Turmeric Milk: పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం! Thyroid: థైరాయిడ్ ఉన్నవారికి చలికాలం సవాల్‌..! ఇవి తింటే ప్రమాదమే! Sleep: స్ట్రెస్ తగ్గి.. నిద్ర పెరగాలంటే ఈ రూటీన్ ఫాలో అవ్వండి! Bitter bottle gourd: చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ ప్రాణాంతకం.. ICMR హెచ్చరిక! Heart Surgery: గుండె శస్త్రచికిత్సకు సరైన సమయం ఇదే! కొత్త అధ్యయనంలో కీలక విషయాలు! Health Benefits: పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది? తినేముందు తప్పక తెలుసుకోండి..!! టమాటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! లేకపోతే.. Osteoarthritis: వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులకు చెక్..! స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల సంచలన పరిశోధన! Heart works: మీ గుండె ఎంత కష్టపడుతుందో తెలుసా.. తెలుసుకోండి, జాగ్రత్త పడండి! Night Snoring Problems: గురకను లైట్ తీసుకుంటున్నారా? నిద్రలోనే ఆ సమస్య ముప్పు పెరుగుతుందంటున్న నిపుణులు..!! Turmeric Milk: పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం! Thyroid: థైరాయిడ్ ఉన్నవారికి చలికాలం సవాల్‌..! ఇవి తింటే ప్రమాదమే! Sleep: స్ట్రెస్ తగ్గి.. నిద్ర పెరగాలంటే ఈ రూటీన్ ఫాలో అవ్వండి! Bitter bottle gourd: చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ ప్రాణాంతకం.. ICMR హెచ్చరిక! Heart Surgery: గుండె శస్త్రచికిత్సకు సరైన సమయం ఇదే! కొత్త అధ్యయనంలో కీలక విషయాలు! Health Benefits: పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది? తినేముందు తప్పక తెలుసుకోండి..!! టమాటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! లేకపోతే.. Osteoarthritis: వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులకు చెక్..! స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల సంచలన పరిశోధన! Heart works: మీ గుండె ఎంత కష్టపడుతుందో తెలుసా.. తెలుసుకోండి, జాగ్రత్త పడండి! Night Snoring Problems: గురకను లైట్ తీసుకుంటున్నారా? నిద్రలోనే ఆ సమస్య ముప్పు పెరుగుతుందంటున్న నిపుణులు..!!

Thyroid: థైరాయిడ్ ఉన్నవారికి చలికాలం సవాల్‌..! ఇవి తింటే ప్రమాదమే!

2026-01-13 09:19:00

శీతాకాలం ప్రారంభమయ్యే సరికి థైరాయిడ్ సమస్యలున్నవారిలో అలసట, నీరసం, బరువు పెరగడం, చలికి ఎక్కువగా ఇబ్బంది పడటం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. చలికాలంలో శరీరపు మెటబాలిజం మందగించడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత మరింత ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం అత్యంత కీలకం. తప్పుడు ఆహార అలవాట్లు మందుల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా సమస్యలను మరింత పెంచుతాయి. కాబట్టి శీతాకాలంలో ఏమి తినాలి? ఏమి తినకూడదు? అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే.

డాక్టర్ అమిత్ కుమార్ సూచనల ప్రకారం, శీతాకాలంలో బయట దొరికే వేయించిన, కారంగా ఉండే జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి బరువు పెరుగుదలకు కారణమవుతాయి. అలాగే సోయా ఆధారిత ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి కూరగాయలను పచ్చిగా తినడం కూడా థైరాయిడ్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. అధిక చక్కెర, శుద్ధి చేసిన పిండి, బేకరీ పదార్థాలు, తీపి పదార్థాలు పూర్తిగా నివారించాలి. టీ, కాఫీని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు. ఈ ఆహారాలను నియంత్రించడం వల్ల లక్షణాలను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.

అదే సమయంలో, థైరాయిడ్ ఉన్నవారు శీతాకాలంలో పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పరిమితంగా వెచ్చని పాలు, పెరుగు, జున్ను తీసుకోవడం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణంగా దొరికే పండ్లు, సంపూర్ణ ధాన్యాలు శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. బాదం, వాల్‌నట్, అవిసె గింజలు వంటి డ్రై ఫ్రూట్స్ శరీరాన్ని వేడిగా ఉంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సరిపడా ప్రోటీన్ తీసుకోవడం వల్ల అలసట తగ్గి శరీరం చురుకుగా ఉంటుంది. ఈ ఆహారాలు థైరాయిడ్ రోగుల ఆరోగ్యాన్ని దీర్ఘకాలంగా కాపాడుతాయి.

ఆహారంతో పాటు జీవనశైలి మార్పులు కూడా తప్పనిసరి. ప్రతిరోజూ మందులను నిర్ణీత సమయంలో తీసుకోవాలి. చలికాలంలో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవాలి. తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తగినంత నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. అలాగే థైరాయిడ్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించించుకుంటూ ఉండాలి. ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే శీతాకాలంలోనూ థైరాయిడ్ సమస్యలను సమర్థంగా నియంత్రించుకోవచ్చు.

Spotlight

Read More →