AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు!

11 సీట్లు కూడా మిగలవు.. జాగ్రత్త! కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక చేసుకునేది కాదు..

కులాలను విడగొట్టే రాజకీయం ఇక సాగదు – పవన్ కళ్యాణ్ 'కులాలను కలిపే' సిద్ధాంతమే గెలుపు మంత్రం – వైసీపీ ద్వంద్వ వైఖరిని నిలదీసిన జనసేన ఎమ్మెల్సీ – వంగవీటి రంగా గారిపై వైసీపీది కపట ప్రేమే!

Published : 2026-02-08 16:24:00
  • కాపులకు వైసీపీ చేసిన అన్యాయంపై ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్న…
  • అంబటిని ఐకాన్‌గా చూపడం వల్లే వైసీపీ నష్టపోయిందని విమర్శ…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, విమర్శలు మరోసారి వేడెక్కాయి. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు సామాజికవర్గ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే, భవిష్యత్తులో వైసీపీకి ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవని ఆయన ఘాటుగా హెచ్చరించారు.

నాగబాబు సంధించిన విమర్శలు, జనసేన సిద్ధాంతాల విశ్లేషణ ఇక్కడ ఉంది. నాగబాబు మాట్లాడుతూ, సమాజంలో కులం అనేది ఒక కాదనలేని వాస్తవికత అని, దానిని గౌరవిస్తూనే అందరినీ కలుపుకుపోవడమే జనసేన లక్ష్యమని చెప్పారు. అధిక సంఖ్యలో ఉన్న కులాలు, తక్కువ జనాభా ఉన్న వర్గాలకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అనకాపల్లిలో 40 శాతం కాపు జనాభా ఉన్నప్పటికీ, బీసీ నేత కొనతాల రామకృష్ణకు సీటు కేటాయించి గెలిపించుకున్నామని, అలాగే విశాఖ సౌత్‌లో వంశీకృష్ణ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించడం తమ 'కులాలను కలిపే' సిద్ధాంతానికి నిదర్శనమని స్పష్టం చేశారు.

వైసీపీలోని అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నాయకులను ఉద్దేశించి నాగబాబు పలు ప్రశ్నలు లేవనెత్తారు. గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాల్లో 20 శాతం బలిజ, కాపులు ఉన్నా, కేవలం ఒక్క అసెంబ్లీ సీటు (పర్చూరు) మాత్రమే ఎందుకు ఇచ్చారు? ఎంపీ సీట్లు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. తరతరాలుగా బలిజలు గెలుస్తున్న రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టినప్పుడు మీ నాయకుడిని ఎందుకు నిలదీయలేదు? 'కాపు నేస్తం' పథకానికి కాపు కులంలోని మహానుభావుల పేర్లు పెట్టాలని జగన్ మోహన్ రెడ్డిని అడిగే ధైర్యం మీకు ఉందా? అని దుయ్యబట్టారు.

వంగవీటి మోహన రంగా గారిని వైసీపీ కేవలం ఓట్ల కోసమే వాడుకుంటోందని నాగబాబు ఆరోపించారు. రంగా గారి కుమారుడు రాధాను పార్టీ నుంచి పంపివేసి, రంగా గారిని దూషించిన గౌతం రెడ్డికి పదవులు కట్టబెట్టడం వైసీపీ నైజమని విమర్శించారు. కాపులను కించపరిచేలా మాట్లాడే అంబటి రాంబాబు వంటి వారిని కాపు ఐకాన్లుగా చూపాలని చూడటం హాస్యాస్పదమని, ఆ ఆలోచనే వైసీపీని ముంచిందని అన్నారు.

చివరగా నాగబాబు హెచ్చరిస్తూ.. "ఇది పాతకాలం నాటి రాజనాల రాజకీయాల కాలం కాదు. నేటి తరం యువత (Gen-Z) చాలా తెలివైనది. కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటామంటే ప్రజలు ఒప్పుకోరు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే, అసెంబ్లీలో ఉన్న ఆ 11 సీట్లు కూడా గాలిలో కలిసిపోతాయి" అని హితవు పలికారు.

Spotlight

Read More →