ స్టైల్ చికెన్ బోన్‌లెస్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చిటికెలో చేసేయండి! Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం! Weight Loss: ఉదయాన్నే రాగి ఊతప్పం.. ఆరోగ్యం మరియు రుచికి కేరాఫ్ అడ్రస్! Cucumber Pachdi: నోరూరించే దోసకాయ రోటి పచ్చడి.. ఒక్కసారి ఈ స్టైల్ లో చేయండి అదిరిపోయే రుచి మీ సొంతం! Majjiga Atlu: అమ్మమ్మల నాటి కమ్మని 'మజ్జిగట్లు'.. స్పాంజ్ లాంటి అట్లు ఈజీ ప్రాసెస్! TomatoOmelet: నోరూరించే స్పైసీ టొమాటో ఆమ్లెట్..! కేవలం 10 నిమిషాల్లో రెడీ! Thandai: శివరాత్రి స్పెషల్ ఎనర్జీ డ్రింక్... ఇంట్లోనే టేస్టీ 'థండాయ్' తయారు చేసుకోండిలా! American Lamb Benefits: అమెరికన్లు ఈ మాంసాన్ని ఎందుకు ఇంత పిచ్చిగా ఇష్టపడతారో తెలుసా? Coconut Chutney: ఒకసారి ఇలా కొబ్బరి పచ్చడి చేసి చూడండి…! భోజనం రుచి రెట్టింపుగా..!

American Lamb Benefits: అమెరికన్లు ఈ మాంసాన్ని ఎందుకు ఇంత పిచ్చిగా ఇష్టపడతారో తెలుసా?

American Lamb Benefits: అమెరికన్ లాంబ్ కేవలం రుచికరమైనదే కాదు, ప్రోటీన్ విటమిన్ B12 నిండిన సూపర్ ఫుడ్. కండరాల పుష్టికి, రోగనిరోధక శక్తికి మేలు చేసే ఈ మాంసాన్ని గ్రీక్ స్టైల్‌లో ఎలా వండాలో తెలుసుకోండి..

Published : 2026-02-14 09:57:00

15 నిమిషాల్లో అదిరిపోయే గ్రీక్ స్టైల్ లాంబ్ చాప్స్…

జ్యూసీ లాంబ్ చాప్స్ & క్రీమీ అవకాడో డిప్…

అమెరికన్ లాంబ్.. కేవలం రుచి మాత్రమే కాదు.. పోషకాల గని!

అమెరికన్ లాంబ్ అనేది కేవలం రుచికరమైన మాంసం మాత్రమే కాదు, ఇది శరీరానికి అవసరమైన పోషకాల గని. ఇందులో కండరాల పెరుగుదలకు తోడ్పడే అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు, రోగనిరోధక శక్తిని పెంచే జింక్, సెలీనియం  రక్తాన్ని వృద్ధి చేసే 'హీమ్ ఐరన్' పుష్కలంగా ఉంటాయి.

ముఖ్యంగా అమెరికాలో లభించే గొర్రె మాంసంలో విటమిన్ బి12 ఎక్కువగా ఉండటం వల్ల ఇది నరాల ఆరోగ్యానికి, శక్తి స్థాయిలను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు శరీర కొవ్వును తగ్గించే సి.ఎల్.ఏ (CLA) కూడా ఇందులో ఉంటాయి. తక్కువ కేలరీలు ఉండి, సులభంగా జీర్ణమయ్యే ఈ మాంసం, ఎటువంటి అదనపు హార్మోన్లు లేకుండా లభించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

అమెరికాలో మనకు కాస్ట్కో లేదా హోల్ ఫుడ్స్ వంటి స్టోర్లలో చాలా మంచి క్వాలిటీ ఉన్న 'లాంబ్ రాక్'  దొరుకుతుంది. అక్కడ దొరికే మాంసం చాలా ఫ్రెష్‌గా, జ్యూసీగా ఉంటుంది కాబట్టి,  గ్రీక్ స్టైల్ వంటకానికి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. తక్కువ టైమ్‌లో ఏదైనా అదిరిపోయే డిష్ చేయాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్.

ముందుగా ఆ లాంబ్ రాక్‌ను తీసుకుని విడివిడి ముక్కలుగా  కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటికి ఆలివ్ ఆయిల్ బాగా పట్టించి, మన దగ్గర ఉండే రకరకాల సీజనింగ్స్—ముఖ్యంగా సాల్ట్, పెప్పర్, అల్లం  వెల్లుల్లి పేస్ట్   ఒరిగానో వంటివి దట్టంగా వేయాలి. అమెరికాలో దొరికే 'గ్రీక్ సీజనింగ్' మిక్స్ వాడితే ఆ రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.

ఇక స్టవ్ మీద  పాన్ లేదా గ్రిల్ పెట్టి బాగా వేడి చేయాలి. ఈ ముక్కలను వేసి ప్రతి వైపు కేవలం మూడు నుండి నాలుగు నిమిషాలు 'సియర్'  చేయాలి. అమెరికన్ స్టైల్ కుకింగ్‌లో ఈ సీరింగ్ వల్ల మాంసం పైన క్రిస్పీగా మారి, లోపల ఉన్న జ్యూస్ బయటకు పోకుండా భలే రుచిగా తయారవుతుంది.

దీనికి కాంబినేషన్‌గా చేసే సాస్ కోసం మనకు  లోకల్ మార్కెట్లలో దొరికే ఫ్రెష్ అవకాడోలను వాడుకోవాలి. మిక్సీలో అవకాడో ముక్కలు, గ్రీక్ యోగర్ట్ (Greek Yogurt), మయోనైస్, కొంచెం డిజోన్ మస్టర్డ్, నిమ్మరసం మరియు ఫ్రెష్ పార్స్లీ వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ క్రీమీ సాస్ ఆ లాంబ్ ముక్కలకి ఒక మంచి రిచ్ టేస్ట్‌ను ఇస్తుంది.

అంతే కేవలం పదిహేను నిమిషాల్లో అమెరికాలో దొరికే బెస్ట్ ఇంగ్రీడియెంట్స్‌తో మీ గ్రీక్ లాంబ్ చాప్స్ రెడీ అయిపోతాయి. వీకెండ్ పార్టీల్లో మీ ఫ్రెండ్స్‌కు లేదా అతిథులకు ఇది వడ్డిస్తే, వారు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఆ అవకాడో డిప్‌తో కలిపి ఈ జ్యూసీ ముక్కలను తింటుంటే ఉండే మజాయే వేరు.

Spotlight

Read More →