Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! HPV Vaccine: మహిళల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం పెద్ద అడుగు... 14 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఉచితంగా HPV! Loans: చిటికెలో లోన్.. సులభమైన వాయిదాలు... నేటి ట్రెండ్ ఇదే! Solar Battery: సోలార్ బ్యాటరీ బ్యాంక్ లైఫ్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! Finger Prints:వేలిముద్రల వెనుక ఉన్న అసలు రహస్యం! అవి ఎందుకు మారవు? AP Assembly: బయట తిరగొద్దు.. సభలోనే ఉండండి.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు వాటి పైనే చర్చ.!! Earthquake: ఆ రెండు నగరాలకు భూకంప ముప్పు.. ఐఐటీ పరిశోధనలో షాకింగ్ నిజాలు! Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం...! Sunil: సునీల్ అరెస్ట్ పై.‌. నాడు అరాచకాలు! నేడు 'విక్టిమ్ కార్డ్'! అసలు నిజాలపై విశ్లేషణ! Chandrababu: మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి తొలి పర్యటన... వెలిగొండ ప్రాజెక్టుకు పూర్వవైభవం! ఫీడర్ కెనాల్ కు నేడే శంకుస్థాపన! Land Rights: భూ సమస్యలకు ఎండ్ కార్డ్..! 22ఏ జాబితాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! HPV Vaccine: మహిళల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం పెద్ద అడుగు... 14 ఏళ్ల లోపు అమ్మాయిలకు ఉచితంగా HPV! Loans: చిటికెలో లోన్.. సులభమైన వాయిదాలు... నేటి ట్రెండ్ ఇదే! Solar Battery: సోలార్ బ్యాటరీ బ్యాంక్ లైఫ్ పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! Finger Prints:వేలిముద్రల వెనుక ఉన్న అసలు రహస్యం! అవి ఎందుకు మారవు? AP Assembly: బయట తిరగొద్దు.. సభలోనే ఉండండి.. మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు వాటి పైనే చర్చ.!! Earthquake: ఆ రెండు నగరాలకు భూకంప ముప్పు.. ఐఐటీ పరిశోధనలో షాకింగ్ నిజాలు! Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం...! Sunil: సునీల్ అరెస్ట్ పై.‌. నాడు అరాచకాలు! నేడు 'విక్టిమ్ కార్డ్'! అసలు నిజాలపై విశ్లేషణ! Chandrababu: మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి తొలి పర్యటన... వెలిగొండ ప్రాజెక్టుకు పూర్వవైభవం! ఫీడర్ కెనాల్ కు నేడే శంకుస్థాపన!

Sunil: సునీల్ అరెస్ట్ పై.‌. నాడు అరాచకాలు! నేడు 'విక్టిమ్ కార్డ్'! అసలు నిజాలపై విశ్లేషణ!

IPS Sunil Naik Arrest: ఏపీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్ ప్రయత్నం రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. నిందితుడు తన కులాన్ని అడ్డం పెట్టుకుని విచారణ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ పోలీసులు న్యాయ పోరాటం ద్వారా ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published : 2026-02-25 10:21:00

కిడ్నాప్ కాదు.. అది చట్టబద్ధమైన అరెస్ట్..

కస్టోడియల్ టార్చర్ కేసులో 'గిరిజన కార్డు'.. 

సునీల్ నాయక్ తీరుపై విమర్శలు…

IPS Sunil Naik Arrest: ప్రస్తుత స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు ఏపీ  బీహార్ పోలీసుల మధ్య హైడ్రామాకు దారితీసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు పాట్నా వెళ్లిన ఏపీ పోలీసుల బృందాన్ని అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మీక్షి పత్రిక ప్రచురించిన కథనాలు, వాడుతున్న 'గిరిజన కార్డ్'పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కిడ్నాప్ కాదు.. అది అధికారిక అరెస్ట్ ప్రయత్నం!
మీక్షి తన కథనంలో ఏపీ పోలీసులు గోడలు దూకి సునీల్ నాయక్‌ను కిడ్నాప్ చేయబోయారని రాసింది. కానీ అసలు నిజం ఏంటంటే, సునీల్ నాయక్ ఉంటున్న నివాసం గోడలు 10 అడుగుల కంటే ఎత్తులో ఉన్నాయి. పోలీసులు గేటు నుంచే లోపలికి వెళ్లారు. తెల్లవారుజామున వెళ్లడం వల్ల కొంత హడావిడి జరిగిన మాట వాస్తవమే కానీ, అది కిడ్నాప్ ప్రయత్నం అనడం శుద్ధ అబద్ధం అని రాజకీయ విశ్లేషలకు  అభిప్రాయపడుతున్నారు. ఒక నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు అనుసరించే సాధారణ వ్యూహాన్ని 'కిడ్నాప్'గా చిత్రీకరించడం వెనుక రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది.

వారెంట్ లేకపోవడానికి కారణం ఏంటి?
ఈ కేసులో వారెంట్ లేదని మీక్షి గగ్గోలు పెడుతోంది. వాస్తవానికి ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. పైగా సునీల్ నాయక్ ఒక ఐపీఎస్ అధికారి. ఇక్కడ కోర్టులో వారెంట్ తీసుకుంటే, ఆయన సహచరులు అప్రమత్తం చేసే అవకాశం ఉంది. అప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాని వ్యక్తిని పట్టుకోవడానికి వారెంట్ కంటే ముందస్తు వ్యూహమే ముఖ్యం.

కులాల విద్వేషం.. విక్టిమ్ కార్డ్!
నేను గిరిజనుడిని కాబట్టే నన్ను వేధిస్తున్నారంటూ సునీల్ నాయక్ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తప్పు జరిగినప్పుడు గుర్తుకురాని కులం, విచారణ ఎదుర్కోవాల్సి వచ్చేసరికి గుర్తుకురావడం విడ్డూరం. రఘురామరాజును కొట్టినప్పుడు సునీల్ నాయక్ అక్కడే ఉన్నారని సాక్షులు చెబుతున్నారు. ఒకవేళ ఆయన తప్పు చేయకపోతే విచారణకు వచ్చి ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదు? అక్రమంగా ఇరికించారని ఆరోపించే ముందు, చట్టానికి ఎందుకు సహకరించడం లేదన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న.

మీక్షి ద్వంద్వ వైఖరి
చంద్రబాబు నాయుడు తన కులం వారితో గిరిజన అధికారిని వేధిస్తున్నారని మీక్షి రాస్తుంది. మరి ఇదే కేసులో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన తులసీబాబు చౌదరి, దామోదర్ వంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఈ 'కులం' యాంగిల్ ఎటు పోయింది? అప్పుడు లేని కులాల ప్రస్తావన, సునీల్ నాయక్ విషయంలోనే ఎందుకు వస్తోంది? జగన్ మోహన్ రెడ్డి హయాంలో కావాలనే ఎస్సీ, ఎస్టీ అధికారులతో అరాచకాలు చేయించి, ఇప్పుడు వారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారనే అనుమానాలు మరింత  బలపడుతున్నాయని సందేహమే లేదు.

తదుపరి అడుగు ఎటు?
ప్రస్తుతం పాట్నా సివిల్ కోర్టు నెల రోజుల వరకు స్టే ఇచ్చినప్పటికీ, ఏపీ పోలీసులు వెనక్కి తగ్గడం లేదు. పాట్నా హైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని ప్రభుత్వం  భావిస్తుంది. ఈ కేసులో లోతుగా విచారణ జరిగితే భవిష్యత్తులో జగన్ మోహన్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం  ఉంటుంది సుమీ.

Spotlight

Read More →